ఎందుకని ? ఎందుకని ? ఎందుకని ?
ఎందుకని ? ఎందుకని ? ఎందుకని ?
మూలంః కె.కె.కె. కుమార్ అనువాదం: దేవి
ఎందుకనీ ఎందుకనీ
ఎందుకనెందు కనెందు కనెందుకని?
వానల్లో హరివిల్లు ఎందుకని
చుక్కల్లో మిలమిల లెందుకని
మల్లెలు తెల్లని తెలుపులో ఉన్నాయెందుకనీ
మందారాలు ఎర్రటి ఎరుపులో విరిశాయెందుకనీ
మిణుగురు పురుగుల రెక్కల్లో
మిణుగురు పురుగుల రెక్కల్లో
వెలుగుల దీపం ఎందుకనీ?
వెలుగుల దీపం ఎందుకనీ?
॥ఎందుకనీ॥
॥ఎందుకనీ||
గువ్వలు కాకులు ఎగిరినట్లు
పిల్లి ఎగరదు ఎందుకని?
చక్కని చిలుకల, చిక్కని ఉడతల ముద్దు ముచ్చటలు జాంపండుకు లేవెందుకనీ?
పచ్చని కొండల పచ్చదనం చిదిమేస్తున్నారెందుకనీ?
॥ఎందుకనీ॥
॥ఎందుకనీ||
నవ్వులు రువ్వే చిన్నికళ్లళ్లో
కన్నీళ్ళు ఎందుకని?
రాము బుజ్జీ అమ్మతో పాటు బిక్షకు వెళుతున్నారెందుకని?
అన్నం మందుల బదులు
బాంబులు చేస్తున్నారెందుకని?
కులాల పేరిట మతాల పేరిట కొట్టుకు చస్తున్నా రెందుకని?
॥ఎందుకనీ॥
॥ఎందుకనీ||
పస్తులు ఎందుకని ?
పేదరికం ఎందుకని ?
అజ్ఞానం ఎందుకని ?
ఎందుకనెందుకని అంటూ ఇదే సమయం ప్రశ్నించడానికి
ఎక్కడెక్కడ దౌర్జన్యం చెలరేగుతుందో
అక్కడక్కడ భయం బెదురు లేకుండా తలెత్తి గొంతెత్తి సూటిగా ప్రశ్నించు
ఎందుకని? ఎందుకని? ఎందుకని?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి