పోస్ట్‌లు

జనవరి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

కాలం నన్ను

కాలం నన్ను        ___ ఎం.శేషగిరి పల్లవి: కాలం........ నన్నూ.... పదే...... పదే పలకరించింది ఎదురుగా నిలబడి....... వెక్కిరించింది- నన్ను హెచ్చరించింది. చరణం:  వేగుచుక్కను వెంట నిడుకొని తట్టిలేపింది. పరుగులిడమని..... తాకరమ్మని చుట్టు తిరిగింది. నాతో పట్టుపట్టింది. వెనకబడితే తడుములాట తీరు చూపింది.... అధిగమిస్తే...... అవధులకు  ఇక తావులేదంది..... నే పావుకానంది వ్యవధి తెలిసి మసలుకుంటే చెలియ తానంది. చేతగాని...... చేవలేని బతుకు వద్దంది  మనిషికి తెగువ బలమంది. త్యాగధనుల జీవితాలను ..... ఆలపించింది..... కర్మజీవులా....... ఘర్మజలముల కథలు చెప్పింది...... వెతలు బాపింది.

అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేల శేషుల పడగల మయము

అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేల శేషుల పడగల మయము  అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేల శేషుల పడగల మయము    చరణం 1 అదే వేంకటాచల మఖిలోన్నతము  అదివో బ్రహ్మాదుల కపురూపము  అదివో నిత్య నివాస మఖిలమునులకు  అదే చూడుడు.. అదే మ్రొక్కుడు.. ఆనందమయము అదే చూడుడదే మ్రొక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేల శేషుల పడగల మయము  చరణం 2 చెంగటనల్లదివో శేషాచలము  నింగినున్న దేవతల నిజవాసము  ముంగిట నల్లదివో మూలనున్న ధనము  బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేల శేషుల పడగల మయము  చరణం 3 కైవల్యపదము వేంకటనగమదివో  శ్రీవేంకటాపతికి సిరులైనవి  భావింప సకల సంపదరూప మదివో  పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేల శేషుల పడగల మయము 

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ ఆకు రాలు అడవికి ఒక ఆమని దయ చేసింది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా నది తోసుకు పోతున్న నావను ఆపండి రేవు బావురుమంటోందని నావకు చెప్పండీ నావకు చెప్పండి నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది చిత్రం : ముత్యాల ముగ్గు (1975) సంగీతం : కె.వి. మహదేవన్ సాహిత్యం : గుంటూరు శేషంధ్రశర్మ గానం : సుశీల

ధనమేరా అన్నిటికీ మూలం

"ధనమేరా అన్నిటికీ మూలం" లక్ష్మీ నివాసం(1968) ఆరుద్ర, కె.వి.మహాదేవన్, ఘంటశాల ------------------------------------ ధనమేరా అన్నిటికి మూలం  ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం  ధనమేరా అన్నిటికి మూలం  ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం  ధనమేరా అన్నిటికి మూలం  మానవుడే ధనమన్నది శృజియించెనురా  దానికి తానే తెలియని దాసుడాయెరా  మానవుడే ధనమన్నది శృజియించెనురా  దానికి తానే తెలియని దాసుడాయెరా  ధనలక్ష్మి ని అదుపులోన పెట్టినవాడే  ధనలక్ష్మి ని అదుపులోన పెట్టినవాడే  గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా  ధనమేరా అన్నిటికి మూలం..  ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా  ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా  లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా  కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే  కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే  హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే..  ధనమేరా అన్నిటికీ మూలం  ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం కూలివాని చెమటలో ధనమున్నదిరా  పాలికాపు కండల్లొ ధనమున్నదిరా  కూలివాని చెమటలో ధనమున్న...

విధాత తలపున ప్రభవించినది

విధాత తలపున ప్రభవించినది  అనాది జీవన వేదం...ఓం.మ్మ్.. ప్రాణ నాడులకు స్పందన నొసగిన  ఆది ప్రణవ నాదమ్...ఓం.మ్మ్.. కనుల కొలనులో ప్రతిబింబించిన  విశ్వరూప విన్యాసం.. ఎదకనుమలలో ప్రతిధ్వనించిన  విరించి విపంచి గానమ్....ఆఅ.. సరస స్వర సుర ఝారీగమనమౌ  సామ వేద సార మిది...||2|| నేపాడిన జీవన గీతం ఈ... గీతం.. విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం.... ప్రాగ్దిశ వీణియ పైన  దినకర మయూఖ తంత్రులపైనా.. జాగృత విహంగ తతులె  వినీల గగనపు వేదిక పైన... ||2|| పలికిన కిలకిల స్వరముల స్వరజతి  జగతికి శ్రీకారము కాగా.. విశ్వకావ్యమునకిది భాష్యముగా.... ||విరించినై..|| జనించు ప్రతి శిశు గళమున  పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు  హృదయ మృదంగ ధ్వానం... ||2|| అనాది రాగం ఆది తాళమున  అనంత జీవన వాహిని గా.. సాగిన సృష్టి విలాసము నే... ||విరించినై..|| నా ఉఛ్వాసం కవనం  నా నిశ్వాసం గానం ||2|| సరస స్వర సుర ఝారీగమనమౌ  సామ వేద సార మిది... నేపాడిన జీవన గీతం ఈ... గీతం.. సాహిత్యం ... సీతారామశాస్త్రి సంగీతం .... కె వి మహదేవన్  గానం ...... ...

పాడుదమా స్వేచ్ఛాగీతం

పాడుదమా స్వేచ్ఛాగీతం రచన: గంటేడు గౌరునాయుడు, శ్రీకాకుళం జిల్లా. పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతిపతాకం దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం |పాడుదమా| జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటి ధారలు హత్తుకొని ఉరికొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిడిన కాలం పోరాడిన కాలం మరి మరి ఒకపరి తలచుకొని మృత వీరుల గాధలు తెలుసుకొని |పాడుదమా| వందేమాతరమని నినదించిన వీరుల శౌర్యం తలచుకొని స్వాతంత్రం నా జన్మహక్కని గర్జించిన గళమందుకొని పోరాట ఫలం స్వాతంత్ర ఫలం కలకాలం కాపాడుకొని కడు గర్వంగా కొనియాడుకొని |పాడుదమా| మన్యం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తిగొని గుండు కెదురుగా గుండె నిలిపిన తెలుగు సింగముల తెగువగని చీకటి గుండెల బాకై మెరిసిన గరిమెళ్లను గురుతుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని |పాడుదమా| జనగణమనముల జాగృతినింపిన జెండా గాథలు చెప్పుకొని జయహే జయజయహే జననీ యని జయ గీతమ్ములు పాడుకొనీ పావన చరితం పరిమళభరితం అఖండ భారత ఖండమని అది అక్షయ అమృతభాండమనీ |పాడుదమా|

నుతజలపూరితంబులగు నూతులు

నుతజలపూరితంబు లగు నూతులు నూరిటికంటె సూనృతవ్రత!  యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటె నొక్కసత్కృవది  మేలు; తత్కృతు శతంబునకంటె సుతుండు మేలు; తత్సుత  శతకంబు కంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్!             (ఆంధ్ర మహాభారతం,నన్నయ,ఆది పర్వం) "వంద మంచినీటి కయ్యలకంటే ఒక బావిమేలు.  వంద బావులకంటే ఒక్క జలాశయం మేలు  వంద జలాశయాల కంటే ఒక్క క్రతువు మేలు  వంద క్రతువుల కంటే ఒక్క కొడుకు మేలు  వందమంది కొడుకుల కంటే ఒక సత్యవాక్యం మేలు..." రాజుల్ మత్తుల్ వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం భోజాక్షీచతురంతయ నతురగీ భూషాదు లాత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు మరితృప్తిం బొందితిన్ జ్ఞాన లక్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా! ____ ధూర్జటి  తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! రాజులు అన్ని విధములుగ మత్తులు. వారి సేవ నరకబాధతో సమానము. వారు మెచ్చిన ఇత్తురు సుందర స్త్రీలు, మేనాలు, పల్లకీలు, గుఱ్ఱములు, భూషణములు మొదలైనవి. ఇవి చిత్తమునకు ఆత్మకు వ్యధ కలుగుటకు మూలసాధనములు. వాటియందు కోరిక కూడదు. వానిని కోరి ఇంతవరకు నేను చేసిన రాజసేవ చాలును. వానితో తగిన సంతృప...

ఎందుకని ? ఎందుకని ? ఎందుకని ?

ఎందుకని ? ఎందుకని ? ఎందుకని ?           మూలంః కె.కె.కె. కుమార్ అనువాదం: దేవి ఎందుకనీ ఎందుకనీ  ఎందుకనెందు కనెందు కనెందుకని? వానల్లో హరివిల్లు ఎందుకని  చుక్కల్లో మిలమిల లెందుకని మల్లెలు తెల్లని తెలుపులో  ఉన్నాయెందుకనీ మందారాలు ఎర్రటి ఎరుపులో విరిశాయెందుకనీ మిణుగురు పురుగుల రెక్కల్లో  మిణుగురు పురుగుల రెక్కల్లో  వెలుగుల దీపం ఎందుకనీ?  వెలుగుల దీపం ఎందుకనీ?  ॥ఎందుకనీ॥ ॥ఎందుకనీ|| గువ్వలు కాకులు ఎగిరినట్లు  పిల్లి ఎగరదు ఎందుకని?  చక్కని చిలుకల, చిక్కని ఉడతల ముద్దు ముచ్చటలు జాంపండుకు లేవెందుకనీ? పచ్చని  కొండల పచ్చదనం చిదిమేస్తున్నారెందుకనీ? ॥ఎందుకనీ॥ ॥ఎందుకనీ|| నవ్వులు రువ్వే చిన్నికళ్లళ్లో  కన్నీళ్ళు  ఎందుకని? రాము బుజ్జీ అమ్మతో పాటు బిక్షకు వెళుతున్నారెందుకని? అన్నం మందుల బదులు  బాంబులు చేస్తున్నారెందుకని? కులాల పేరిట మతాల పేరిట కొట్టుకు చస్తున్నా రెందుకని? ॥ఎందుకనీ॥ ॥ఎందుకనీ|| పస్తులు ఎందుకని ? పేదరికం ఎందుకని ? అజ్ఞానం ఎందుకని ?   ఎందుకనెందుకని అంటూ ఇదే సమయం ప్రశ్నించడానికి  ఎక్కడెక్కడ ...

పరుల కోసం పాటుపడని

పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని /2/  మూగ నేలకు ... నీరందివ్వని వాగు పరుగు దేనికని " తాతలు తాగిన నేతుల సంగతి - 4  నీతులుగా ... పలికెను మన సంస్కృతి  జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని - / / పరుల// ఆ ఆ ఆ ఆ అ ఆఅ ఆఆఅ ఆఆఅ ఆదర్శాలకు నోళ్ళు చాలవు, ఆశయాలకు ఫైళ్ళు చాలవు  పదపద మంటూ పలుకులేగాని కదలని అడుగు దేనికని -- / / పరుల // జలవిద్యుతుకు కొరవే లేదు, జనసంపత్తికి కరువే లేదు.  అవసరానికి మీట నొక్కితే అందని వెలుగు దేనికని-- / / పరుల// Aàaaa శిశు హృదయానికి కల్లలు లేవు, రసరాజ్యానికి ఎల్లలు లేవు  లోపలి నలుపు జనానికి  తెలుసు, పై పై తొడుగు దేనికని / / పరుల//