భలే మంచి రోజు పసందైన రోజు

MOVIE: JARIGINA KATHA
SINGERS: GHANTASALA
MUSIC: GHANTASALA
LYRICIST: Dr C NARAYANA REDDY

భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు ఆ...
వసంతాలు పూచే నేటి రోజు


(S2) భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు ఆ...
వసంతాలు పూచే నేటి రోజు


 గుండెలోని కోరికలన్నీ
గువ్వలుగా ఎగసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే
గూటిలోన చేరిన రోజు

 గుండెలోని కోరికలన్నీ
గువ్వలుగా ఎగసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే
గూటిలోన చేరిన రోజు
నింగిలోని అందాలన్నీ
ముంగిటిలోనే నిలిచిన రోజు


భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు ఆ...
వసంతాలు పూచే నేటి రోజు

చందమామ అందిన రోజు
బృందావని నవ్విన రోజు
తొలి వలపులు చిలికిన రోజు
కులదైవం పలికిన రోజు

 చందమామ అందిన రోజు
బృందావని నవ్విన రోజు
తొలి వలపులు చిలికిన రోజు
కులదైవం పలికిన రోజు
కన్న తల్లి ఆశలన్నీ
సన్నజాజులై విరిసిన రోజు
భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు ఆ...
వసంతాలు పూచే నేటి రోజు
(S1&S2) ఆ..ఆ హాహా హాహా హా


ఆ..ఆ హాహా హాహా హా
ఆ..ఆ హాహా హాహా హా
ఆ..ఆ హాహా హాహా హా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు