జాక్ (జాన్ గ్రిఫిత్) లండన్
జాక్ (జాన్ గ్రిఫిత్) లండన్ 1876 జనవరి 12న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు, నలభైయేండ్ల వయసులో 1916 నవంబరు 22న మరణించాడు. అతడు పేరొందిన అమెరికా కల్పనా పత్రికా రచయిత, సామాజిక కార్యకర్త
వ్యాపార పత్రికలలో కల్పనా సాహిత్యానికి పెద్ద
పీట వేసిన రచయిత. అతడు తన కథలు, నవలల రచన వల్ల ప్రపంచ ప్రఖ్యాతి పొందటమేకాక,అపార ధనంకూడగడించాడు. నిజానికతనురచనను ఒక వ్యాపారంగానూ, తన పేదరికాన్ని పోగొట్టేదిగానూ
భావించాడు. అతడికి ఎంతో పేరు
తెచ్చిన నవలలు Call of the wild (1902), White Fang (1906). ఇవి తెలుగులోకి కూడ అనువాదమయ్యా యి. A Daughter of Snews (1902),Sea Wolf (1904), Iron Heel (1908) కూడాపేర్కొనవల్సిన నవలలే. Theft అన్న నాటకంకూడ రాశాడు. అతని రచనల్లోని గొప్పదనం, అతడు పాఠకుడిని ఒక అసహజ పరిస్థితికి పరిచయం చేస్తూకూడా,
సంఘటనలు సహజమనిపించేంతవిగా ఉండటం. కథల్లో రాబోయే సంఘటనకు అతడు పాఠకుడిని సిద్ధం చేస్తాడు.
ఆ లక్షణం ప్రస్తుత కథలోకూడా వ్యక్తమవుతుంది. మనల్ని అతని కథ చదవడానికి సిద్ధం చేశాక, అతడు ఏ అసంబద్ద కథ చెప్పినా మనం విశ్వసిస్తాం. కార్మిక ఉద్యమ, సామ్యవాద ప్రగతి వాంఛించిన వాడతను. కార్మికుల హక్కుల కోసం అతడెంతో కృషి చేశాడు. అతడు నాస్తికవాది కూడ. .
ఇరవై ఒక్కేళ్ల వయసులో, తన బావగారితో కలిసి అతడు క్లోండిక్ గోల్డ్ రష్ లో పాల్గొన్నాడు. అతని ఆ ప్రయాణం
అతని ఎన్నో కథలకు నేపథ్యాన్ని చేకూర్చింది కానీ, అతని ఆరోగ్యాన్ని పాడు చేసింది. లండన్‌లో తన అతి తాగుడు కారణంగానూ, స్త్రీ వ్యసనం కారణంగానూ ఆత్మహత్య చేసుకున్నాడంటారు కానీ, అందులో నిజం లేకపోవచ్చు.అతని రచనల్లోని సంఘటనలు అలా భావించటానికి అవకాశమిచ్చాయి. అతడు యురేమియా అంటే మూత్రపిండాలలోని రాళ్ల జబ్బుతో మరణించాడు. ఆ జబ్బు వల్ల అతనెంతో నొప్పితో బాధపడేవాడు. బాధానివారణ కోసం మార్ఫిన్ ను తీసుకునేవాడు.
(ప్రపంచ కథా సాహిత్యం నుండి)
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి