"సాంస్కృతిక రంగాన్ని సమగ్రదృష్టితో చూడాలి. దాన్ని కేవలం 'కళలు'గా మాత్రమే కాకుండా ప్రజల 'సజీవ జీవనం'గా చూడాలి. ఉచ్ఛారణ తీరు, ఆహారపు రుచులు, ఆహార్యం మొదలైన సాంస్కృతిక లక్షణాలు ప్రజల సాధారణ, దైనందిన అంశాలన్నిటినీ తీర్చిదిద్దుతాయి. (సంస్కృతిలో ఇటువంటి అంశాలు ఇంకా ఉంటాయి.) సరిగ్గా ఈ కారణం చేతనే మనం మన దృష్టిని సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు పరిమితం చేయకుండా మొత్తం ప్రజా సంస్కృతిలోనే జోక్యం చేసుకోవాలి. అంటే ఒక విషయం చెప్పడానికి కళలను, సంస్కృతిని ఉపయోగించుకునే వైపునుండి నిత్యజీవితంలోకి అంటే దైనందిన జీవితం ఎలా నిర్వహించాలి అనేవైపు, సమాజంలో, సంస్థల్లో, కుటుంబంలో పురోగామి, లౌకిక, ప్రజాతంత్ర భావాలు చొప్పించడం వైపుకు మళ్లించాలి."
(సాంస్కృతిక రంగంలో కర్తవ్యాలు నుండి _ CPM AP)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి