దేశంలోని వివిధ ప్రదేశాల్లో మన పార్టీ సభ్యులు చురుకుగా పనిచేస్తున్న సాంస్కృతిక గ్రూపులు, సమాఖ్యలు, వేదికలు, సంఘాల్లో విస్తృత ప్రాతిపదికపైన విభిన్నరకాల కళాకారులను, సాంస్కృతిక కార్యకర్తలను మన కార్యకలాపాల్లో ఇముడ్చుకోవాలి. ఇటువంటి కార్యకలాపాల్లోకి రాణింపు, సృజనాత్మక శక్తి ఉన్న వారిని ఆకర్షించాలి. ఇది జరగాలంటే మన వైఖరి విశాలంగా, అందర్నీ ఇముడ్చుకునేట్లు ఉండాలి. ఒంటెత్తుపోకడలు కూడదు. విస్తృత ప్రజాతంత్ర, పురోగామి, లౌకిక విలువలు గలిగిన కళాకారుడు లేక మేధావితో మనకు కొన్ని నిర్ధిష్ట అంశాలపై విభేదాలు ఉన్నప్పటికీ అతను మన వేదికలమీద సాంస్కృతిక కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొనేందుకు అవకాశం కల్పించాలి. మనతో ఉన్న సాంస్కృతిక సంస్థల్లో పార్టీ సభ్యులు కాని వారిని కూడా నాయకత్వ స్థానాల్లోకి చైతన్య పూర్వకంగా ప్రోత్సహించాలి.

(సాంస్కృతిక రంగంలో కర్తవ్యాలు నుండి _ సిపిఎం)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు