మారాలి మన సమాజం__నార్ల చిరంజీవి
మారాలి మన సమాజం
_ నార్ల చిరంజీవి
పల్లవి:
మారాలి -మన సమాజము మారాలి మారాలి - మన సమాజము
చరణం:
నిరుద్యోగమూ నిరాశానేడు
అడుగడుగన సమాజాన్ని ఆవరించెరా
స్వార్థపూరితం - నిస్వార్ధమే శూన్యం
స్వార్ధమే సమాజాన్ని స్వారీ చేసెరా
ప్రజాస్వామ్యం పేర - పదవుల వేట
ప్రజల మరచి - ప్రజాధనము పంపకాలురా
కష్టజీవుల రక్తం - కలవారల భుక్తం
కమ్మిందీ సమాజాన్ని కారుమబ్బులా
కులమత భేదం - ప్రాంతీయతత్వం
ద్వేషాలే కాలకూట విషముగ్రక్కెరా
తరతరాలుగ - సంప్రదాయము పేర
స్త్రీ జాతిని బానిసలుగ చేసినారురా
ఏదో ఒక మూల చైతన్య ( విప్లవోద్యమ) జ్వాల
రగిలి రగిలి నవసమాజ నాంది యగునురా
మారాలి మారాలి
Good
రిప్లయితొలగించండి