రాశాను ప్రేమలేఖలెన్నో


పల్లవి:

రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే

చరణం 1:

కొమ్మల్లో కోయిలమ్మా కోయన్నది
నా మనసు నిన్నే తలచీ ఓయన్నదీ
మురిపించే ముద్దు గులాబి మొగ్గేసింది
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది

చరణం 2:

నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో ఊహూ
నీ చల్లని రూపం ఉందీ నా కనులలో ఆ..
నాలోని సోయగమంతా విరిబూసెలే
నాలోని సోయగమంతా విరిబూసెలే
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే

చరణం 3:

అందాలా పయ్యెద నేనై ఆటాడనా
కురులందు కుసుమం నేనై చెలరేగనా
నీ చేతుల వీణను నేనై పాట పాడనా
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు