క్రిస్టోఫర్ కాడ్వెల్
క్రిస్టోఫర్ కాడ్వెల్
Art is the Product of Society.
As the Peral is the Product of Oyster.
పై మాటలు క్రిస్టోఫర్ కాడ్వెల్ వి. నిజమే ఆణిముత్యాలు ఎక్కడ దొరుకుతాయి. అగాధమైన కాల నిధులలోనే దొరుకుతాయి. కవిత్వం సమాజం వేరువేరుగా లేవు. సమాజంతో కవిత్వం ముడివడి వుంది. అధ్యయనం. ఆ వెంటనే సమన్వయం చేసుకొవడం జరగాలి. అలా కాకపోతే అది అధ్యయనం కాదు.
అది కవిత కావచ్చు. నవల, నాటకం, విశ్లేషణ, విమర్శ ఏదైనా కావచ్చు. ఎక్కడైనా పుట్టొచ్చు. కాలం ఏదైనా కావచ్చు. దేశం ఏదైనా కావచ్చు. అన్నీ సమాజంతోనే వున్నాయి.
అలా చెప్పుకుపోతూ కాడ్వెల్, మార్క్సిస్టు దృక్పథంతో సాహిత్యాన్నీ సమాజాన్నీ, ఉత్పత్తి విధానాల్ని వాటి సంబంధాల్ని,మతాన్ని, కళని, సాంకేతిక శాస్త్రాలని అధ్యయనం చెయ్యడానికి తన రచనల ద్వారా ప్రపంచానికి ఓ నమూనాని అందించాడు. ఓ మార్గాన్ని చూపించాడు.
మార్క్సిస్టు తాత్విక రచయిత క్రిప్టోఫర్ కాడ్వెల్ 1907 అక్టోబర్ 20న పుట్టాడు. 1932 ఫిబ్రవరి 12న మరణించాడు. మరణం మామూలుది కాదు. నాజీ ఫాసిస్టు లతో పోరాడుతూ మరణించాడు. యుద్ధరంగంలో మరణించాడు. అప్పటికి ఆయన వయస్సు 30 లోపే. సరిగ్గా 29 సంవత్సరాల మూడు నెల్ల పన్నెండు రోజులు.
"అసలు పేరు సెంట్ జాన్ స్ప్రిగ్గర్. తల్లి పేరు జస్సీ మేరీకాడ్వెల్. తల్లి పేరే కలం పేరైంది. మే. 1935లో ' దిస్ మై హండ్' అనే నవలకు మొదటిసారి ఈ కలం పేరు వాడాడు. అప్పటి నుండి పేరుతోనే రాశాడు.
ఆయన రచనల్లో కనిపించేది నిజాయితీ, నిబద్దత, మార్క్సిజం మీద ఆయనకున్న విశ్వాసం.ఆయన కమ్యూనిస్టుగాబతికాడు.కమ్యూనిస్టుగానే చనిపోయాడు. 1934 నుండి ఆయన మార్క్సిస్ట్ అయ్యాడు. ఆయన అమూల్యమైన రచనలన్నీ ఆయన మరణం తర్వాత అచ్చయ్యాయి.
అతను 15 సంవత్సరాల వయస్సులో పాఠశాలను విడిచిపెట్టి, యార్క్‌షైర్ అబ్జర్వర్‌లో రిపోర్టర్‌గా తన పని జీవితాన్ని ప్రారంభించాడు, అక్కడ అతని తండ్రి సాహిత్య సంపాదకుడు. ఆపై బ్రిటిష్ మలయా ఎడిటర్‌గా పనిచేశారు. లండన్‌కు తిరిగి వచ్చిన తర్వాత, అతను తన సోదరుడితో కలిసి ఏరోనాటిక్స్ పబ్లిషింగ్ కంపెనీని నడిపించాడు.దాని టెక్నికల్ జర్నల్‌లో ఒకదాన్ని ఎడిట్ చేసాడు మరియు మోటార్‌కార్ల కోసం గేర్‌లను డిజైన్ చేసాడు. అదనంగా, అతను కవితలు, నాటకాలు, చిన్న కథలు, డిటెక్టివ్ నవలలు మరియు ఏరోనాటిక్స్ పాఠ్యపుస్తకాలను వ్రాసాడు. అతను దెయ్యం కథల సంపుటిని కూడా సవరించాడు.
వీటన్నింటికి మించి, అతను తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం, మానవ శాస్త్రం, మనస్తత్వశాస్త్రం, చరిత్ర, రాజకీయాలు, భాషాశాస్త్రం, గణితం, అర్థశాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, న్యూరాలజీ, సాహిత్యం మరియు సాహిత్య విమర్శలు మరియు ఇంకా చాలా ఎక్కువ చదివాడు. విశ్వవిద్యాలయ విద్య లేనప్పటికీ, అతను చాలా గణనీయమైన అభ్యాసం కలిగిన వ్యక్తి అయ్యాడు.
27 సంవత్సరాల వయస్సులో, 1934లో, కాడ్‌వెల్ మార్క్సిజంపై ఆసక్తి పెంచుకున్నాడు మరియు అసాధారణ తీవ్రతతో అధ్యయనం చేయడం ప్రారంభించాడు, అతను కోరుతున్న సంశ్లేషణకు ఇది కీని అందించిందని త్వరగా తెలుసుకున్నాడు. 1935 వేసవిలో, అతను తన మొట్టమొదటి మార్క్సిస్ట్ పుస్తకాన్ని వ్రాసాడు. కానీ దాన్ని గణితం అని పిలిచాడు.అయితే మాక్మిలన్ ద్వారా 'ఇల్యూషన్ అండ్ రియాలిటీ'గా ప్రచురణ కోసం పంపించాడు. ఈ పుస్తకం పూర్తయిన తర్వాత, అతను లండన్ వెళ్లి, కమ్యూనిస్ట్ పార్టీ శాఖలో చేరాడు. అతను అన్ని సాధారణ పార్టీ పనులు, ఫ్లై-పోస్టింగ్, వీధి మూలలో మాట్లాడటం, ది డైలీ వర్కర్‌ను విక్రయించడం, అలాగే బ్లాక్‌షర్టులతో పోరాటంలో పాల్గొనడం, ఇలాంటివెన్నో చేశాడు. పర్యవసానంగా చాలా సార్లు అరెస్టు చేయబడ్డాడు.
ఆయన రచనల్లో "ఇల్యూషన్ అండ్ రియాలిటీ( భ్రమ_వాస్తవికత) స్టడీస్ యిన ఏ డైయింగ్ కల్చర్ (మరనోన్ముఖమైన సంస్కృతిపై అధ్యయనం), ఫర్దర్ స్టడీస్ యిన్ ఎ డైయింగ్ కల్చర్
(మరనోన్ముఖమైన సంస్కృతి పై మరికొంత అధ్యయనం) ఆయనకున్న నిశిత హేతుబద్ధి దృష్టిని, గతితార్కిక చారిత్రక భౌతిక వాద అవగాహనను మన ముందు వుంచుతాయి.
ప్రపంచంలో కమ్యూనిస్టులు స్వేచ్ఛ కోసం పోరాడుతారు. స్వేచ్ఛ కోసం మరణిస్తారు. ఎందుకలా పోరాడుతారు. అంతిమ విశ్లేషణలో కమ్యూనిజమే స్వేచ్ఛని ఎలా తెలుసుకోగలుగుతారు మొదలైన విషయాలను కాడ్వెల్ తన "స్టడీస్ ఇన్ ఏ డైయింగ్ కల్బర్ లో వివరిస్తాడు. "స్వేచ్ఛ అంటే ఏమిటో వివరించడానికి చేసిన బరువైన సంక్లిష్టమైన, విస్తృతమైన, తీవ్రమైన ప్రయత్నం" అని ఆ పుస్తకానికి దాసిన ఉపొద్ఘాతంలో అంటాడు జాన్ స్ట్రాలీ.
ఆయన మనిషిని, ప్రకృతిని, చరిత్రని, మనస్తత్వాన్ని తత్వశాస్త్రాన్ని అలా ప్రతి అంశాన్ని గూర్చి మాట్లాడాడు. ఏది మాట్లాడినా సరుకుల ఉత్పత్తి ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ సంబంధాలు ఆయా అంశాలలోని అసలు సమష్టి సంస్కృతిని భగ్నం చేసి హీన సంస్కృతిని ఎలా సృష్టించాయో వివరిస్తాడు. ఈ ప్రపంచం తల్లక్రిందులుగా వుంది. దాన్ని సరిగ్గా నిలబెట్టాలి. అలా సాహిత్యాన్ని, సమాజాన్ని ఉత్పత్తి విధానాల్ని వాటి సంబంధాలని, నిలబెట్టగలిగేది శ్రామిక రాజ్యం, ప్రజల సంస్కృతి మాత్రమే. మార్క్సిజం మాత్రమే అని ఆయన సమర్ధవంతంగా వివరిస్తూ, నిరూపిస్తూ రచనలు చేశాడు..
సాహిత్య రంగాల్లో ఆధునికానంతర ధోరణులు రోజుకో వికృతి రూపం దాలుస్తున్న ఈ రోజుల్లోకాడ్వెల్ ను తప్పనిసరిగా చదవాల్సివుంది. ఆయన ఆలోచనలు, ప్రతిపాదనలు, విమర్శలు, విశ్లేషణలు అందరికీ ఆమోదం కాకపోవచ్చు. కాని ఆయన్ని చదివిన తర్వాత తల్లకిందులై పోయిన ప్రపంచాన్ని సరిగ్గా కాళ్ల మీద నిలపాలంటే
మార్క్సిజం ఎంత సమర్థవంతమైందో అర్థమౌతుంది.
(అరుణతార)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి