pc: oneindiatelugu.com There are 27 stars according to Telugu Astrology. Each has its own unique way. These are decided by the entry of the Surya or Sun. సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేసుకుని సంవత్సర కాలాన్ని 27 భాగాలుగా చేశారు. వాటికి ‘కార్తె’ అనే పేరు నిర్ణయించారు. ఒక్కో నక్షత్ర కూటమిలో సూర్యుడు దాదాపు రెండు వారాల పాటు ఉంటాడు. దీనిప్రకారం ఒక్కో కార్తె సుమారుగా 13 లేదా 14 రోజులు ఉంటుంది. అశ్వని నుంచి రేవతి వరకు ఇలా నక్షత్రాల పేరు మీద కార్తెలు ఏర్పడ్డాయి. జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయమై నప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు.కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచారు.సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు ప...
తెలుగు కథానిక - వికాసం ప్రాచీన కావ్యాలన్ని కథతో ముడిపడి వున్నాయి. ఇప్పుడైతే కవిత్వం, కథ వేరు వేరుగా ఉన్నాయి గాని అప్పటివన్ని కథాకావ్యాలే. వచనంలో రాయడాన్ని గద్యం అన్నారు. కవిత్వాన్ని పద్యం అన్నారు. పద్యం, గద్యం, పద్యగద్యం ఇలా మూడు రూపాల్లో కథా కావ్యాలు వచ్చాయి. పద్యగద్య కావ్యాన్ని 'చంపూ' కావ్యం అంటారు. రుగ్వేదంలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, భారతంలో, రామాయణంలో ఉన్న కథలన్నీ కవిత్వంలో ఉన్నాయి గాని, అవన్నీకథలే. తెలుగులో అనగా అనగా అని మొదలుపెడితే ఆంగ్లంలో లాంగ్ లాంగ్ అగో, ఒన్స్ అపాన్ ఎ టైమ్ అంటూ మొదలు పెడతారు. మహాభారతంలో వచ్చే నలదమయంతి కథ, సతీ సావిత్రి కథ లాంటి వాటిని ఉపాఖ్యానాలు అన్నారు. కథలను కూడా విభజించారు. నీతి చెప్పే కథలను “నిదర్శనం' అన్నారు. ప్రారంభంలో రహస్యం (సస్పెన్స్) బట్టబయలు చేయకుండా చివరలో చెప్పే కథను “ మణికుల్య' అన్నారు. అగ్ని పురాణంలో(క్రీ.పూ. 7 శతాబ్దం) కథల్లో ఆఖ్యాయిక, కథ, ఖండకథ, పరికథ, కథానిక వంటి రకాలున్నాయని పేర్కొన్నట్లు జయంతిపాపారావు తన 'వెయ్యేళ్ల కథా ప్రస్థానం'లో చెప్పినారు. (1) ఆఖ్యాయిక : ఇది గద్యరూపంలో ఉంటుంది. దీనిలో 'ఉచ్వాసాల...
భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించారు, అనగా తెలుగు – హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు) చెందకుండా, తమిళము, కన్నడము, మలయాళము, తోడ, తుళు, బ్రహూయి మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందినదని భాషాశాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు కుయి, కోయ, కొలామి కూడా ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం.సింధులోయ నాగరికతలోని భాష గురించి కచ్చితంగా ఋజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం. చరిత్ర : ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - "దేశ భాషలందు తెలుగు లెస్స", "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు", " పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి