పోస్ట్‌లు

జూన్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

కవిత్వంలో అల్లిక పొందిక

కవిత్వంలో అల్లిక పొందిక ____జిలుకర శ్రీనివాస్ కవిత్వంలో వస్తువు, దాని వ్యక్తీకరణ, వాటి మధ్య తాత్విక సంబంధం గురించి చర్చించడమే అల్లిక, పొందిక. భాషపరంగా చూస్తే కవిత్వం ఒక సంకేతాల వ్యవస్థ. భావాన్ని పరస్పరం వ్యక్తీకరించుకునేది భాష. భాష అంటే సంకేతాల వ్యవస్థ. సంకేతం అంటే ఏమిటి? మనభావాల్ని ఎలా మోస్తుంది? అది సరియైనదా? వ్యక్తీకరించటానికి భాష సరిపోవట్లేదు అని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితి వుంటుందా? ది లిమిటేషన్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ఈజ్ యువర్ వరల్డ్. మనం ప్రపంచాన్ని ఎంత తెలుసు కుంటామో అంతే జ్ఞానాన్ని కలిగి వుంటాం. నా గీతం ఏ ఏ శక్తులలో ప్రాణం పొందిందో...  అని శ్రీశ్రీ అంటున్న ప్పుడు ఇదే సందేశం వినిపిస్తుంది - ఒకదాన్ని ఎంపిక చేయటం అంటే మిగతావాటన్నిటిని తుడిచి వేయటమే. కవిత్వమెప్పుడూ తుడిచేసే ప్రక్రియే. పదేపదే మార్పులు ఎందుకు చేస్తాం. అంటే ఇదే కారణం. అన్ కంట్రోల్డ్ ఇన్స్పి రేషన్ నుంచి కవిత్వం పుడుతుందని సోక్రటీస్ అంటాడు. ఈ కవిత్వాన్ని అనేక సార్లు దిద్దుకుంటాం. భాష అసమగ్రమైనది. సరైన పదం కోసం వెదుకుతాం. పచ్చని కవిత్వానికి పది సూత్రాలు  11     పిళ్లా కుమారస్వామి...

కదిలే ప్రపంచం.. కదిలించే కవిత్వం...

కదిలే ప్రపంచం.. కదిలించే కవిత్వం... ____జ్వాలాముఖి: ప్రతి పది సంవత్సరాలలో సాహిత్యంలో మార్పులు వస్తాయి. నన్నయ్య అక్షర రమ్యత, తరువాత పోతన కవిత్వం, శ్రీనాథుని చాటువులు, శతక వాజ్మయం వచ్చింది. వేమన సుమతి, ధూర్జటి లేకపోతే లౌకిక చింతన, నిజమైన సంస్కారం వచ్చేది కాదు. నన్నయ్య అక్షర రమ్యతలో సంస్కృతి, తెలుగు పదాలు, తత్సమాలు సరైన పొందికలో వుండటం, కథనశైలి, అక్షర రమ్యత పొందిక కుదిరింది. 11వ శతాబ్ధపు నన్నయ్య తరువాత చీము, నెత్తురు ఉన్నట్లు పాత్రలు ముందుకు వచ్చాయి. 13వ శతాబ్ధపు తిక్కన దగ్గర ఇది ప్రారంభమైంది. ప్రజల్లో వున్న జాను తెలుగును సంస్కృతాన్ని కలిపి రాశాడు తిక్కన. తెలుగులో వీరేశలింగం 30 పద్యాల సరస్వతీ, నారద సంవాదం రాశాడు. శతక కవులు వచ్చారు. చంధస్సు, భావాలకు కవిత్వం పరిమితమా ? చందోబద్ధంగానే కవిత్వం ఉండాలా ? ఇవన్నీ నేటి ప్రశ్నలు కావు. పొలరైజేషన్ కవిత్వంలో జరిగింది. ఉ రి, శిరస్సు చెప్పిన బాధలు, బాధల భావాలు చెప్పిన వేశ్య, కదిలే జీవితం, కదిలించే కవిత్వం - మనిషిని కదిలిస్తుంది. ఈసురోమని మనుషులుంటే 'దేశమేగతి బాగుపడువోయ్' అని అన్నాడు గురజాడ. దీన్ని మార్చెందుకే సాహిత్యం మారుతూ వుంటుంది. నానీలు, వచన...

పచ్చని కవిత్వానికి పది సూత్రాలు

చిత్రం
      courtesy fb పచ్చని కవిత్వానికి పది సూత్రాలు                ___ కన్నెగంటి రామారావు నువ్వు లేవు, నీ పాట ఉంది, గుర్తుకువస్తోంది. నేను ఎనిమిదో తరగతి చదువుతూ, కవిత్వం గెలుకుదామని ప్రయత్నిస్తున్న రోజుల్లో  ఒకరు చెప్పిన ట్రిక్కు కూడా గుర్తొస్తోంది.  1. ఏం రాయాలనుకున్నావో అది మొదట రాయి. అది సూటిగా సింపుల్ గా ఉండాలి. ఉదాహరణకు 'రాత్రి చీకటిగా' వుంది.  2. అటువంటి వాక్యాలు చాలా తయారయిన తరువాత, వాటిలోని పదాలను అటూ ఇటూ మార్చేయాలి, ఇట్లా 'ఉంది రాత్రి చీకటిగా’ కానీ, సాదా వాక్యాల మీద ఇటువంటి మార్పు చేస్తే సరిపోదు. చాలా మంది అర్భకపు కవులు పొరపాటు చేసేది ఇక్కడే. ఆ వాక్యాల్లో మరి కొన్ని మార్పులు చేయాల్సి ఒక్కొక్కటి ఇక్కడ ప్రయత్నిద్దాం. 3. మొదట కొన్ని విశేషణాలను, ఉపమానాలను కలుపుదాం. ఈ పనికి రెండు రకాల పద్ధతులున్నాయి. 'దేశవాళీ' పద్ధతిని కానీ, 'పురాణ' పద్ధతిని కానీ తీసుకోవచ్చు. దేశవాళీ పద్ధతిలో చేయాలంటే. నీకు గ్రామీణ పదజాలం తెలిసి ఉండాలి. తెలుగుదనం గుప్పించాలి. రైతు, మట్టి, తొలకరి, అమాయక పల్లెపడుచు, మల్లెపూవు... ఇటువంటి మా...

Popular Culture & Class Struggle

*Popular Culture & Class Struggle* What constitutes so-called "popular" or "low brow" culture, i.e., those aspects of culture which occupy the general population, as opposed to “high brow” culture (classical music, avant garde art, theater, opera) which is generally viewed as being produced by and for a “cultural elite,” changes over time but has often been defined to include a wide variety of activities and media, from daily life activities (patterns of family interactions to television and schooling) to special events (carnivals, comic books), film (grade B, drive-in), theater (street) and literature (romance novels, westerns, science fiction). While these two terms: popular culture and high brow culture have not generally been given class specific definitions, there has been a tendency among Marxist critics to understand popular culture in terms of the amusements and life styles of the working class and high brow culture in terms of those of the wealthier lei...

సాంస్కృతిక రంగంలో వర్గపోరాటం

*సాంస్కృతిక రంగంలో వర్గపోరాటం*            కళలు, భాష, సాహిత్యం, క్రీడలు, సంగీతం- ఇవన్నీ దైవసృష్టని చెపుతుంది బూర్జువా వర్గం. ఉదా: సాహిత్యం సరస్వతీదేవి వల్ల, నాట్యం ఈశ్వరుని వల్ల, సంగీతం - నారదుని వల్ల వచ్చిందని చెపుతారు. కాళిదాసుకి కవిత్వం చెప్పే శక్తి కాళికాదేవి దయవల్ల వచ్చింది. ఇలా...        కళలు, భాష, సాహిత్యం. క్రీడలు, సంగీతం ఇవన్నీ ప్రజలు తమ జీవనం కోసం ఉత్పత్తి చేసే క్రమం నుండే పుట్టాయి.ఈ ఉత్పత్తి సామాజికంగా జరిగేది. మానవులు ఒకరితో ఒకరు సహకరించుకుంటేనే ఉత్పత్తి జరిగేది. అందుకు ఒకరిభావాలు ఒకరికి వ్యక్తం కావడం అవసరం. అందుకుగాను మొదట్లో సంజ్ఞలద్వారా తెలియజేసుకొనేవారు. ఇదే క్రమంగా అభినయంగా మారింది. గొంతుతో రకరకాల శబ్దాలు చేసేవారు. ఇదే క్రమంగా మాట్లాడేభాష అయింది.పాట పుట్టింది. శ్రమ నుంచే భాష,అభినయం, నృత్యం,పాట పుట్టాయి.             బొమ్మలు గీసి వాటిద్వారా భావాలు తెలియజేసేవారు. కాలక్రమేణా దానినుండే లిపి వచ్చింది. చిత్రలేఖనం వచ్చింది.             శ్రమలో కష్టాన్ని మర్చిపోవడం కో...
దేశంలోని వివిధ ప్రదేశాల్లో మన పార్టీ సభ్యులు చురుకుగా పనిచేస్తున్న సాంస్కృతిక గ్రూపులు, సమాఖ్యలు, వేదికలు, సంఘాల్లో విస్తృత ప్రాతిపదికపైన విభిన్నరకాల కళాకారులను, సాంస్కృతిక కార్యకర్తలను మన కార్యకలాపాల్లో ఇముడ్చుకోవాలి. ఇటువంటి కార్యకలాపాల్లోకి రాణింపు, సృజనాత్మక శక్తి ఉన్న వారిని ఆకర్షించాలి. ఇది జరగాలంటే మన వైఖరి విశాలంగా, అందర్నీ ఇముడ్చుకునేట్లు ఉండాలి. ఒంటెత్తుపోకడలు కూడదు. విస్తృత ప్రజాతంత్ర, పురోగామి, లౌకిక విలువలు గలిగిన కళాకారుడు లేక మేధావితో మనకు కొన్ని నిర్ధిష్ట అంశాలపై విభేదాలు ఉన్నప్పటికీ అతను మన వేదికలమీద సాంస్కృతిక కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొనేందుకు అవకాశం కల్పించాలి. మనతో ఉన్న సాంస్కృతిక సంస్థల్లో పార్టీ సభ్యులు కాని వారిని కూడా నాయకత్వ స్థానాల్లోకి చైతన్య పూర్వకంగా ప్రోత్సహించాలి. (సాంస్కృతిక రంగంలో కర్తవ్యాలు నుండి _ సిపిఎం)
"సాంస్కృతిక రంగాన్ని సమగ్రదృష్టితో చూడాలి. దాన్ని కేవలం 'కళలు'గా మాత్రమే కాకుండా ప్రజల 'సజీవ జీవనం'గా చూడాలి. ఉచ్ఛారణ తీరు, ఆహారపు రుచులు, ఆహార్యం మొదలైన సాంస్కృతిక లక్షణాలు ప్రజల సాధారణ, దైనందిన అంశాలన్నిటినీ తీర్చిదిద్దుతాయి. (సంస్కృతిలో ఇటువంటి అంశాలు ఇంకా ఉంటాయి.) సరిగ్గా ఈ కారణం చేతనే మనం మన దృష్టిని సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు పరిమితం చేయకుండా మొత్తం ప్రజా సంస్కృతిలోనే జోక్యం చేసుకోవాలి. అంటే ఒక విషయం చెప్పడానికి కళలను, సంస్కృతిని ఉపయోగించుకునే వైపునుండి నిత్యజీవితంలోకి అంటే దైనందిన జీవితం ఎలా నిర్వహించాలి అనేవైపు, సమాజంలో, సంస్థల్లో, కుటుంబంలో పురోగామి, లౌకిక, ప్రజాతంత్ర భావాలు చొప్పించడం వైపుకు మళ్లించాలి." (సాంస్కృతిక రంగంలో కర్తవ్యాలు నుండి _ CPM AP)

చదువవలసిన పుస్తకాలు

*చదువవలసిన పుస్తకాలు* *ఎన్.వేణుగోపాల్* వీక్షణం,ఎడిటర్ .  ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ జీవితంలో చాల సులభంగా కనబడేవి నిజానికి చాల కష్టం. ‘చదవవలసిన’ లేదా ‘ప్రభావితం చేసిన పుస్తకం/పుస్తకాలు’ అని చెప్పడం అటువంటి సులభంగా కనబడే కష్టమైన పనుల్లో ఒకటి. ఎంత తక్కువ పుస్తకాలు చదివేవాళ్లయినా, విద్యార్జనలో భాగంగా చదివే పాఠ్యపుస్తకాలు కాక ఇతర పుస్తకాలు కొన్ని డజన్లయినా చదివి ఉంటారు. వాటిలో ఏదో ఒకటో, ఏవో కొన్నో వాళ్లను ప్రభావితం చేసి ఉంటాయి. ఆ పుస్తకాలలో ఒకటి రెండయినా అందరూ చదివితే బావుండునని అనిపించి ఉంటాయి. ఇక దొరికిన పుస్తకమల్లా చదివేవాళ్లకయితే ఇలాంటి జాబితాలో కొన్ని డజన్ల, వందల పుస్తకాలూ ఉండవచ్చు. చదవకపోయినా, ఎప్పటికయినా చదవవలసిన పుస్తకాల జాబితా కూడ ఎవరికయినా ఉండవచ్చు. నా వరకు నాకు చదవవలసిన, ప్రభావితం చేసిన పుస్తకాల గురించి చెప్పడం చాల కష్టంగా ఉంటుంది. ఏదో ఒక పుస్తకం దగ్గర ఆలోచన ఆపేసి, దాని గురించి రాద్దామనుకుంటే మరో పుస్తకం అంతకన్న గట్టిగా పోటీ పడుతుంది. ఒక రంగంలోని పుస్తకం గురించి చెపుదామనుకుంటే మరొక రంగంలోని పుస్తకం అంతకన్న బలమైనదనిపిస్తుంది. అలాంటి పుస్తకాల గురించి చెప్పడం కన్న ముందు అసలు మనుషులు ...

మాయమై పోతున్నాడమ్మా

మాయమై పోతున్నాడమ్మా   (ఎర్ర సముద్రం ) మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడో కాని కంటికి కనరాడు మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు నిలువెత్తు స్వార్ధము నీడలా వస్తుంటే. చెడిపోక ఏమైతడమ్మా.. చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా..దిగజారుతున్నడోయమ్మా అవినీతి పెనుఆశ అందకారము లోన అమాయమై పోతున్నాడమ్మా  అవినీతిపెనుఆశ అందకారము లోన చిక్కిపోయి రోజు శిదిలమౌతున్నాడు మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడుమచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు ఇనుప రెక్కల డేగ విసిరినా పంజాకు. కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు వుట్టికి స్వర్గాని కందకుండగ తుదకు అస్తిపంజరమై అగుపించనున్నాడు అస్తిపంజరమై అగుపించనున్నాడు కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ కనుబొమ్మ లెగిరేసి కాలగమనములోన మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు ఇరువై అయిదు పై...

సామెతలు 2

తెలుగు సామెతలు  1.లంక కాల్చినవాడు రాముడి లెంక. 2.. లంక(ఘ)నాలలో మనుగుడుపులు తలచుకొన్నట్లు. 3. లంక మేతకు, ఏటి ఈతకు సరి (ఏరుదాటి మేసి, తిరిగి యీది దాటే లోపల తిన్నగడ్డి జీర్ణమై పోయినట్లు). 4. లంక మేత, గోదావరి ఈత. 5. లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే. 6. లంఖ(ఘ)ణానికి పెడితే పథ్యానికి దిగితుంది. 7. లంఖణాలకు పెడితేగానీ పైత్యం వదలదు. 8. లంచం పెట్టినది మాట, పుంజం పెట్టినది బట్ట (పుంజం= కొన్ని నూలుపోగుల మొత్తం). 9. లంచం లేనిదే మంచం ఎక్కదు. 10. లంచమనే చెట్టుకొమ్మలు నలుప్రక్కలా ప్రాకియుండును. 11. లంజకు ఒకడే మొగుడా? 12. లంజకు నిగ్గు, సంసారికి సిగ్గు ఉండాలి. 13. లంజకు బిడ్డ తగలాటము. 14. లంజకు పెట్టిన పెట్టు, గోడకు పూసిన సున్నం తిరిగి రావు. 15. లంజకు మొగమాటం లేదు, పంజకు ధైర్యం లేదు. 16. లంజకు సిగ్గున్నా, ఇల్లాలుకు సిగ్గులేకపోయినా చెడుతారు. 17. లంజ బిడ్డకు తండ్రెవరు? 18.లంజను లంజా అంటే, రచ్చకెక్కుతుంది, ఇల్లాలిని లంజ అంటే ఇంట్లో దూరుతుంది. 19. లంజా ! అంటే లక్ష్మీదేవి అన్నట్లగునా? (లంజ లం = నీటియందు, జ = పుట్టినది - లక్ష్మి అని). 20 లక్క జొచ్చిన నగ - కుక్క జొచ్చిన ఇల్లు. 21. లక్కలేని నగ, బొక్కలేని మ...