నవ్వులు రువ్వే పువ్వమ్మా
నవ్వులు రువ్వే పువ్వమ్మా
నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా...
ఉన్న నాలుగు నాళ్ళు నీలా
ఉండిపోతే చాలమ్మా
నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..ఆ..పువ్వమ్మా
ఆకుల పయ్యెదలో
నీ ఆడతనాన్ని దాచావు
రేకుల కేంపులలో
నీ రేపటి ఆశలు నింపావు
ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన
మొగ్గ సొగసు ఉందమ్మా...
నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..ఆ..పువ్వమ్మా
ఈ తోట మొత్తమూ కమ్మినవి
నీ దోరవయసు అందాలు
ఈ గాలి మత్తులో ఉన్నవీ
నీ కన్నె మనసులో కైపులు
ఈ తోట మొత్తమూ కమ్మినవి
నీ దోరవయసు అందాలు..
ఈ గాలి మత్తులో ఉన్నవీ
నీ కన్నె మనసులో కైపులు
నువ్వు ఒలకబోసే ఓంపుసొంపులకు
ఒడిని పడతానుండమ్మా...
నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..ఆ..పువ్వమ్మా
ఏ కొమ్మకు పూచావో
ఏ కమ్మని తేనెలు తెచ్చావో ..
ఏ పాటకు మురిసేవో
ఏ తేటికి విందులు చేసేవో
ఆ పాట గానో,తేటిగానో
పది నాళ్ళున్నాచాలమ్మా ..
నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా
ఉన్న నాలుగు నాళ్ళు
నీలా ఉండిపోతే చాలమ్మా...
నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..ఆ..పువ్వమ్మా
చిత్రం : గాజుల కిష్టయ్య (1975)
సంగీతం : కె .వి.మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : S.P.బాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి