ధనమేరా అన్నిటికీ మూలం
"ధనమేరా అన్నిటికీ మూలం"
లక్ష్మీ నివాసం(1968)
ఆరుద్ర, కె.వి.మహాదేవన్, ఘంటశాల
------------------------------------
ధనమేరా అన్నిటికి మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమేరా అన్నిటికి మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమేరా అన్నిటికి మూలం
మానవుడే ధనమన్నది శృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
మానవుడే ధనమన్నది శృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మి ని అదుపులోన పెట్టినవాడే
ధనలక్ష్మి ని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా
ధనమేరా అన్నిటికి మూలం..
ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే..
ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం
శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం
ఆ శ్రీదేవిని నిరశించుట తీరని ద్రోహం
ధనమేరా అన్నిటికి మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి