మనసా నిన్ను నిప్పుతోని కడగనా
మనసా నిన్ను నిప్పుతోని కడగనా
మనసా మనసా
మనసా కన్నీళ్లతో నిను మార్చనా
మనసా మనసా మనసా ఆఆఆఆ........
నీ మర్మమేందో నెరుగనైతి మనసా మనసా
చందమామ నందుకునే శక్తి నీకున్నా
సముద్రాల నీదే బలం నీకున్నా
నేను నాది అనే మాట మరువ వెందుకో
స్వార్థమనే మాట మరువవెందుకో నీవు మరువవెందుకో
మనసా మనసా నిన్ను నిప్పు తోటి కడగనా
మనసా కన్నీళ్లతో నిను మార్చనా
గుళ్ళు గోపురాలెన్నో ఎక్కి వస్తున్నా
లెక్కలేని పదవులెక్కి వస్తున్నా
ఎదుటి వాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకో
వెనకనుంచి పొడిచే పాడుగుణం ఎందుకో పాడుగుణం ఎందుకో
మనసా మనసా నిను నిప్పుతోటి కడగనా మనసా ఆఆఆ
సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగినా
మనిషిలోని అణువణువును మార్చగలిగినా
మనసులోని మాయ పొరలుతుంది ఎందుకో
నువ్వు మనిషి లాగా ఒక్క దినం బతుకవెందుకో
నువ్వు బతుకవెందుకో
మనసా మనసా కన్నీళ్లతో నిను కడగనా మనసా ఆఆఆ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి