రాయలసీమ,విమర్శకు పట్టుగొమ్మ
Pc Wikipedia
ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు కేంద్రం రాయలసీమ
ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ రాయలసీమ నుండే ప్రారంభమైంది. ఇంకొంచెం ముందుకు పోతే వేమన ,వీరబ్రహ్మం లు ఆధునిక భావాలు తెలుగు నేలకు అందించారు. ఆ తరువాత
కట్టమంచి రామలింగారెడ్డి తో ఈ ఆధునిక సాహిత్య విమర్శ ప్రారంభమైందని అందరికీ తెలిసిందే. రారా, వల్లంపాటి , త్రిపురనేని మధుసూదన రావు, సింగమనేని, రాచపాళెం, తెలకపల్లి రవి,కేతు విశ్వనాథరెడ్డి,కవిత్వవేది, మేడిపల్లి,కిన్నెర శ్రీదేవి మొదలైన వారందరూ ఈ పరంపరలో
వచ్చినవారే.
రాయలసీమలో కూడా కథాసాహిత్యం కూడా కోస్తా ప్రాంతం తో సమాంతరంగా రాయలసీమ లో వచ్చిందని వర్తమాన పరిశోధకులు తవ్వా వెంకటయ్య, అప్పిరెడ్డి హరనాధరెడ్డి ఇటీవల తమ పరిశోధనలో బయట పెట్టారు.
తెలుగు సాహిత్య చరిత్రకారులుగా ప్రసిద్ధి పొందిన కందుకూరి వీరేశలింగం, గురజాడ, శ్రీరామమూర్తి, వంగూరి సుబ్బారావు, భోగరాజు నారాయణమూర్తి వంటివారి కృషికి కాస్త సమాంతరంగానే రాయలసీమ నుండి కూడా గొప్ప సాహిత్య చరిత్రకారులు తెలుగు చారిత్రక విమర్శ రంగస్థలం మీదికి ప్రవేశించారు. అలా ప్రవేశించిన తొలి వ్యక్తి ‘కవిత్వవేది’గా ప్రసిద్ధి చెందిన కల్లూరి వేంకట నారాయణరావు ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహం’ రచించాడు. విద్వాన్, ఎంఏ వంటి ఉన్నత పరీక్షలకు దాన్ని పాఠ్యగ్రంథంగా కూడా తీసుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి