రంజాన్
రంజాన్ ____ పిళ్లా కుమారస్వామి పండుగ అంటే శుభవేళ, ఉత్సాహం అని అర్థం. పండుగలు మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అది ఏ మతమైనా భారతీయులు కలిసిమెలిసి చేసుకుంటారు. ఒకరి పండుగను ఇంకొకరు గౌరవించుకుంటారు. పండుగ మనుషుల జీవితాల్లో వెలుగు తెచ్చేదిగా, ఆనందాన్నిచ్చేదిగా భావిస్తారు. పండుగ రోజు ఆనందంగా ఉండటం సహజం. ఒక్కో పండుగ ఒక్కో కారణంగా ఏర్పడింది. కాకపోతే ఎక్కువ భాగం రుతువులను బట్టి ఏర్పడినాయి. దీనికి ప్రధాన కారణం పూర్వం ప్రజలు ప్రకృతిని ఆరాధించటమే. తరువాత కాలక్రమంలో దైవభావన తోడై ప్రతిపండుగకు దేవున్ని స్మరించడం ఒక అలవాటుగా మారిపోయింది. రంజాన్ పండుగ ముస్లింలు అత్యంత పవిత్రగంగా జరుపుకొనే పండుగ. ముస్లింలు చంద్రమాన కాలపట్టికను అనుసరిస్తారు. చంద్రమానం ప్రకారం వచ్చే తొమ్మిదవనెల రంజాన్. దీనిని అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. 'ఖురాన్' గ్రంథం ఈనెలలో ఆవిర్భవించడం వల్ల ఈనెలను పవిత్రమాసంగా పరిగణిస్తారు. అయితే, ఖురాన్ రాతప్రతుల రూపంలో మౌఖిక సంప్రదాయాల ద్వారా సంకలనం చేయబడిందని చారిత్రక అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి, ఖురాన్ ఏ నెలలో ప్రాచుర్యంలోకి వచ్చిందో స్పష్టమైన ఆధారాలు లేవు. క్రమశి...