కాలం నన్ను



కాలం నన్ను
       ___ ఎం.శేషగిరి
పల్లవి:
కాలం........ నన్నూ.... పదే...... పదే
పలకరించింది
ఎదురుగా నిలబడి....... వెక్కిరించింది- నన్ను
హెచ్చరించింది.

చరణం: 
వేగుచుక్కను వెంట నిడుకొని తట్టిలేపింది.
పరుగులిడమని..... తాకరమ్మని చుట్టు తిరిగింది.
నాతో పట్టుపట్టింది.

వెనకబడితే తడుములాట తీరు చూపింది....
అధిగమిస్తే...... అవధులకు 
ఇక తావులేదంది..... నే పావుకానంది

వ్యవధి తెలిసి మసలుకుంటే
చెలియ తానంది.
చేతగాని...... చేవలేని బతుకు వద్దంది 
మనిషికి తెగువ బలమంది.

త్యాగధనుల జీవితాలను .....
ఆలపించింది.....
కర్మజీవులా....... ఘర్మజలముల
కథలు చెప్పింది...... వెతలు బాపింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

తెలుగు భాష పుట్టు పూర్వోత్తరాలు