ఎన్ని కలల ఉగాది!!!
ఓ ఉగాది
ప్రతి ఏటా కొత్త రాగాలను పలికిస్తున్నావు
కొత్త చివర్లతో ప్రకృతిని పులకింపజేస్తున్నావ్
నవ నవోన్వేషంగా వస్తున్నావు
ఎన్నికల నీ మోసుకొస్తున్నావ్
ఓ ఉగాది నీ కోసం ఎన్ని కలలు కన్నాం
నువ్వు వస్తే కుల మతాల సరిహద్దులు జరిగిపోతాయనుకున్నాం
నువ్వు వస్తే మానవత్వం పరిమళాలు వెదజల్ల పడతాయనుకున్నాం మగువలు నడుంబిగించి అన్నింటిలో రాణిస్తారనుకున్నాం
నిరుద్యోగం లేని ధరలు పెరగని లోకాన్ని చూస్తామనుకున్నాం.
ఎన్నెన్ని అనుకున్నాం ఎన్నెన్ని కలలు కన్నాం
ఎన్నికల లలో వాళ్లు ఎన్నో కలలని మాకు చూపిస్తున్నారు
ఆ కలల ప్రపంచం ఇప్పుడు కల్లోల ప్రపంచం గా మారిపోయింది
ఏమని చెప్పను ఉగాది
ఇక్కడ షరా మామూలే
యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.
మత విద్వేషాలు చెల్లరేగుతూనే ఉన్నాయి
కులోన్మాదాలు కుమ్ములాడుతూనే ఉన్నాయి.
అతివల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి
ఆరుగాలం చమట చిందించే రైతన్నలు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కుతూ మరో ఉగాదిని చూడకుండానే రాలిపోతున్నారు
అవినీతిపరులు పార్టీలు మారగానే పునీతులవుతున్నారు
ఏమని చెప్పను ఓ ఉగాది!
నిన్నేమని కోరను ఉగాది?
ప్రభవలో ఆకాశవాణిలో కోరినాం
విభవలో దూరదర్శన్ లో ఎలుగెత్తి ప్రార్థించినాం
చివరకు అక్షయ లో కూడా
ప్రాధేయపడినాం ఒక్కసారైనా కోయిల స్వరంతో
మా నవ్వుల రాగాలు శృతి కలపమని
అందరిలో ప్రేమ పుష్పాలను వికసించనీయమని.
ఈ చిన్ని కలను నెరవేర్చవా క్రోధీ ?

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి