ఇచ్చోటనే సత్కవీంద్రుని


   
  ( సత్య హరిశ్చంద్ర స్మశాన ఘట్టంలో పాడే పద్యం)

సీ ll
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
     కలము నిప్పులలోన కరగి పోయె 
యిచ్చోటనే భూములేలు రాజన్యుని
        అధికార ముద్రిక లంతరించె 
యిచ్చోటనే లేత యిల్లాలి నల్ల పూ
        సల సౌరు గంగలో కలసి పోయె
యిచ్చోట నెట్టి పేరెన్నికం గనుగొన్న
        చిత్ర లేఖకుని కుంచియ నశించె 

తే ll ఇది పిశాచులతో నిట లాక్షణుండు 
గజ్జ కదిలించి యాడు రంగస్థలంబు
యిది మరణదూత తీక్ష్ణమౌ దృష్టు లొలయ
అవని బాలించు భస్మసింహాస నంబు ll
___గుఱ్ఱం జాషువా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు