గులాబీ రేకులు


గులాబీ రేకులు

కవిత్వం రెండు సత్యాలు నేర్పింది
ఒకటి
ఎదుటి వాళ్ళను ప్రేమించమని
రెండోది
తప్పు చేసినా క్షమించమని
                           __ ఆశారాజు


సరికొత్త తరం కావాలి
సృజనకు జీవితానికి తేడా లేని
జీవితాన్ని సరికొత్తగా సృజించేతరం కావాలి
                      ___కె.శివారెడ్డి


మంచి మొగుడు, తండ్రి, కొడుకు ఉంటే చాలు అనే భావం పోయి తన పౌరసత్వం హక్కుల్ని అనుభవించాలనే భావమే స్త్రీవాదం

మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మిమ్మల్ని విభజించి పాలిస్తోంది
                             __సావిత్రి

 నెత్తుటి పిడికిలి లోంచి ఇంద్రధనస్సును ఆకాశం లోకి రువ్వితే అదే ఒక పతాకాల వనమైమన కోసం ఎదురు చూస్తుంది 
                    ___పినాకపాణి


ఆనందంతో ప్రజ్వలించే హృదయమే సౌందర్యం సౌందర్యమంటే
కనులు మూసుకున్న రూపాన్ని చూడగలగటం
       __యండమూరి వీరేంద్రనాథ్


నేను మాత్రం ఏం చెప్పగలను మరేం  రాయగలను
సామాన్యమైన విషయాలే గా ఎప్పుడు ఎవ్వరో ఎక్కడో చెప్పినవే
మనం ఇంకా చిక్కుముడులు విప్పుకుంటున్నాం
                          _ శిలాలోలిత


కళ్ళు మూస్తే చాలు ఓ క్షణం గతమై మిగులుతుంది కాలం కళ్ళు తెరిస్తే చాలు ఓ భావం అక్షరమై నిలుస్తుంది కలకాలం  
                      _వెంకటకృష్ణ

జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స జగతి దల్లికంటే సౌభాగ్య సంపద
మెచ్చుటాడుబిడ్డ మేలు కాదె
 
       శ్రీనాధుడు( క్రీడాభిరామం)

తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ  తెలుగొ కండ
ఎల్లనృపుల గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స
  _శ్రీ కృష్ణ దేవరాయలు (ఆముక్తమాల్యద)

కవి గుండెలో రగిలి గీత మయ్యే శబ్దమే
కాప్షన్ గా మారి
వ్యాపారి చేతిలో దోపిడీ సాధ్యం అవుతుంది
                 __సుంకిరెడ్డి నారాయణ రెడ్డి


అందం నన్ను మోసం చేస్తుంది నాకు తెలియకుండానే నా    పద్యం వెనుక దాక్కుంటుంది. నన్ను నా ప్రజల నుంచి 
దూరం చేస్తుంది.                              
              __  గుడిహాళం రఘునాథం


ఇంతకాలమూ కాగితాల తోనే గడిచిపోయింది
ఏం కావాలో కాగితాల మీద రాస్తూ
                   __ వేగుంట మోహన ప్రసాద్


పెట్టుబడి అన్ని రంగాలనూ ఇనుప కౌగిలిలోకి లాక్కొని బుజ్జగిస్తున్నప్పుడు సమస్త విలువలు నశించిపోతాయి                             
              __   జూకంటి జగన్నాథం


శ్రమజీవి కండరాల పైన స్వేదబిందువు ను అదృశ్యశక్తులు అపహరించే వేళ
దోపిడీని అధ్యయనం చెయ్
                         __అలిశెట్టి ప్రభాకర్


ప్రతిది సులభముగా సాధ్యపడదు  లెమ్ము
నరుడు నరుడౌట ఎంతో దుష్కరము సుమ్ము
                          ___గాలిబ్


ఇప్పుడు ఇక్కడ అందం గురించి కాదు
ఆకలి గురించిమాట్లాడుకోవాలి
అగ్గిపెట్టెలో  పట్టించేందుకు
చీర కాదు కదా ఇది ఆకాశమంత ఆకలి
              _కోసూరి రవికుమార్

నాటి ఘనతల పొగడి పొంగిపోవుట కాదు
నేటి న్యూనత తెగడి కుంగికూలుట కాదు
ఆదర్శ మార్గమే
అనుసరించటమేలు
  __డాక్టర్ ఆశావాది ప్రకాశరావు


ఒక మనిషి జీవిత కాలాన్ని నిర్వచించేది అతని భాషణే                             __ఫ్రాన్సిస్ బేకన్

విశ్వ శ్రేయస్సుకు మార్గం ఆదర్శవాదం కాదు. భౌతిక వాదాన్ని అంగీకరించి వివిధ వర్గాలుగా విభజింపబడిన ప్రజలలో పీడిత వర్గం తరపున నిలబడి వారిలో ఒక భాగమై రచయిత పోరాడ గలిగినట్లయితే విశ్వశ్రేయస్సుకు  ప్రజాభ్యుద యానికి దారి తీస్తారు.       
                    ___పుచ్చలపల్లి సుందరయ్య

సరైన పద్ధతిలో  అమర్చిన సరైన పదాలే కవిత్వం
                                  ___కొల్రిడ్జి


నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై ఉంది నా పేరు
                           __ ఖాదర్ మొహిద్దీన్


బాధల్లోంచి ఉరికే భావమే కవిత్వం
వేదనలోంచి రగిలే నాదమే కవిత్వం
                   ____ బాణాల శ్రీనివాసరావు


ఎంత రాచ మొక్కయినా సిమెంటులోన మొలవదురా 
సృష్టికి ప్రాణం పోసే మట్టికి హారతి పడతా
                                  ____ సినారె


మట్టి మనసు
ఇంకిన జలధుల ఆర్ద్రత లో భావితరం జీవనదుల్ని  వెతుకుతుంది
పల్లె మనసు
రాలిన ఆకుల కుదుళ్లలో రేపటి చివురుల్ని మొలిపించుకుంటుంది.
               ___ హనుమా రెడ్డి
























కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు