మాయమై పోతున్నాడమ్మా
మాయమై పోతున్నాడమ్మా
(ఎర్ర సముద్రం )
మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు
మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
యాడ ఉన్నాడో కాని కంటికి కనరాడు
మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు
మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు
నిలువెత్తు స్వార్ధము నీడలా వస్తుంటే.
చెడిపోక ఏమైతడమ్మా.. చెడిపోక ఏమైతడమ్మా
ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు
దిగజారుతున్నడోయమ్మా..దిగజారుతున్నడోయమ్మా
అవినీతి పెనుఆశ అందకారము లోన
అమాయమై పోతున్నాడమ్మా
అవినీతిపెనుఆశ అందకారము లోన
చిక్కిపోయి రోజు శిదిలమౌతున్నాడు
మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడుమచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు
ఇనుప రెక్కల డేగ విసిరినా పంజాకు.
కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు
కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు
వుట్టికి స్వర్గాని కందకుండగ తుదకు
అస్తిపంజరమై అగుపించనున్నాడు
అస్తిపంజరమై అగుపించనున్నాడు
కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ
కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ
కనుబొమ్మ లెగిరేసి కాలగమనములోన
మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు
మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు
ఇరువై అయిదు పైసల అగరోత్తులు గాల్చి.
అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు
అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు
దైవాల పేరుతో చందాలకై దంద.
భక్తి ముసుగు తొడిగి భలే ఫోజు వెడుతాడు
భక్తి ముసుగు తొడిగి భలే ఫోజు వెడుతాడు
ముక్తి పేర నరుడు రక్తి లో రాజయ్యి.
ముక్తి పేర నరుడు రక్తి లో రాజయ్యి
రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు
మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు
మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు.
మానవత్వము ఉన్నవాడు.. మానవత్వము ఉన్నవాడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి