నడుస్తూ నడిపిస్తాడు



నడుస్తూ నడిపిస్తాడు లలల 
కన్నీళ్లూ జయిస్తాడు లలలల
మరణం లేని సిద్ధాంతానికి పుట్టిన వాడు //2//

వాడే కమ్యూనిస్టోడు //4//

మన జీవిత జతగాడు
పెడదారిని మార్చేటోడు
ప్రాప్త కర్మల రోగం కూల్చి
మంచి బతుకునిచ్చేటోడు
పేద గొప్ప భేదం లేని
రాజ్యంకై పోరేటోడు
త్యాగాల రూపం తానై 
పోరుకు మనల నిలిపేటోడు

వాడే కమ్యూనిస్టోడు //4//

శ్రమయే జగతికి మూలం అంటూ
ఆకలికెవ్వడు మాడొద్దంటూ
చెమట చుక్కలా మిగులును చూపి
దోపిడీని తెగ నరికేటోడు
సిద్ధాంతం ఊపిరి వాడు
స్థితిగతులు తెలిసినవాడు
అందరికీ అన్నీ దక్కాలంటూ చీకటి  గెలిచే వెలుగులరేడు


వాడే కమ్యూనిస్టోడు //4//

ఎండా వాన సుడిగాలైన
వరదకరువులు ముంచి పోయినా
అండగా వెంట నిలిచేటోడు
బొందిలో ప్రాణం నిలిపేటోడు
సాగుభూమిలో గింజైనాడు
కూలి పనుల్లో కూడైనాడు
గుడిసె జాగలో జోతైనాడు
గుండెలో ఎర్రజెండైయినాడు


వాడే కమ్యూనిస్టోడు //4//


మతోన్మాదాన్ని ఎదిరిస్తాడు
సర్వ మతాలు ఒకటంటాడు
సహజీవనము సామరస్యము మానవత్వము వెలుగంటాడు
సుఖ సౌఖ్యాలు దక్కాలంటే సోషలిజం మార్గం అంటూ
మార్క్సిజాన్ని  బాటగ చేసి బతుకునూ గెలవ మంటాడు


వాడే కమ్యూనిస్టోడు //4//





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు