పచ్చని కవిత్వానికి పది సూత్రాలు
courtesy fb
పచ్చని కవిత్వానికి పది సూత్రాలు
___ కన్నెగంటి రామారావు
నువ్వు లేవు, నీ పాట ఉంది, గుర్తుకువస్తోంది.
నేను ఎనిమిదో తరగతి చదువుతూ, కవిత్వం గెలుకుదామని ప్రయత్నిస్తున్న రోజుల్లో ఒకరు చెప్పిన ట్రిక్కు కూడా గుర్తొస్తోంది.
___ కన్నెగంటి రామారావు
నువ్వు లేవు, నీ పాట ఉంది, గుర్తుకువస్తోంది.
నేను ఎనిమిదో తరగతి చదువుతూ, కవిత్వం గెలుకుదామని ప్రయత్నిస్తున్న రోజుల్లో ఒకరు చెప్పిన ట్రిక్కు కూడా గుర్తొస్తోంది.
1. ఏం రాయాలనుకున్నావో అది మొదట రాయి. అది సూటిగా సింపుల్ గా ఉండాలి. ఉదాహరణకు 'రాత్రి చీకటిగా' వుంది.
2. అటువంటి వాక్యాలు చాలా తయారయిన తరువాత, వాటిలోని పదాలను అటూ ఇటూ మార్చేయాలి, ఇట్లా 'ఉంది రాత్రి చీకటిగా’
కానీ, సాదా వాక్యాల మీద ఇటువంటి మార్పు చేస్తే సరిపోదు. చాలా మంది అర్భకపు కవులు పొరపాటు చేసేది ఇక్కడే. ఆ వాక్యాల్లో మరి కొన్ని మార్పులు చేయాల్సి ఒక్కొక్కటి ఇక్కడ ప్రయత్నిద్దాం.
3. మొదట కొన్ని విశేషణాలను, ఉపమానాలను కలుపుదాం. ఈ పనికి రెండు రకాల పద్ధతులున్నాయి. 'దేశవాళీ' పద్ధతిని కానీ, 'పురాణ' పద్ధతిని కానీ తీసుకోవచ్చు. దేశవాళీ పద్ధతిలో చేయాలంటే. నీకు గ్రామీణ పదజాలం తెలిసి ఉండాలి. తెలుగుదనం గుప్పించాలి. రైతు, మట్టి, తొలకరి, అమాయక పల్లెపడుచు, మల్లెపూవు... ఇటువంటి మాటలన్నీ నీ నేస్తాలు.
ఒక పురాణ శైలిలోకి దిగాలంటే, నీ చేతిలో ఒక నిఘంటువు ఉండాలి - పర్యాయపద కోశం వంటిది. అలా, మనం కొన్ని విశేషణాలు జతచేద్దాం.

రాత్రి సిగ్గుపడుతున్న అమ్మాయిలా, అస్పష్టంగా, చీకటిగా ఉంది.
4. దీన్ని మరి కొంచెం క్లిష్టం చేయాలి. పాఠకుడి మెదడుకి మేత పెట్టాలి సులువుగా తెలిసిపోయే అంశాలు వదిలేయాలి.
4. దీన్ని మరి కొంచెం క్లిష్టం చేయాలి. పాఠకుడి మెదడుకి మేత పెట్టాలి సులువుగా తెలిసిపోయే అంశాలు వదిలేయాలి.
రాత్రి సిగ్గుపడుతూ చీకటిగా ఉంది.
5. ఇప్పుడు ఇంకాస్త ముందుకు వెళ్లి దాన్ని 'పదచిత్రం'గా మలచాలి.
సిగ్గుపడుతున్న రాత్రి మొహమ్మీదకి జారిన చీకటి ముసుగు
ఇక్కడ శైలిలో నిలకడ చాలా ముఖ్యం. మొదటి పాదంలో "సిగ్గు” ను ప్రవేశపెట్టాం కాబట్టి. మనం 'ముసుగు' అన్న మాటను ఉపయోగించడానికి వీలవుతోంది.
6. లేదా మనం చాలా సూటిపద్ధతి అనుసరించదలిస్తే - వివరాలు ముఖ్యం. కానీ, ఆ వివరాలు సాధ్యమైనంత వివరంగా ఉండడమే మంచిది.

రాత్రి చీకటిగా ఉంది మా పాలేరులాగా
వాడి నల్ల కళ్ళ లాగ మెరుస్తున్నాయి ఆ మబ్బుల్లోంచి కనిపించే నాలుగు చుక్కలూ
కీచురాళ్ళు వినిపిస్తున్నాయి.
ఇక్కడ చివరలో ఏదో ఒక అమూర్త భావనను పద్యంలోకి తీసుకురావడం అవసరం. ఉదాహరణకు ఒక సందేశంతో ఇట్లా ముగించవచ్చు.
ఎప్పుడో వెలుగు రాకతప్పదు
మా పాలేరు నెత్తుటిలోంచి అరుణోదయం రాకతప్పదు
7. ఒకవేళ నువ్వు అస్పష్టత ఇంప్రెషనిజం అంశ ఉన్న మొదటి దారినే తీసుకుంటే, పద్యాన్ని ఎట్లా ముగిస్తావు? అదే భావధారను క్రమంగా పతాక స్థాయికి తెచ్చి ముగింపు ఇవ్వాలి. లేదా దానికి పూర్తిగా వ్యతిరేకమైన జూడో పంచ్ ముగింపు అయినా ఇవ్వాలి. ఉదాహరణకు ఈ కింది సందేశాన్ని జోడించి పద్యాన్ని వ్యక్తిగతంగా మార్చేయవచ్చు.
నా గుండెల్లో నీ అడుగుల చప్పుడు (చీకటి.. కూడా... రావాలి కానీ సమయం లేదు) లేదంటే, ఒక అధివాస్తవిక చరణాన్ని విసరవచ్చు.
కావు కావు మని కూసే కాకుల గోలతో తెల్లారుతుంది.
8. సరే, ఇవన్నీ నలిగిన దారులే అనుకుంటే, కొత్తరూటులోకి ఎందుకు వెళ్ళకూడదు? 'శేషేంద్ర' లాగా ఉపమానాలను ఎందుకు ప్రయత్నించకూడదు? ఇక్కడ ఉపాయం ఏమిటంటే, పచ్చి వ్యతిరేక విశేషణాలు వాడడం. వైన్ గురించిన పుస్తకాలు చదివి ఉంటే, ఈ పనికి తప్పనిసరిగా పూనుకుంటారు. ఇట్లా ట్రై చేద్దాం.
రాత్రి వగరుగా ఉంది
ఉదారంగు ఆనందాన్ని పంచుకున్న ప్రేయసి లాగ,
శీలనేత్రాశ్రువులు అగ్ని కణికల్లాగ
రాత్రి నల్లగా వెలుగుతోంది
చూశారా, నేను ఎంత యధాలాపంగా విరుద్ధ ఉపమానాల్లోకి జారిపో యానో? ఇదేమిటని జనం అడిగితే తప్పుమనది కాదు, అర్థం చేసుకోలేకపోవడం వారి తప్పు!!
9. అమెరికాలో నల్లవారి పేరుతో సినిమాలు తీసి సొమ్ముచేసుకునే సంప్రదా యం ఒకటి ఉంది. ఆంధ్రాలో అయితే 'ఎర్రసినిమా' సంప్రదాయం అనవచ్చేమో? ఇక్కడ చిట్కా ఏమిటంటే - పాఠకుడిని నీవైపు లాక్కోడం. కవిత్వాన్ని అవమానించడం
సిగ్గుచేటని అతను అనుకోవాలి. నిజానికి, ఇది కవిత్వమే కాదని చెప్పు.
ఇది ఉదయ శంఖారావం / చీడపురుగుల గుండెల్లో సింహ గర్జన అని ఇట్లా ఏదోచెప్పు.
అంతేకాదు, నీ కవిత్వ పుస్తకంలో నీ కవిత్వాన్ని సమర్థించుకునే పోయెం ఒకటి ఉండితీరాలి.
10. చివరగా నువ్వు కవిత్వం రాయాలంటే ప్రసిద్ధకవుల కవిత్వం చదవాలి. ఎంత ఎక్కువ చదివితే అంత బాగా కవిత్వం రాయగలవు.
(26.1.2003 ఆంధ్రజ్యోతి)
10. చివరగా నువ్వు కవిత్వం రాయాలంటే ప్రసిద్ధకవుల కవిత్వం చదవాలి. ఎంత ఎక్కువ చదివితే అంత బాగా కవిత్వం రాయగలవు.
(26.1.2003 ఆంధ్రజ్యోతి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి