సెల్యూట్ సెల్యూట్



సెల్యూట్ సెల్యూట్

సెల్యూట్ సుందరయ్యా
రెడ్ సెల్యూట్ చల్లనయ్యా 
సెల్యూట్ అందరయ్యా 
శ్రమజీవుల తండ్రివయా//2//

ఓఓఓఓఓఓ.... హోహోహోహో...


నీ పేరు వింటే నిన్ను తలుచుకుంటే
ఉత్సాహం ఉత్తేజం ఉరకలేస్తాయి //2//

నిరాశా నిస్పృహలు ఎదురైనప్పుడు
అపజయాలు బాధిస్తున్నప్పుడు
కమ్యూనిస్టు ధీరత్వాన్ని సడలని ఆత్మస్థైర్యాన్ని
నింపుతావు మా గుండెల్లో
బిగిసిన పిడికిళ్లలో...


సెల్యూట్       సుందరయ్యా 
రెడ్ సెల్యూట్  చల్లనయ్యా 
సెల్యూట్       అందరయ్యా 
                    శ్రమజీవుల తండ్రివయా//2//


నిస్వార్థ రూపమా
నిలువెల్ల త్యాగమా
నిరాడంబర జీవితానికి నిలువెత్తు సాక్ష్యమా //2//

శ్రమజీవుల శక్తికి నీవు పోరాడే ధైర్యం ఇచ్చావు
సిద్ధాంత స్వచ్ఛతకు సమరశీల ఉద్యమాలకు నిలువుటద్దమునీవు మార్క్సిస్టు తత్వమైనావు


సెల్యూట్       సుందరయ్యా 
రెడ్ సెల్యూట్  చల్లనయ్యా 
సెల్యూట్       అందరయ్యా 
                    శ్రమజీవుల తండ్రివయా//2//



తొలి పొద్దు రూపమా
పేదింటిలో దీపమా
కార్మిక కర్షక ఉద్యమాలకు ఉద్వేగ సంద్రమా //2//

దోపిడీని ఎదిరించావు
జనం కోసమే నడిచావు
మట్టి మనుషులను ఒక్కటి చేసి ఉక్కు పిడికిళ్లు చేశావు

వర్గ పోరు దుర్గమా
మార్స్కిస్టు శిఖరమా


సెల్యూట్       సుందరయ్యా 
రెడ్ సెల్యూట్  చల్లనయ్యా 
సెల్యూట్       అందరయ్యా 
                    శ్రమజీవుల తండ్రివయా//2//


నిర్మాణ దక్షతా నీలోని స్వచ్చతా
క్రమశిక్షణ కార్యదీక్షకు జాతికే పాఠమా //2//

తలవంచని విశ్వాసం
వెనుదిరగని సాహసం
విశాలాంధ్రలో ప్రజారాజ్యపు పిలుపే నీవై వెలిగావు
భరతమాత వీరపుత్రుడా ఘనమైన చరితవు

సెల్యూట్ సెల్యూట్

సెల్యూట్       సుందరయ్యా 
రెడ్ సెల్యూట్  చల్లనయ్యా 
సెల్యూట్       అందరయ్యా 
                    శ్రమజీవుల తండ్రివయా//2//








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు