కొంత మంది కుర్రవాళ్ళు - శ్రీ శ్రీ


కొంత మంది కుర్రవాళ్ళు
        రచన: శ్రీ శ్రీ

కొంత మంది కుర్రవాళ్ళు

పుట్టుకతో వృద్ధులు

పేర్లకీ పకీర్లకీ

పుకార్లకీ నిబద్ధులు


నడిమి తరగతికి చెందిన

అవగుణాల కుప్పలు

ఉత్తమొద్దు రాచ్చిప్పలు

నూతిలోని కప్పలు 


తాతగారి నాన్నగారి

భావాలకి దాసులు

నేటి నిజం చూడలేని

కీటక సన్యాసులు


వీళ్ళకి కళలన్నా

రసమన్నా చుక్కెదురు

గోలచేసి అరవడ

మొకటే వీళ్ళేరుగుదురు


కొంత మంది కుర్రవాళ్ళు

ముందు తరం దూతలు

పావన నవజీవన

బృందావన నిర్మాతలు


బానిస పంథాలను 

తలవంచి అనుకరించరు

పోనీ అని అన్యాయపు

పోకడలు సహించరు.


వారికి మా ఆహ్వానం

వారికి మా వందనం

వారికి మా ఆహ్వానం

వారికి మా వందనం



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు