మధురవచనాలు


1.వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’
      అల్లసాని పెద్దన

2. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’
              చేమకూరి వేంకటకవి

3. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’
              త్యాగయ్య

4. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’
                          ధూర్జటి

5. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు......’’
                          బద్దెన

6. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’
                          వేమన

7. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’
                         కంచర్ల గోపన్న

8. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’
                        సుద్దాల హనుమంతు

9. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’
                              ఆరుద్ర

10. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’
                          వేముల శ్రీ కృష్ణ

11. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’
                    త్రిపురనేని రామస్వామి

12. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’
         - బాలాంత్రపు రజనీకాంతరావు

13. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’

                     అడవి బాపిరాజు

14. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’
                         కరుణశ్రీ

15. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’
                        గూడ అంజయ్య

16. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’
                            - అలిసెట్టి ప్రభాకర్

17. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’
                                - సావిత్రి

18. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’
                         ఖాదర్ మొహియుద్దీన్

19. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను
                         బాలగంగాధర తిలక్

20. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’
                                      అన్నమయ్య





కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు