వ్యవసాయ సంబంధ సామెతలు
వ్యవసాయ సంబంధ సామెతలు
మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేస్తుంది
మఖలో పుట్టి పుబ్బలో మాడినట్టు
మూల ముంచును జేష్ఠ తేల్చును
ఉత్తరలో విత్తితే ఊదుకుని తినడానికి ఉండదు
స్వాతి కురిస్తే చీమ కైనా తాపం
హస్త చల్లితే హస్తం లోకి రావు
భరణి కురిస్తే ధరణి పండుతుంది
రోహిణి కార్తె లో విత్తుట రోటిలో విత్తుటే
ఉత్తర చూడర ఎత్తర గంప
ఉత్తర పదును ఉలవకు అదును
రోహిణిలో రోళ్ళు కూడా పగులుతాయంట
కదురూ కవ్వం ఆడితే కరవు ఉండదు
రైతు పెరిగితే రాజు పెరుగుతాడు
నాగలి ఉన్న ఊర్లో ఆకలి ఉండదు
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి తో దీటు కాదు
వానలు కురిస్తేనే వసుంధర
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి