దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారు?
దీపం జ్ఞానానికి చిహ్నం. ప్రాణానికి సంకేతం.అందుకే
" జ్ఞానం తారాజువ్వలా ఉండాలి/ఎప్పుడూ ఊర్ధ్వ ముఖంగానే ఎదగాలి" అంది దీప్తి ఆకెళ్ల.
పండుగలు,ఉత్సవాలు, జాతరలు,మన దేశ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. గత తరాల వారసత్వాన్ని సంప్రదాయాలను గుర్తుచేస్తాయి. న్యూ ఇయర్స్ డే, మే డే వంటివి అన్ని మతాల వారు జరుపుకునే పండుగలు. పండుగ అంటే సంబరం, స్నేహం, సమానత్వం పరిమళించే రోజు.
కానీ ప్రస్తుతం దేశంలో పెత్తనం చేస్తున్న ప్రతీప శక్తులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి, ఘర్షణలను సృష్టించడానికి, రక్తం పారించడానికి పండుగల్ని సందర్భాలుగా చేసుకుంటున్నారు. అన్నదమ్ముల్లాగా మెలిగే మతస్తుల మధ్య అడ్డు గోడలు లేపుతున్నారన్నారు ఎంవియస్ శర్మ.
చాలా పండుగలు ఉత్సవాలు పండుగలు వ్యవసాయం, పశుపోషణ వంటి వాటికి సంబంధించి ఉంటాయి. కొన్ని ప్రకృతిపై మానవుడు విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని జరుగుతుంటాయి. కొన్ని పండుగలు పురాణ కథలపై,నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి.
మనకు దీపావళి మాదిరిగానే, ప్రపంచంలోని అన్ని మానవ సమాజాల్లో దీపాల పండుగలు ఉన్నాయి. ఒక్కో సమాజం ఒక్కో రకం పురాణ కథను, నమ్మకాలను సృష్టించుకోవచ్చు. కానీ అన్నిటిలోను ఉన్న ఉమ్మడి అంశం చీకటి నుండి వెలుగులోకి మనిషి ప్రయాణమే.
తనకు తెలియని విషయాల చుట్టూ, తనకు అర్థంకాని శక్తుల చుట్టూ, మనిషి అనేక నమ్మకాలు ఏర్పరుచుకున్నాడు. అనేక కథలు అల్లుకున్నాడు. అలా పుట్టినవే ప్రకృతి ఆరాధన, క్రతువులు, మూఢనమ్మకాలు వగైరా.
మానవుడు ఇప్పటివరకు నేర్చుకున్న విజ్ఞానం, కళలూ, సాహిత్యం, నృత్యం, సంగీతం వగైరాలు పండుగలలో ప్రదర్శిత మవుతాయి. మానవుడు తన సంపద ప్రదర్శించటానికి పండుగలు వేదికలవుతాయి. ఒక మానవ సమూహపు సంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకోవాలంటే, వారి పండుగలు, ఉత్సవాలు, జాతరలు లను పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి.
భారత దేశ ప్రజలు ఎంతో ఆనందోత్సాహాలతో చేసుకునే పండుగ దీపావళి. చిన్న, పెద్దా పటాకులు కాలుస్తూ, దీపాలు పెడుతూ ఖుషీ ఖుషీగా గడుపుతారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపం వెలుగును పంచుతుంది. కమ్ముకున్న కారుచీకట్లను చీల్చివేస్తుంది. చుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలి వెలుగు నింపడానికి సంకేతంగా ఈ పండగ చేస్తున్నామని చెపుతారు. చెడు మీద మంచి సాధించిన విజయం అని కూడా చెపుతారు. ఏటా ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటారు.
దీపం చీకట్లను పారద్రోలి ఏవిధంగా వెలుగులు ప్రసరిస్తుందో, అదేవిధంగా జ్ఞానసముపార్జనతో మనలోని అజ్ఞానం నశించాలన్న భావనతో వివిధ సందర్భాలలో జ్యోతిని వెలిగిస్తాం. మన ఆలోచనలకు, పదిమందికీ మేలుచేసేలా మనం చేపట్టే ప్రతిపనికీ ఈ జ్యోతి ప్రామాణికంగా నిలుస్తుంది.
దీపం వెలిగించగానే ఆ వెలుగుకు మనలోని దుర్గుణాలన్నీ క్రమక్రమంగా కాలిపోతూ, మంచివైపు మనం అడుగులు వేస్తున్నామని గ్రహించాలి. అంధకారం నిరాశకు, అజ్ఞానానికి గుర్తు. కాంతి జ్ఞానానికి గుర్తు. కటికచీకట్లలో కాంతిపుంజాలను, నిశ్శబ్దంలో సంతోషాల శబ్దాన్ని, నీరసంలో ఉత్సాహాన్ని నింపే ఆనందకేళి దీపావళి. అజ్ఞానమనే చీకటినుంచి జ్ఞానమనే వెలుగులోకి మనల్ని నడిపించే పండుగే ఇది.
ఆనందాన్ని వ్యక్తీకరించడానికి ప్రపంచం మొత్తం క్రాకర్స్
ఉపయోగిస్తోంది. మన దేశంలో చావుకు కూడా. యుద్ధంలో విజయం సాధించిన దానికి గుర్తుగా మందు గుండును కాల్చే వాళ్ళు. విజయం పొందిన ఆనందానికి ఇది గుర్తుగా ఉండేది. కాలక్రమంలో మందు గుండు బదులు బాణసంచా(పటాకులు) పేల్చడం మొదలైంది . పటాకులు మొట్టమొదట చైనాలో తయారయ్యాయి. వారు వాటిని సాంప్రదాయ వేడుకల్లో, మతపరమైన వేడుకల్లో ఉపయోగించేవారు. బాణసంచా వినియోగాన్ని హాన్ రాజుల కాలంలో (క్రీ.పూ. 206- 220 క్రీ.శ.) మొదలైంది. మనదేశంలో దీపావళి పండుగ సందర్భంగా పటాకులు కాల్చడం వెనుక శివకాశికి చెందిన ఇద్దరు వ్యాపారస్తులు అయ్యర్ నాడార్, అతని సోదరుడు షణ్ముగ నాడార్ ల అద్భుతమైన మార్కెటింగ్ విజయం ఉంది.
దీపావళికి, పెళ్లిళ్లకు ముందు, చావుల తరువాత, ఇల్లుకు సున్నం వెయ్యాలి అని పాత సమాజం భావించేది. ప్రతి సంవత్సరం ఇంటిని సంస్కరించుకోవడం మన ఆనవాయితీ. మనం నివసించే ఇళ్లు, పనిచేసే కార్యాలయాలు, షాపులు, వర్క్ షాప్ లు, ఆఫీస్ గదులను సంస్కరిస్తూ ఉండాలి.సంస్కరించిన వాతావరణం,
మనల్ని ప్రభావితం చేస్తుంది. మనం బయట సంస్కరణలు ప్రారంభం చేస్తే, అవి లోపల మనల్ని సంస్కరిస్తూ ఉంటాయంటాడు తుమ్మేటి రఘోత్తమరెడ్డి.
ఇంటి గడపకు పూసే పసుపు, వాకిట ముందు వేసే రంగవళ్లులు ఇలా అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఓ కారణం ఉంది. దీపావళి వెనక కూడా అలాంటి కారణాలు ఉన్నాయి.
దీపావళికి దీపాల ప్రదర్శన ఎందుకు? ఆరు బయట దీపాల పెట్టడం వెనుక కారణం ఏంటి? ఈ దీపావళికి అసలు కారణమేమిటి?
నేపాల్ లోని ఖాట్మండు లోయలో బౌద్ధాన్ని ఆచరించే నెవార్ బౌద్ధులు చక్రవర్తి అశోక బౌద్ధమతంలోకి మారిన రోజును దీపావళిగా
జరుపుకుంటారు. వారు ఈ పండుగను అశోక విజయదశమి అని కూడా పిలుస్తారు. జైనులు చివరి జైన తీర్థంకరుడైన మహావీరుని నిర్వాణ దినంగా దీపావళిని జరుపు కుంటారు.
మనదేశంలో దీపావళి పండుగను ఎందుకు జరుపు కుంటార నడానికి అనేక కథలు ఉన్నాయి.అందులో ప్రధానమైనవి:
1.నరకాసుర వధ
2.బలిచక్రవర్తిరాజ్య దానము
3.రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో
4.విక్రమార్కచక్రవర్తి పట్టాభిషేకము జరిగిన రోజు
5.దీపదానోత్సవం
6.అశోక విజయదశమి
నరకుడు కామరూప దేశానికి ప్రాగ్జ్యోతిష నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడని, అతను ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడని ఏ ఆధారాలు లేని ఒక పురాణ కథ ను అల్లారు.ఆ కథ ప్రకారం ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిష పురంలోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లకుండా ఆలయ తలుపులు నరకుడు మూయించాడు. పదహారువేల రాజకన్యలను చెరపట్టాడు. వాని బాధలను సహింపలేక ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుని కోరగా, ఆయన సత్యభామతో కలిసి నరకాసురుడితో యుద్ధం చేస్తున్న సమయంలో సొమ్మసిల్లి పోయాడట. పక్కనే ఉన్న సత్యభామ ఉగ్రరూపం దాల్చి, బాణాల వర్షం కురిపించి నరకాసురుణ్ణి సంహరించిందని ఒక పౌరాణిక గాథ రాశారు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశినాటి రాత్రి రెండుజాములకు నరకాసుర సంహారం జరిగిందట.అందువల్ల నరకుని పీడ వదలటంతో ఆనందపరవశులైన ప్రజలు ప్రతియేటా దీపావళి పండుగ చేసుకొంటున్నారట.ఆ రెండు రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ కథలకు ఎలాంటి చారిత్రక ఆధారం లేదు. శ్రీకృష్ణుడు ద్వారక ను పాలించినట్లు మహాభారతంలో ఉంది.అది సముద్రంలో మునిగిపోయిందని, అది తవ్వకాల్లో ఇటీవల బయటపడిందని కొంతమంది ఫేక్ వార్తలను ప్రచారం చేశారు. అది వాస్తవం కాదని అది వేరేచోట లభించిన ఫోటోలను గుజరాత్ తీరంలోని సముద్రంలో లభించినట్లు ప్రచారం చేశారని పరిశోధకులు నిర్ధారించారు.
మరోకథ బలిచక్రవర్తి కథ. బలి మంచి పరాక్రమవంతుడు. మహాదాత కూడా. అతడు దేవతలను జయించి తన వద్ద బందీలుగా ఉంచుకున్నాడు. ఇంద్రాదులు విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. కొంత కాలానికి అదితి గర్భాన వామనరూపంలో విష్ణువు జన్మించాడు. ఒకనాడు బలి యజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడికి వామనునిగా( పొట్టిగా) ఉన్న విష్ణువు వచ్చి మూడు అడుగుల స్థలం ఇవ్వమని అడుగుతాడు. బలిచక్రవర్తి దానికి సరే అనగానే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడవ అడుగుకు స్థలం చూపమని అడుగగా, బలిచక్రవర్తిని తన తలమీద వేయాల్సిందిగా కోరతాడు. బలి దానగుణానికి సంతోషించి విష్ణువు అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తాడు.అదేమంటే అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి భూమి మీదకు రావడం. ఇందులో కూడా ఎలాంటి హేతుబద్ధత లేదు. బలి చక్రవర్తి కి సంబంధించిన చారిత్రక అనే వాళ్ళు ఏమీ లేవు.
మహాకాళి రాక్షస సంహారం చేసినందుకు దేవీనవరాత్రులు జరుపుకున్నట్టు మరో కథనం ఉంది.
రాముడు లంకాధీశుడైన పదితలల రావణుణ్ణి చంపినందువల్ల దసరా జరుపుకుంటున్నామని చెపుతారు. దశ-హరా అంటే పది తలలు నరికేయడం. రావణుడి పది తలలు నరికి సంహరించిన తర్వాత, రాముడు సీతాలక్ష్మణులతో సహా అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని దీపావళిగా జరుపుకుంటున్నామని కథ చెపుతారు.
రాముడు ఆర్యుడు. బయటి నుంచి వచ్చిన ఆర్యులకు ఇక్కడి మూలవాసులైన ద్రావిడులకు మధ్య జరిగిన సంఘర్షణల్ని పురాణాలుగా రాసుకున్నారని పెరియార్ చెప్పారు. ఇక్కడి మూలవాసుల్ని కోతులుగా, రాక్షసులుగా చిత్రించి, ఆర్యులు అవమానించారని కూడా ఆయన చెప్పారు. రామాయణం కూడా ఒక కావ్యమే గాని రామునికి సంబంధించిన చారిత్రక అనేవాళ్ళు ఎక్కడా లేవు. రామేశ్వరం దగ్గర రామసేతు ఉందని చాలామంది భావించారు. కానీ అది మానవ నిర్మితం కాదని అది సహజంగా ఏర్పడిన ఒక పర్వత శ్రేణి అని నిపుణులు నిర్ణయించారు.
ధాన్యం జీవనాధారం కనుక ధాన్యలక్ష్మిని ప్రజలు ఆరాధించే వారు. ఆధునిక సమాజంలో డబ్బు సృష్టి జరిగాక ఏవిధంగా తన వద్దకు వస్తుందో, వచ్చింది ఎందుకు తన నుండి పోతుందో అర్థం కాక, అయోమయం నుండి బయట పడటానికి డబ్బు దేవత ధనలక్ష్మిని ప్రార్థించారు. ఈ సమాజంలో డబ్బే సర్వస్వం. కనుక ధనలక్ష్మి తాను కష్టపడకుండా సులభంగా వ్రతాలూ, యాగాలూ చేస్త వస్తాయన్న భ్రమలో వాటిని చేస్తున్నారు. దీక్షలు పడుతున్నారు. పాల సముద్ర మథనంలో లక్ష్మీదేవి పుట్టినరోజును ధన త్రయోదశి అని,దీపావళి పండుగ ఈ ధన త్రయోదశితో ప్రారంభం అవుతుందని పురోహితవర్గం ప్రచారం చేసింది.
పురాణ కథలకు ఎలాంటి చారిత్రక ఆధారాలు ఉండవని అంటారు డాక్టర్ దేవరాజు మహారాజు.అందుకే లక్ష్మి పూజకు, నరకాసుర వధకు,బలి కథకు,రామ కథకు ఎక్కడ ఏ ఆధారమూ దొరకదు. శ్రీకృష్ణుడు, నరకాసురుడు, సత్యభామ, లక్ష్మిగణేశుడు అన్నీ పురాణాల్లో కల్పించిన పాత్రలు. వైదిక ధర్మప్రబోధకులు ప్రచారం చేసినవి. ఇవన్నీ కల్పించిన కట్టుకథలని తెలుస్తోంది.
మన పెద్దవాళ్ళు చెప్పారనో, జరుపుకోవడం మన ఆచారం అనో, ఆనవాయితీ అనో అనాలోచితంగా ఈ పండుగను జరుపుకుంటే ఏ మాత్రం ఉపయోగం లేదు. ఈ పండుగ అసలు కారణం తెలుసుకోవాలంటే మనం చరిత్ర లోకి వెళ్లాలి. గౌతమ బుద్ధుడి కాలంలోకి, అతని మార్గాన్ని అవలంబించిన చక్రవర్తి అశోకుడి కాలంలోకి వెళితే కొన్ని చారిత్రక ఆధారాలు లభిస్తాయి.
జ్ఞానవంతుడై ప్రపంచానికి జ్ఞానాన్ని వెదజల్లిన బుద్ధుడి రాకకు సంకేతమే దీపావళి. బుద్ధుడు తన జ్ఞానాన్ని ప్రపంచానికి దానం చేశాడని చెప్పడానికి ప్రతీకే ఈ దీపాలు వెలిగించడం! ఇది చరిత్రకు సంబంధించిన విషయం గనుక ఆధారాలు ఉన్నాయి.
సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత తన నగరమైన కపిలవస్తు కు వెళ్ళలేదు. పదిహేడు సంవత్సరాలు గడిచాక బుద్ధుడు తన నగరానికి బయలు దేరాడు. ఆయన వస్తున్నాడని తెలిసి స్వాగతం పలకడానికి ప్రజలు వీధులు శుభ్రం చేసుకుని, ఇళ్ళు శుభ్రం చేసుకుని, గోడలకు వెల్ల వేసుకుని, గుమ్మాలకు పూలమాలలు తగిలించి , ఇంటి ముంగిట ముగ్గు వేసి సుందరంగా అలంకరించు కున్నారు. ఆ రోజు అమావాస్య గనక, నగరమంతా దేదీప్యమానంగా దీపాలు వెలిగించారు. ఉన్నవారు లేనివారికి మంచి ఆహారం అందించారు. అదే దీపావళి. బుద్ధుడు కపిలవస్తుకు తిరిగి రావడాన్ని రాముడు అయోధ్యకు తిరిగి రావడంగా మార్చి రాసుకున్నారు. కామన్ ఎరా కు (BCE) ముందు జరిగిన ఒక సంఘటన అది. ఇందులో భ్రమలు, కల్పితాలూ లేవు. బుద్ధుడు వాస్తవంగా ఈ నేలమీద తిరిగినవాడు. బుద్ధుడి కరుణను, దయాగుణాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు ఈ రోజు వరకూ ఆ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
బుద్ధుడి తర్వాత 300ఏళ్లకు మౌర్యచక్రవర్తి అశోకుడు (304-232 BCE) కళింగయుద్ధంలో విజయం సాధించాడు. కానీ ఆ యుద్ధంలో జరిగిన మారణ హోమాన్ని చూసి చలించిపోయి ఆత్మవిమర్శ చేసుకున్నాడు. పశ్చాత్తాపంతో దుఃఖించాడు. ఆయుధాలు త్యజించి అహింసను ఆహ్వానించాడు. మానసిక పరివర్తన వల్ల తను చేసిన రక్తపాతానికి పరితపిస్తూ బౌద్ధమార్గం స్వీకరించాడు. ఆ సందర్భంగా అంధకారాన్ని పారద్రోలే దీపాలు వెలిగించమన్నాడు.వేలవేల దీపాలతో ప్రజల జీవితాల్లో శాంతి, అహింస, సత్యం, నిజాయితీ, నిబద్ధత, నైతికతలు వెలిగిపోవాలని ఆకాంక్షించాడు. అదే దీపావళి అయింది.ఈ వివరాలన్నీ పాళీ భాషలో రాయబడిన శ్రీలంక బౌద్ధ గ్రంథంలో లభించాయి. దాన్ని డాక్టర్ వాల్మీకి ప్రసాద్ '‘దీప్ వంశ్’’-పేరుతో హిందీలోకి అనువదించారు. ఇరానియన్ ఆంత్రోపాలజిస్ట్, పరిశోధకుడు అబూ రేహాన్ అల్-బిరూనీ (973-1048 C.E.) తన ‘‘అల్ – బిరూనీ క భారత్ ’’- అనే గ్రంథంలో దీపావళి విశేషాలు నమోదు చేశారు. డా. అంబేడ్కర్ మిత్రుడు సత్ రామ్ బీన్ దాన్ని హిందీలోకి అనువదించారు.ఆ కాలంలో దీపావళిని దీపదానోత్సవమని పిలిచేవారు.
ఇవే కాక మనకు మరొక ఆధారం ఉంది. నాలుగు వేదాలకు వ్యాఖ్యానం రాసిన గంగాశరణ్ శర్మ ప్రకారం వైకల్పిక ప్రకాశ్, అంటే మనిషి తన జ్ఞానంతో వెలిగించిన దీపాలు, వేదాలలో ఎక్కడా లేదు అని నిర్ధారించారు. అందువల్ల, దీపావళి బౌద్ధ సాహిత్యంలోంచి వచ్చిందేనని నిర్థారణ అయింది.బుద్ధుడే స్వయంగా ‘‘అత్ దీపోభవ’’ అన్నాడు. అంటే ‘నువ్వే ఒక జ్ఞాన దీపం అవ్వు’ అని అర్థం!
బుద్ధుడు,స్వర్గంలో పునర్జన్మ పొందిన తన తల్లి మాయకు అభిధమ్మాన్ని బోధించిన రోజు ను తాడింగ్యూట్ పండుగ గా మయన్మార్ ప్రజలు భావిస్తారు.దీన్ని మయన్మార్ లైటింగ్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. తాడింగ్యూట్ సందర్భంగా మయన్మార్ లోని మిలటరీ జుంటా పై జరిగిన సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన 5,600 మందికి పైగా రాజకీయ ఖైదీలను తాడింగ్యూట్ పండుగ సందర్భంగా జుంటా ప్రభుత్వం క్షమాభిక్ష తో విడుదల చేసింది.ధమ్మ దీపావళి పండుగ సందర్భంగా భారతదేశం కూడా అలా ఎందుకు రాజకీయ ఖైదీలను ఎందుకు విడుదల చేయకూడదని పలువురు ప్రశ్నిస్తున్నారు. జనవరి26, ఆగస్ట్ 15, అక్టోబర్2 వ తేదీలకోసం భారతదేశంలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాలను జైలు అధికారులు సిద్ధం చేసి పంపిస్తే ప్రభుత్వం వారిని విడుదల చేసేది. గత కొన్నేళ్ళుగా దాన్ని కూడా తూతూమంత్రంగా అమలుచేస్తున్నారు. ఇక రాజకీయ ఖైదీల విడుదల అనేది కేవలం బెయిల్ మీదే ఆధారపడి ఉంటుంది.
మయన్మార్‌లో రాజకీయ ఖైదీల విడుదల విస్తృత ప్రాముఖ్యత ఏమిటంటే, అటువంటి వర్గం ఒకటి ఉందని జుంటా గుర్తించింది. భారతదేశంలో రాజకీయ ఖైదీ అంటే ఏమిటో నిర్వచనం లేదు. వాళ్లెంత మంది ఉన్నారో తెలియదు. ఫాదర్ స్టాన్ స్వామి మరణం తర్వాత భారత దేశ ప్రభుత్వం రాజకీయ ఖైదీ అంటే ఏమిటో నిర్వచనం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త రామ్ మాధవ్ ప్రకారం రామరాజ్యం అంటే 'పాలకుడి ఆనందం అతని ప్రజల సంతోషంలో ఉంటుంది. పాలకుడు ఇష్టపడేది కాదు, ప్రజలు ఇష్టపడేది మాత్రమే ముఖ్యం. మహాభారతంలోని శాంతి పర్వంలో ధర్మరాజు పాలకుడు ఎలా ఉండాలో చెపుతూ భీష్ముడు చెప్పిందిదే. చాణక్యుడు కూడా అర్థ శాస్త్రంలో ఇదే చెపుతాడు.
వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ బడితే అక్కడ నిలిచిపోయి. క్రిమి కీటకాలు బాగా వృద్ధి చెందుతాయి. వాటి వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుబయట దీపాలు వెలిగించడం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షితమై దీపంలో పడి చనిపోతాయి. ఇక దీపావళి నాడు కాల్చే పటాకులు, వాటి నుంచి వచ్చే పొగ దోమలు మొదలైన వాటిని మట్టుపెడతాయని భావిస్తుంటారు.
పొగ దోమలను చంపుతుంది కానీ అదే సమయంలో మానవుల శ్వాసకోశానికి హాని కలిగిస్తుంది.క్రాకర్లు, బాణసంచా కాల్చే పొగ వల్ల దోమలు నశిస్తాయన్న వాదన ఎలా ఉందంటే దోమల బెడదను పారదోలేందుకు మంచాన్ని కాల్చినట్లుంటుంది. క్రాకర్స్ నుండి వచ్చే పొగ ఊపిరితిత్తులను చికాకుపెడుతుంది. ఉబ్బసం రోగులను, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారిని ఎక్కువగా బాధిస్తుంది. పొగలో అల్ట్రా మినిట్ పార్టికల్స్ ఉంటాయి. ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. పీల్చినప్పుడు అవి ఊపిరితిత్తులలోకి లోతుగా చొచ్చుకుపోతాయి.రసాయన పటాకుల వల్ల నీరు, గాలి, మట్టి కాలుష్యమైపోతాయి. టపాసుల వల్ల వచ్చే శబ్దాల వల్ల చంటి పిల్లలకు, ఎంతోమంది అనారోగ్యంతో ఉన్న వారికి చాలా ఇబ్బందవుతుంది.
మనం ఎంతో ఉత్సాహంగా దీపావళి రోజు కాల్చే బాణాసంచా పేలుడు పదార్ధాలతో తయారవుతాయి. అవి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ అనే వాయువులను వాతావరణం లోకి విడుదల చేసి కాలుష్యాన్ని ఏర్పరుస్తాయి. ఇలా భూమి, గాలి కలుషితమై ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమవు తున్నాయి. ఇది జలుబు, అలెర్జీ, దగ్గుతో బాధపడు తున్న వ్యక్తుల సమస్యను తీవ్రతరం చేస్తుంది. గొంతు, ఛాతీ ఇబ్బందిని కూడా పెంచుతుంది. క్రాకర్స్ ప్రేలుడు శబ్దం నేరుగా మానవునిపై చెవి పై చెడుప్రభావం చూపుతుంది. ఇది తలనొప్పికి దారితీస్తుంది. మానసిక దృఢత్వం తగ్గుతుంది. గుండె, శ్వాసకోశ లేదా నాడీ వ్యవస్థ రుగ్మతలతో బాధప డుతున్న వ్యక్తులలో ఇది చాలా తీవ్రమైన ప్రభావాలను కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా పటాకులు పేల్చడం పక్షులకు, జంతువులకు చాలా ప్రమాదకరం. వాటికి సున్ని తమైన వినికిడి ఉన్నందున ఇది వాటికి పెద్ద హింస. శబ్దం యొక్క పెద్ద స్థాయిలు కొన్ని జంతువులలో చెవుడును కూడా కలిగిస్తాయి. పటాకుల నిరంతర శబ్దాలు వాటిని భయపెడతాయి కూడా. బాణాసంచా ప్రేలుళ్లు గర్భిణీ మహిళలకు, నవజాత శిశువులకు అత్యంత ప్రమాదం.
మన దేశంలోనే కాక యునైటెడ్ స్టేట్స్‌లో స్వాతంత్ర్య దినోత్సవం (జూలై,4), ఆగ్నేయాసియాలో ఈద్ అల్-ఫితర్, నేపాల్‌లోని తీహార్, అషురా రోజు వంటి వేడుకల్లో సాధారణంగా పటాకులను ఉపయోగిస్తారు.మొరాకోలో , యునైటెడ్ కింగ్‌డమ్ లో గై ఫాక్స్ నైట్ లేదా బోన్‌ఫైర్ నైట్, ఐర్లాండ్‌లో హాలోవీన్, ఫ్రాన్స్‌లో బాస్టిల్ డే, స్పానిష్ ఫాలాస్ , శ్రీలంకలోని దాదాపు ప్రతి సాంస్కృతిక ఉత్సవాల్లో, ప్రపంచవ్యాప్తంగా చైనీస్ కమ్యూనిటీలు చైనీస్ న్యూ ఇయర్ వేడుకలో పటాకులు కాలుస్తుంటారు.
పటాకుల వాడకం వల్ల చాలామందికి గాయాలు, మరణాలకు దారితీసింది. ముఖ్యంగా చైనీస్ న్యూ ఇయర్ సీజన్ వంటి పటాకులు కాల్చే పండుగల సమయంలో చాలామంది ప్రజలు అంధులయ్యారు.శరీర భాగాలను కోల్పోయారు. అందువల్ల, చైనా ప్రభుత్వం 1993లో పటాకులను వీధుల్లో వాడటాన్ని నిషేధించారు. మనదేశంలో ఢిల్లీలో కాలుష్య సూచిక విపరీతంగా ఉండటంతో సుప్రీంకోర్టు పటాకులను కాల్చడాన్ని నిషేధించింది.
మన పండుగలు, మన సంస్కృతి మనకు అవసరమే. అవి మన జీవన శైలికి ఆటంకం కలిగించేవిగా కాకుండా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించేవిగా వుండాలి. వీటి వుత్సవాల్లో వ్యాపారీకరణ చోటుచేసుకో కూడదు. అందువలన దీపావ

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి