పోస్ట్‌లు

మే, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

సెల్యూట్ సెల్యూట్

సెల్యూట్ సెల్యూట్ సెల్యూట్ సుందరయ్యా రెడ్ సెల్యూట్ చల్లనయ్యా  సెల్యూట్ అందరయ్యా  శ్రమజీవుల తండ్రివయా//2// ఓఓఓఓఓఓ.... హోహోహోహో... నీ పేరు వింటే నిన్ను తలుచుకుంటే ఉత్సాహం ఉత్తేజం ఉరకలేస్తాయి //2// నిరాశా నిస్పృహలు ఎదురైనప్పుడు అపజయాలు బాధిస్తున్నప్పుడు కమ్యూనిస్టు ధీరత్వాన్ని సడలని ఆత్మస్థైర్యాన్ని నింపుతావు మా గుండెల్లో బిగిసిన పిడికిళ్లలో... సెల్యూట్       సుందరయ్యా  రెడ్ సెల్యూట్  చల్లనయ్యా  సెల్యూట్       అందరయ్యా                      శ్రమజీవుల తండ్రివయా//2// నిస్వార్థ రూపమా నిలువెల్ల త్యాగమా నిరాడంబర జీవితానికి నిలువెత్తు సాక్ష్యమా //2// శ్రమజీవుల శక్తికి నీవు పోరాడే ధైర్యం ఇచ్చావు సిద్ధాంత స్వచ్ఛతకు సమరశీల ఉద్యమాలకు నిలువుటద్దమునీవు మార్క్సిస్టు తత్వమైనావు సెల్యూట్       సుందరయ్యా  రెడ్ సెల్యూట్  చల్లనయ్యా  సెల్యూట్       అందరయ్యా                      శ్ర...

నడుస్తూ నడిపిస్తాడు

నడుస్తూ నడిపిస్తాడు లలల  కన్నీళ్లూ జయిస్తాడు లలలల మరణం లేని సిద్ధాంతానికి పుట్టిన వాడు //2// వాడే కమ్యూనిస్టోడు //4// మన జీవిత జతగాడు పెడదారిని మార్చేటోడు ప్రాప్త కర్మల రోగం కూల్చి మంచి బతుకునిచ్చేటోడు పేద గొప్ప భేదం లేని రాజ్యంకై పోరేటోడు త్యాగాల రూపం తానై  పోరుకు మనల నిలిపేటోడు వాడే కమ్యూనిస్టోడు //4// శ్రమయే జగతికి మూలం అంటూ ఆకలికెవ్వడు మాడొద్దంటూ చెమట చుక్కలా మిగులును చూపి దోపిడీని తెగ నరికేటోడు సిద్ధాంతం ఊపిరి వాడు స్థితిగతులు తెలిసినవాడు అందరికీ అన్నీ దక్కాలంటూ చీకటి  గెలిచే వెలుగులరేడు వాడే కమ్యూనిస్టోడు //4// ఎండా వాన సుడిగాలైన వరదకరువులు ముంచి పోయినా అండగా వెంట నిలిచేటోడు బొందిలో ప్రాణం నిలిపేటోడు సాగుభూమిలో గింజైనాడు కూలి పనుల్లో కూడైనాడు గుడిసె జాగలో జోతైనాడు గుండెలో ఎర్రజెండైయినాడు వాడే కమ్యూనిస్టోడు //4// మతోన్మాదాన్ని ఎదిరిస్తాడు సర్వ మతాలు ఒకటంటాడు సహజీవనము సామరస్యము మానవత్వము వెలుగంటాడు సుఖ సౌఖ్యాలు దక్కాలంటే సోషలిజం మార్గం అంటూ మార్క్సిజాన్ని  బాటగ చేసి బతుకునూ గెలవ మంటాడు వాడే కమ్యూనిస్టోడు //4//

ఇచ్చోటనే సత్కవీంద్రుని

      ( సత్య హరిశ్చంద్ర స్మశాన ఘట్టంలో పాడే పద్యం) సీ ll ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని      కలము నిప్పులలోన కరగి పోయె  యిచ్చోటనే భూములేలు రాజన్యుని         అధికార ముద్రిక లంతరించె  యిచ్చోటనే లేత యిల్లాలి నల్ల పూ         సల సౌరు గంగలో కలసి పోయె యిచ్చోట నెట్టి పేరెన్నికం గనుగొన్న         చిత్ర లేఖకుని కుంచియ నశించె  తే ll ఇది పిశాచులతో నిట లాక్షణుండు  గజ్జ కదిలించి యాడు రంగస్థలంబు యిది మరణదూత తీక్ష్ణమౌ దృష్టు లొలయ అవని బాలించు భస్మసింహాస నంబు ll ___గుఱ్ఱం జాషువా

ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే

ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే నీకు మచ్చ తేడా లేనే లేవులే... మిన్ను నున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది....  మన్నుల నుండి అన్నం తీసే మహిమ నీకున్నది మింటి చుక్కలల్ల వాడు చెమట చుక్కలల్ల నువ్వు ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే నీకు మచ్చ తేడా లేనే లేవులే.... వాన కాలమోస్తో మబ్బుకప్పుకొని మరుగాయే జాబిలి నవ్వు... వానళ్ళ వరదల్ల బురద జల్లి వున్నా మసక జాబిలి నువ్వు  మేఘాల సొగసు వాడు మాగని తేజస్సు నువ్వు  ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే  నీకు మచ్చ తేడా లేనే లేవు లే... రోజుకొక్క రంగు మారిపోతుంది పున్నమి వెన్నెల దీపం  పూటకొక్క తీరు వంగిపోతుంటుంది పుట్టెడు కష్టాల రూపం  అమవాస నెలవంక వాడు ఉపవాస నెలవంక నీవు ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే  నీకు మచ్చ తేడా లేనే లేవు లే...