కవిత్వం____అరిస్టాటిల్

Aristotle కవిత్వం____అరిస్టాటిల్ కవిత్వం మానవ ప్రవృత్తి లో భాగంగా సృజింపబడుతుంది మానవ ప్రవృత్తిలో అనుకరించడం ఉంది. అనుకరణ చూసి ఆనందించడం ఉంది. అనుకరణ ద్వారానే మనిషి ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు. అనుకరణవల్ల సృజింపబడిన వస్తువులు చూసి మనిషి ఆనందిస్తాడు. చిత్రకారుడు ప్రకృతి దృశ్యాలను చిత్రీకరిస్తాడు. కవి మానవ స్వభావాన్ని ప్రతిబింబిస్తాడు. అతడు సాధించిన విజయాలను గానం చేస్తాడు. అనుకరణ లాగానే మాధుర్యం, లయ కూడా మానవునికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ కారణాల వల్ల కవిత్వం సృజింపబడుతుంది. కవి వ్యక్తిగత దృక్పథం వలన కవిత్వం రెండు భాగాలుగా విడిపోయింది 1 గొప్ప వ్యక్తులు సాధించిన ఘన విజయాలను చిత్రించడం 2 సామాన్య వ్యక్తులను అల్ప కార్యాలను చిత్రించడం.మొదటి రకం కావ్యాలను ఇతిహాసాలు అంటారు .రెండో రకం కావ్యాలు నాటకాలు గా ప్రసిద్ధి చెందాయి. ఇవివిషాదాంతాలూ, సుఖాంతాలూ ఉన్నాయి. సుఖాంతాలు కన్నా విషాదాంతాలు చాలా విలువైనవి. విషాదాంత రచనలకు కొన్ని లక్షణాలు ఉంటాయి ...