నుతజలపూరితంబులగు నూతులు


నుతజలపూరితంబు లగు నూతులు నూరిటికంటె సూనృతవ్రత! 
యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటె నొక్కసత్కృవది 
మేలు; తత్కృతు శతంబునకంటె సుతుండు మేలు; తత్సుత 
శతకంబు కంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్!
            (ఆంధ్ర మహాభారతం,నన్నయ,ఆది పర్వం)

"వంద మంచినీటి కయ్యలకంటే ఒక బావిమేలు. 
వంద బావులకంటే ఒక్క జలాశయం మేలు 
వంద జలాశయాల కంటే ఒక్క క్రతువు మేలు 
వంద క్రతువుల కంటే ఒక్క కొడుకు మేలు 
వందమంది కొడుకుల కంటే ఒక సత్యవాక్యం మేలు..."



రాజుల్ మత్తుల్ వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం భోజాక్షీచతురంతయ నతురగీ భూషాదు లాత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు మరితృప్తిం బొందితిన్ జ్ఞాన లక్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా!
____ ధూర్జటి 

తాత్పర్యం:

శ్రీ కాళహస్తీశ్వరా!

రాజులు అన్ని విధములుగ మత్తులు. వారి సేవ నరకబాధతో సమానము. వారు మెచ్చిన ఇత్తురు సుందర స్త్రీలు, మేనాలు, పల్లకీలు, గుఱ్ఱములు, భూషణములు మొదలైనవి. ఇవి చిత్తమునకు ఆత్మకు వ్యధ కలుగుటకు మూలసాధనములు. వాటియందు కోరిక కూడదు. వానిని కోరి ఇంతవరకు నేను చేసిన రాజసేవ చాలును. వానితో తగిన సంతృప్తిని పొందినాను. ఇక వారివలన ఏవిధమైన లక్ష్మి వలదు. నీవు నన్ను అనుగ్రహించి పరిపాకము పొందిన జ్ఞానలక్ష్మీజాగృతిని యిమ్మని వేడుచున్నాను.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు