బహుజన సామాజిక తత్వవేత్త బిఎస్ రాములు
కవి, కథా రచయిత, నవలా రచయిత, సాహితీవేత్త, సామాజిక కార్యకర్త, ఆధునిక భారతీయ సామాజిక తత్వవేత్త, తెలంగాణ రాష్ట్ర బీ సి కమిషన్ మాజీ అధ్యక్షులు బి. ఎస్. రాములు విశాల సాహిత్య అకాడమీని స్థాపించి వందలాది రచయితలకు అవార్డులను ప్రధానం చేసి ఎందరో యువ రచయితలకు ప్రేరణ గా నిలిచారు. అంతే గాక బౌద్ధo, మార్కిజo, అంబేద్కరిజం, మానవతావాదం, స్త్రీవాదం, బహుజనవాదం, వీటన్నింటినీ సమన్వయo చేస్తూ ఒక నూతన తాత్విక చింతన ను ప్రతిపాదించిన తత్త్వవేత్త బి ఎస్ రాములు.
ఆయన కృషి బహుముఖీనం.
అతనిది ఓ ప్రత్యేక శైలి, ప్రత్యేక దృక్పధం. సమాజ స్థితిగతులను తనదైన శైలిలో అనేక కథలుగా అందించి సాహిత్యలోకంలో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించిన సామాజిక సాహిత్య కారుడు.
"కవిని పరిణతి మానవునిగా చేసేదే తత్వశాస్త్రం " వాక్యం రసాత్మకం కావ్యం "అన్నాడు విశ్వనాథుడు. ' పరిణతి వాక్యమే కవిత్వం / అతడొక పరిణత వాక్యావళి/ అతను
విశ్వకవితా విహారం చేస్తున్నారని గట్టిగా విశ్వసిస్తున్నాను' అంటారు డా : అమ్మoగి వేణుగోపాల్ ఆయన గురించి.
ప్రపంచీకరణ యుగంలో సమస్త రంగాల్లో యువతరానికి లీడర్ షిప్ అందించడానికి, ఎదగడానికి తోడ్పడే పాఠ్యగ్రంథల్లా వందలాది గ్రంధాలు, వాటి సారాంశం వివిధ కాలాల్లో కలిసి సాగిన అనుభవం, అధ్యయనం విద్యార్థి, యువజన ఉద్యోగ రచయితల సంఘాల నిర్మాణం, విప్లవ సంఘాల నిర్మాణం, దేశవ్యాప్త పర్యటనలు, అమెరికా ప్రయోగాలు.... అధ్యయనాలు. చేశారాయన.జ్ఞానం అనే పెట్టుబడితోనే ఆధునిక లీడర్ షిప్ సాధించవచ్చoటారు రాములు.
కీ, శే. బేతి లక్ష్మిరాజు, కీ, శే. మిట్టపెల్లి నారాయణ దంపతులకు 1.7.1948 లో జన్మించారు. వీరిది చేనేత కుటుంబం. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చినా పట్టుదలతో చదివాడు.1970-74 లో డి. ఓ ఎల్, బి, ఓ ఏల్, కోర్సును కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి లక్ష్మినరసింహ సంస్కృతాoధ్ర కళాశాలలో చదివారు. 1979-80 కాకతీయ యూనివర్శిటీ కి చెందిన B. ED కాలేజ్ హన్మకొండలో తెలుగు పండిత శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఫలితంగా 1975 లో సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగం మొదలు పెట్టి ఎలగందుల, హుజురాబాద్, వేములవాడ, మల్యాల, సుల్తానాబాద్, జిగిత్యాల, సిరిసిల్ల చివరికి జగిత్యాల జిల్లా రాయికల్ 2006 జులై 31న ఉద్యోగ విరమణ చేశారు. 17 మే 1973 లో చెన్ననారాయణ చెన్నగౌరమ్మ గార్ల ప్రథమ పుత్రిక శ్యామలతో వివాహమైంది.
ఉద్యోగం ఉద్యమం ఆయన జీవితాన్ని నడిపాయి. సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా, రాష్ట్ర శాఖలను నిర్వహించారు.
అంబేద్కర్ సంఘాలను నిర్మించారు.
మద్యపాన వ్యతిరేక, అవినీతివ్యతిరేక ఉద్యమాలలో పాల్గొన్నారు. కూలీల జీవన పెరుగుదల కోసం అనేక ఉద్యమాలు చేశారు.
1977-80లోరాడికల్ విద్యార్థి యువజన సంఘాల నిర్మాణం చేపట్టారు. 1996 నుండి క్రియాశీల పాత్ర పోషించారు. 2016 అక్టోబర్ లో తెలంగాణ రాష్ట్ర తొలి బీ సి కమిషన్ గా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో ,తెలంగాణ చరితను, సంస్కృతిని, భాషను వెలికి తీయడంలో ప్రధాన భూమిక వహించారు.
సంఘమిత్ర, మంటలు పక్షపత్రిక, సృజన మాసపత్రిక ,చాటింపు పక్షపత్రిక మొదలైన పత్రికలకు సంపాదకత్వం వహించారు.
1995 నుండి దరకమే ఐక్యవేదిక తరపున గబ్బిలం మాసపత్రిక ప్రచురించారు.
1852 లో నిజాం వెంకటేశంతో కలిసి కరీంనగర్ ఒక ట్రస్ట్ స్థాపించాడు. బతుకుపోరు నవల, భూమి, బొగ్గు పొరల్లో, అడవిలో వెన్నెల కథా సంపుటాలు ప్రచురించారా సమయంలో.
విశాల సాహిత్య అకాడమీ స్థాపించి కథా శిక్షణ శిబిరాలను, సిద్ధాంత అధ్యయన తరగతులను,
నిర్వహించారు.ఇంటింటి గ్రంధాలయం కొరకు 175 పుస్తకాలను ప్రచురించారు.
బతుకుపోరు నవల (తొలి ముద్రణ 1982, మూడవ 2004), పాలు (1991), స్మృతి (1997), మమతలు - మానవ సంబంధాలు (2000), వేపచెట్టు (20003), తేనే టీగలు (2004), పాలు ఇతర కథలు (2004), బతుకు పయనం (20005), కాలం తెచ్చిన మార్పు (2013), చికాగోలో నానమ్మ (2013), గెలుచుకున్న జీవితం (2013), జర్నీ ఆఫ్ లైఫ్ (ఇంగ్లిష్ 2013), స్ట్రగుల్ ఆఫ్ లైఫ్ (ఇంగ్లిష్ 2013), వాల్యూస్ (ఇంగ్లిష్ 2014), చూపు ( నవల 2014), అడవిలో వెన్నెల ( కథల సంపుటి 2015), ఇల్లు- వాకిలి (కథల సంపుటి 2015), జీవన యానo(నవల ), స్వేచ్ఛ నుండి విముక్తి ( కథలు ) మొదలైన కథలు, నవలలు రాశారు.
ఇవిగాక, తెలంగాణ రాష్ట్రోద్యమ సందర్బంగా ప్రాంతీయ చరిత్ర, సంస్కృతులపై 40 పుస్తకాలు ప్రచురణ. 1200వందల, గీతాలతో
పుస్తకాల ప్రచురించారు. విశాల సాహీతీ బీసీ, ఎస్సీ, ఎస్టీ పాటలు,విశాల సాహీతీ పిల్లల పాటలు, ఇతర సంకలనాలు, 250 కథలతో సంకలనాలు వెలువరించారు. "జ్ఞానంపుట్టుక ", "బహుజనతత్త్వం", " భారతీయ సమాజం - నేటి రాజకీయ, సామాజిక పరిణామాలు, ప్రేమంటే ఏమిటి?, "పాట పుట్టుక", "కథలబడి", "సామాజిక న్యాయం అంటే ఏమిటి? ", " తెలంగాణ రాష్ట్ర సామాజిక చరిత్ర - సంస్కృతి క ఉద్యమాలు ", బీసీల సాధికారిత, " కొత్త చరిత్ర ", " అరవయ్యేళ్ల తాత్విక సామాజిక పరిణామాలు ", మీ ఊరిని మీరే అధ్యయనం చేయండి ", మొదలైనవి తాత్విక రచనల్లో భాగంగా వచ్చాయి. 250కి పైగా పుస్తకాలకు ముందుమాటలు, సమీక్షలు రాశారు. వారి జీవిత కృషిపై ఆరు ఎం. ఫిల్ లు, ఒక పి. హెచ్ డి పరిశోధనలతో సహా ఇప్పటికి పది గ్రంధాలు వెలువడ్డాయి. మరికొన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి.
సామాజిక తాత్విక విశ్వ విద్యాలయం తరపున 90 పుస్తకాల ప్రచురించారు.
గృహ గ్రంధాలయం నిర్వహణలో యువకులను చైతన్య పరుస్తూ మొబైల్ గ్రంధాలయం నిర్వహించారు. 2004లో షోలాపూర్ గ్రంధాలయానికి 600 ల గ్రంధాల వితరణగా ఇచ్చారు.
బహుజనవాద భావజాల ఉద్యమం కోసం
1988-90లో దేశ వ్యాప్తంగా పర్యటన చేసి వందలాది రచయితలతో, కళాకారులతో,
ఉద్యమ కారులతో చర్చలు జరిపారు. అనేక ప్రసంగాలు చేశారు.
తెలుగు రాష్టాలలో అనేక బిరుదులు, పురస్కారాలు, సత్కారాలు పొందారు.
కథక చక్రవర్తి, ఆధునిక భారతీయ సామాజిక తత్వవేత్త, సామాజిక శాస్త్రవేత్త, కథా సామ్రాట్, మహాకవి, మహామహోపాధ్యాయ, తెలంగాణ జ్యోతిబాపులే, బీ సిల మార్గదర్శకుడు, కథా దీపదారి తదితర బిరుదులు ఆయనకు లభించాయి.
టి. ఆర్. ఎస్, కేసిఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ సంబురాలు 2007 లో తెలంగాణ తల్లి రూప కల్పనలో చేసిన సందర్బంగా బంగారు గండపెoడేరoతో సత్కారం పొందారు. హైదరాబాద్నిజాం కాలేజ్ లో డా : పి యశోదారెడ్డి స్మారక తొలి పురస్కారం, 4-11-2008 న స్వర్ణ కంకణం పొందారు. కొడవటిగoటి కుటుంబరావు అవార్డు - 1984 "బతుకుపోరు" నవలకు దశరధి రంగాచార్య అవార్డు - 1992, మాజీమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, బీసీ ఉద్యమనేత కొండ లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ అవార్డు, హేతువాది త్రిపురనేని రమస్వామి చౌదరి పేరిటగల తెలుగు విశ్వవిద్యాలయ ధర్మనిధి
పురస్కారం 1995," మమతలు - మానవ సంబంధాలు " కథల సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం - 2002,
దళిత సాహిత్య అకాడమీ ఢిల్లీ వారి మహాత్మా జ్యోతిరావు పూలే ఫెలోషిప్ - 2001, రామవృక్ష బేణిపురి శతవార్షికోత్స అవార్డు (పానీపట్, హర్యానా ),తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రథమ అవార్డు - తెలంగాణ సారస్వత పరిషత్ 2016
మొదలైన పురస్కారాలన్నో ఆయన సాహిత్య కృషి కి తార్కాణం గా నిలిచాయి.
ఆధునిక కాలంలో టీ.వి లో, యూట్యూబ్ లో ఇంటర్నేట్ లో వస్తున్న నూతన పోకడలను ఆహ్వానిస్తూ నే, సాహీతీవేత్తలు అన్నింట్లో అభినివేశo సాదించాలని కోరారు. "ఒకే ఒక ప్రక్రియకు పరిమితం కావడం దృష్టిలోపం. ఆది సామర్థ్యానికి నిదర్శనం కాదు. సామర్థ్యం పెంచుకోవాలి. అధ్యయనం పెంచుకోవాలి. కథకులు, వచన కవులు పాటలు రాయాలి. కథలు రాయాలి, నవలలు రాయాలి, ఉపన్యాసం ఇవ్వాలి, చక్కని వ్యాసాలు రాయాలి. టివి ఛానల్ కు అనేక ప్రక్రియ లు రాయాలి, రేడియో దూరదర్శన్ లకు కూడా అన్ని ప్రక్రియల్లో రాయాలి."అని యువరచయితలకు సందేశమిచ్చారు. వర్థమాన రచయితలు తమ రచనలను మెరుగు పరుచుకోవడానికి ఇంగ్లీష్ లో అంతర్జాతీయ స్థాయిలో బహుమతి పొందిన షార్ట్ లిస్ట్ అయిన కథలను, నవలలను కష్టపడి అయినా చదవమంటారాయన. తద్వారా శైలి శిల్పం మెరుగుపరుచుకోవచ్చని ఆయన చెపుతారు.
_ పిళ్లా కుమారస్వామి,9490122229
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి