ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే
ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే
నీకు మచ్చ తేడా లేనే లేవులే లేవులే...
మిన్ను నున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది....
మన్నుల నుండి అన్నం తీసే మహిమ నీకున్నది
మింటి చుక్కలల్ల వాడు చెమట చుక్కలల్ల నువ్వు
ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే
నీకు మచ్చ తేడా లేనే లేవులే. లేవులే...
వాన కాలమోస్తె మబ్బుకప్పుకొని మరుగాయే జాబిలి నవ్వు...
వానళ్ళ వరదల్ల బురద జల్లి వున్నా మసక జాబిలి నువ్వు
మేఘాల సొగసు వాడు మాగని తేజస్సు నువ్వు
ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే
నీకు మచ్చ తేడాలేనే లేవు లే...లేదులే..
రోజుకొక్క రంగు మారిపోతుంది పున్నమి వెన్నెల దీపం
పూటకొక్క తీరు వంగిపోతుంటుంది పుట్టెడు కష్టాల రూపం
అమవాస నెలవంక వాడు ఉపవాస నెలవంక నీవు
ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే
నీకు మచ్చ తేడా లేనే లేవు లే...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి