అభ్యుదయ రచయితల సంఘనిర్మాణంలోనే ప్రధానమైన లోపం వుంది. అరసం సభ్యులందరూ సాహిత్యకులే. కాని, వారందరికీ ఒకే రకమైన సామాజిక దృక్పథంగానీ, సాహిత్య లక్ష్యంగానీ లేదు. కానీ అభ్యుదయ సాహిత్యానికి ఒక స్పష్టమైన సామాజిక రాజకీయ చారిత్రక సిద్ధాంతం అనివార్యమైన ప్రాతిపదిక. అరసం నిర్మాతలు ఈ విషయంలో ఉదారవైఖరిని, విశాలదృష్టిని చూపించినందువల్ల అభ్యుదయ భావనాస్పర్శ ఏమాత్రమూలేని విశ్వనాథవంటి రచయితలకు, ఫ్యూడల్ వ్యతిరేక సాహిత్యం సృష్టించిన బూర్జువా రచయితలకు అభ్యుదయ రచయితల సంఘంలో గౌరవ స్థానం లభించిందని యాకూబ్ పేర్కొన్నారు.
కార్తెలు ( kārte)
pc: oneindiatelugu.com There are 27 stars according to Telugu Astrology. Each has its own unique way. These are decided by the entry of the Surya or Sun. సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేసుకుని సంవత్సర కాలాన్ని 27 భాగాలుగా చేశారు. వాటికి ‘కార్తె’ అనే పేరు నిర్ణయించారు. ఒక్కో నక్షత్ర కూటమిలో సూర్యుడు దాదాపు రెండు వారాల పాటు ఉంటాడు. దీనిప్రకారం ఒక్కో కార్తె సుమారుగా 13 లేదా 14 రోజులు ఉంటుంది. అశ్వని నుంచి రేవతి వరకు ఇలా నక్షత్రాల పేరు మీద కార్తెలు ఏర్పడ్డాయి. జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయమై నప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు.కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచారు.సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు ప...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి