పసిడి పలుకులు



వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’
*- అల్లసాని పెద్దన*

22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’
*- చేమకూరి వేంకటకవి*

23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’
*- త్యాగయ్య*

24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’
*- ధూర్జటి*

25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు......’’
*- బద్దెన*

26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’
*- వేమన*

27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’
*- కంచర్ల గోపన్న*

28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’
*- సుద్దాల హనుమంతు*

29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’
*- ఆరుద్ర*

30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’
*- వేముల శ్రీ కృష్ణ*

31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’
*- త్రిపురనేని రామస్వామి*

32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’
*- బాలాంత్రపు రజనీకాంతరావు*

33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’
*- అడవి బాపిరాజు*

34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’
*- కరుణశ్రీ*

35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’
*- గుడ అంజయ్య*

36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’
*- అలిసెట్టి ప్రభాకర్*

37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’
*- సావిత్రి*

38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’
*- ఖాదర్ మొహియుద్దీన్*

39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను
*- బాలగంగాధర తిలక్*

40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’
*- అన్నమయ్య*

41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’
*- ఏనుగు లక్ష్మణ కవి*

42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’
*- పాలగుమ్మి విశ్వనాథం*

43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ
*- చలం*

44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’
*- విమల*

45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’
*-నండూరి సుబ్బారావు*

 ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’
*- అందెశ్రీ*

. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’
*- చెరబండరాజు*

 ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’
*- కందుకూరి రామభద్రరావు*

 నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ
*- నందిని సిధారెడ్డి*

‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’
*- మిట్టపల్లి సురేందర్*

           
               ఒకడు ఎన్ని సంవత్సరాలు జీవించాడని కాదు.ఎన్ని గ్రంథాలురాశాడని  కాదు.జీవించినకాలం,రాసినకాలం,తోటి మానవుల్ని ఏమేరకు పట్టించుకున్నాడన్నదే మానవీయ గీటురాయి
                                                         ~జ్వాలాముఖి

Poets teach in verse what they learn from suffering
                              . ... P B Shelley


                పాట నాకు ఆక్సిజన్
                పోరాటం నా ఊపిరి
                                                                                                    చెరబండరాజు

                తెలుగుదేశం లో ప్రతి రెండోవాడూ కవే
                           ~శ్రీశ్రీ


                తేనె తాకి నోరు తియ్యనయగు రీతిలా ఉండాలి కవిత్వం
                       ~  మొల్ల


                కప్పి చెప్పేది కవిత్వం. విప్పిచెప్పేది విమర్శ.
                         ~  సినారె


          పుస్తకం నిద్రించదు
          పుస్తకంమరణించదు
          విజ్ఞానం వెదజల్లి
          విశ్వదర్శనంచేయిస్తుంది
         ~అడిగోపులవెంకటరత్నం


ఉన్నది ఒకటే జీవితం. అది అశాశ్వతం.
ప్రేమతో చేసిన పనే శాశ్వతం.
                      ~  బ్రైయిన్ ట్రేసీ


            రచన అంటే వాస్తవజీవితం నుండి పలాయనం కాదు.వాస్తవ జీవితంలో కి మరింత లోతుగా చూడటమే.
           ~ముక్తవరం పార్థసారథి


వాడిన పూలూ
వికసిస్తున్నాయ్
వృద్దాశ్రమాలు!?
                     ~ లకుమ


      గ్నాపకం ఉండేది కవిత
      మరచిపోయేది చెత్త
        ~ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి


సాహిత్యం వస్తుగత ప్రపంచం మీద వ్యక్తిగత ప్రతిస్పందనల సామూహిక రూపం
                           ___మార్క్స్

వాస్తవిక జగత్తు నుండి జనించే భ్రమ కవిత్వం
                  __ క్రిష్టఫర్ కాడ్వెల్

Art easy is the essence of science . It is the human nature to enquire that creates both.
___ఎమ్.ఎన్.రాయ్

         రచయిత సాహిత్యంలో వివరించిన ఆశయాన్ని వస్తువుగా చెప్పవచ్చు.ఆవస్తువు ఏ రూపలో అభివ్యక్తం అవుతుందో ఆరూపాన్ని శిల్పం అంటారు.ప్రక్రియ, భావప్రతిమ, భాష ~ శిల్పంలో ముఖ్య అంశాలు.
         ~త్రిపురనేనిమధుసూదనరావు

           
               
Poets teach in verse what they learn from suffering
                              . ... P B Shelley

                


జ్ఞానం సైన్సుకు ,అనుభూతి సాహిత్యానికి కేంద్ర బిందువులు _____చందు సుబ్బారావు
[24/02, 1:07 PM] విజయకుమార: సాహితీ సౌరభాలు____ పిళ్లా విజయ్

మనకు తెలియని గొప్ప రహస్యాలు అత్యంత విజ్ఞానం గాను, అద్భుత సౌందర్యం గాను ఏకకాలంలో గోచరిస్తాయి. మొదటి దానికి జ్ఞానం అని, రెండవ దానికి అనుభూతి అని పిలుచుకుంటాం
                   ____ ఐన్ స్టీన్


సైన్సు తోనూ, తత్వంతోనూ కలిసి కాలు కదపని సాహిత్యం మానవ హత్యా సదృశ్యమే. ఆత్మహత్యా సదృశ్యమే.  

____బోదిలేర్( ఫ్రాన్స్)


కేవలం హక్కుల కోసం పోరాడటమే స్వార్థం ఐతే
బాధ్యతలను గుర్తించడమే సామాజిక స్పృహ
       ___తరిమెల అమరనాథ రెడ్డి

తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది
డ్రైనేజీ స్కీము లేక డేంజర్ గా మారుతోంది
___గజ్జల మల్లారెడ్డి


Live as if You were to die tomorrow.
Learne as if  You were to live forever.
___Gandhi


కుల మతాలు మలమూత్రాలు లాంటివి
మొదటిది విసర్జిస్తే దేశానికి మంచిది
రెండోది విసర్జిస్తే దేహానికి మంచిది
____అజ్ఞాత కవి


అలలపైన నిఘా
అలలు కనే కలల పైన నిఘా
___ శివ సాగర్


సాహిత్యం ఆలోచనలు రేకెత్తించేది గా ఉండాలి. సాహిత్యంలో జీవిత విశ్లేషణ ఉంటుంది .జీవితం స్పష్టం లేనిదానిని సాహిత్యం స్పష్టం చేస్తుంది
____కొడవటిగంటి కుటుంబ రావు


ప్రతి మనిషి వీలైతే ప్రతిరోజు కనీసం ఒక పాట వినాలి
లేదా ఒక కవిత చదవాలి
లేదా ఒక అందమైన చిత్రం చూడాలి____గేథె


మతం ,ధనవంతులని చంపకుండా పేద వాళ్ళని ఆపేది
___నెపోలియన్ బోనపార్టీ

చెప్పు _నేను మర్చిపోతాను
బోధించు _నేనుగుర్తుంచుకుంటాను
నన్ను దాంట్లో లీనమయ్యేలా చెయ్యి _నేను తెలుసుకుంటాను
               _బెంజమిన్ ఫ్రాంక్లిన్

ఉరితాడుకు మతం ఉండదు
                            ___గాలిబ్


రాయిని పూజిస్తే దేవుడు దొరికేటట్లయితే పర్వతాన్ని పూజిస్తాను.
దానికన్నా తిరగలి ని పూజిస్తే పిండి అయినా దొరుకుతుంది
                                __కబీర్


సాహసి కానివాడు జీవన సమరానికి స్వర్గానికి పనికిరాడు __దేవరకొండ బాల గంగాధర తిలక్


ఏ రంపం కోత లేకుండా ఎలా పుడుతుంది వేణువు?
ఏ ఉలి దెబ్బ పడకుండా ఎలా పలుకుతుంది స్థానువు?
                      ____సినారె


పురోగతి ప్రపంచ నీతి
మన దొకే మానవజాతి
వ్యక్తికి బహువచనం శక్తి
                             ___ శ్రీ శ్రీ


నేను సమున్నత కవితా శిఖరాలనుంచి
కమ్యూనిజం లోకి దూకుతాను
కమ్యూనిజం నా హృదయం
అది వినా నాకు ప్రేమ లేదు
                     __ మయకోవస్కీ


జీవితంలో ఉన్న విషాదం మరణించడం కాదు, మనం జీవించి ఉండగానే మనమే కొన్ని గుణాలను చంపుకోవడం
___నార్మన్ కజిన్స్


ప్రశ్న ఆవలింత కాదు
చిటికేసి చంపడానికి
ఆది అణువు
పగలడానికి ఎప్పుడూ సిద్ధమే
      ___ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి


మనిషంటే బతుకు కలలు
నెరవేర్చుకునే పట్టుదలలు
అందుకేరానికలలనురప్పించుకోవాలి
లేని ఊహలనుపుట్టించుకోవాలి
__ అనిశెట్టి రజిత
[02/03, 10:19 AM] విజయకుమార: సాహితీ సౌరభాలు _పిళ్లా విజయ్

ఊరకే జీవించడం కాదు ముఖ్యం
ఒక లక్ష్యం కోసం జీవించడమే ప్రతిభ
                     ___డోస్టవిస్కీ


రచయితలు సదా తమ రచనా నైపుణ్యాన్ని విధానాన్ని పద్ధతిని అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలి. నైపుణ్యం అనేది లేనిదే చివరకు చెప్పులు కూడా కొట్టలేరు కదా .
                     ___గోర్కి

నాకు తెలుసు
శ్రమించే వేళ్లు కలాలైనపుడు
కవిత్వం కదను త్రొక్కుతుందని
                   _ నందిని సిధారెడ్డి


కాలం మన ఆశల ప్రశ్నలకు జవాబు
కాలం మన ఆశయాలకు పెద్ద సవాలు
                       __ఆరుద్ర

మనిషంటే ఒంటరి కాదు
ఒక సామాజిక ఖండం
                     ___ వరవరరావు


నలుగురు కలిసిన వేళ
మనం మరొకళ్ళ లోకి  మనలోకి మరొకళ్ళు
ప్రవహించటం ఎంత బాగుంటుంది
            __ పాపినేని శివశంకర్


రచయితలు సదా తమ రచనా నైపుణ్యాన్ని విధానాన్ని పద్ధతిని అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలి. నైపుణ్యం అనేది లేనిదే చివరకు చెప్పులు కూడా కుట్టలేరు కదా .
                     ___గోర్కీ


శ్రద్ధావాన్ లభతే జ్జానం
                     ___భగవద్గీత


పేదల ఆకలి తీర్చేందుకు బీడు భూములు సమ్రుద్ధిగా పంటలనిస్తాయి.అన్యాయస్తులు వాటిని సాగు కానివ్వరు.
   ___ బైబిల్


తల్లి పాదాల కింద స్వర్గం ఉంది
                           __ఖురాన్


కవిత్వమెన్ని విధములు?
కవిత్వం రెండ్విధములు
ఒకటి ప్రజా కవిత్వము
రెండు బూర్జువా కవిత్వము
ఒకటి అర్థమయ్యే కవిత్వం
రెండు అర్థం కాని కవిత్వం
                           __సీతారాం

నెత్తుటి పిడికిలి లోంచి
ఇంద్రధనుస్సు ను ఆకాశం లోకి రువ్వితే
అదే ఒక పతాకాల వనమై
మన కోసం ఎదురు చూస్తుంది.
                         __పినాకపాణి


కవిత్వం రెండు సత్యాలు నేర్పింది
ఒకటి
ఎదుటి వాళ్ళను ప్రేమించమని
రెండోది
తప్పు చేసినా క్షమించమని
                           __ ఆశారాజు


సరికొత్త తరం కావాలి
సృజనకు జీవితానికి తేడా లేని
జీవితాన్ని సరికొత్తగా సృజించేతరం కావాలి
                      ___కె.శివారెడ్డి


మంచి మొగుడు, తండ్రి, కొడుకు ఉంటే చాలు అనే భావం పోయి తన పౌరసత్వం హక్కుల్ని అనుభవించాలనే భావమే స్త్రీవాదం

మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మిమ్మల్ని విభజించి పాలిస్తోంది
                             __సావిత్రి

 నెత్తుటి పిడికిలి లోంచి ఇంద్రధనస్సును ఆకాశం లోకి రువ్వితే అదే ఒక పతాకాల వనమైమన కోసం ఎదురు చూస్తుంది 
                    ___పినాకపాణి


ఆనందంతో ప్రజ్వలించే హృదయమే సౌందర్యం సౌందర్యమంటే
కనులు మూసుకున్న రూపాన్ని చూడగలగటం
       __యండమూరి వీరేంద్రనాథ్


నేను మాత్రం ఏం చెప్పగలను మరేం  రాయగలను
సామాన్యమైన విషయాలే గా ఎప్పుడు ఎవ్వరో ఎక్కడో చెప్పినవే
మనం ఇంకా చిక్కుముడులు విప్పుకుంటున్నాం
                          _ శిలాలోలిత


కళ్ళు మూస్తే చాలు ఓ క్షణం గతమై మిగులుతుంది కాలం కళ్ళు తెరిస్తే చాలు ఓ భావం అక్షరమై నిలుస్తుంది కలకాలం  
                      _వెంకటకృష్ణ

జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స జగతి దల్లికంటే సౌభాగ్య సంపద
మెచ్చుటాడుబిడ్డ మేలు కాదె
 
       శ్రీనాధుడు( క్రీడాభిరామం)

తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ  తెలుగొ కండ
ఎల్లనృపుల గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స
  _శ్రీ కృష్ణ దేవరాయలు (ఆముక్తమాల్యద)

కవి గుండెలో రగిలి గీత మయ్యే శబ్దమే
కాప్షన్ గా మారి
వ్యాపారి చేతిలో దోపిడీ సాధ్యం అవుతుంది
__సుంకిరెడ్డి నారాయణ రెడ్డి


అందం నన్ను మోసం చేస్తుంది నాకు తెలియకుండానే నా    పద్యం వెనుక దాక్కుంటుంది. నన్ను నా ప్రజల నుంచి దూరం చేస్తుంది.                              __  గుడిహాళం రఘునాథం


ఇంతకాలమూ కాగితాల తోనే గడిచిపోయింది
ఏం కావాలో కాగితాల మీద రాస్తూ
     __ వేగుంట మోహన ప్రసాద్


పెట్టుబడి అన్ని రంగాలనూ ఇనుప కౌగిలిలోకి లాక్కొని బుజ్జగిస్తున్నప్పుడు సమస్త విలువలు నశించిపోతాయి                              __   జూకంటి జగన్నాథం


శ్రమజీవి కండరాల పైన స్వేదబిందువు ను అదృశ్యశక్తులు అపహరించే వేళ
దోపిడీని అధ్యయనం చేయ్
   __అలిశెట్టి ప్రభాకర్


ప్రతిది సులభముగా సాధ్యపడదు  లెమ్ము
నరుడు నరుడౌట ఎంతో దుష్కరము సుమ్ము
                          ___గాలిబ్


ఇప్పుడు ఇక్కడ అందం గురించి కాదు
ఆకలి గురించిమాట్లాడుకోవాలి
అగ్గిపెట్టెలో  పట్టించేందుకు
చీర కాదు కదా ఇది ఆకాశమంత ఆకలి
              _కోసూరి రవికుమార్

నాటి ఘనతల పొగడి పొంగిపోవుట కాదు
నేటి న్యూనత తెగడి కుంగికూలుట కాదు
ఆదర్శ మార్గమే
అనుసరించటమేలు
  __డాక్టర్ ఆశావాది ప్రకాశరావు


ఒక మనిషి జీవిత కాలాన్ని నిర్వచించేది అతని భాషణే                             __ఫ్రాన్సిస్ బేకన్

విశ్వ శ్రేయస్సుకు మార్గం ఆదర్శవాదం కాదు. భౌతిక వాదాన్ని అంగీకరించి వివిధ వర్గాలుగా విభజింపబడిన ప్రజలలో పీడిత వర్గం తరపున నిలబడి వారిలో ఒక భాగమై రచయిత పోరాడ గలిగినట్లయితే విశ్వశ్రేయస్సుకు  ప్రజాభ్యుద యానికి దారి తీస్తారు.   _      ___పుచ్చలపల్లి సుందరయ్య

సరైన పద్ధతిలో  అమర్చిన సరైన పదాలే కవిత్వం
                          ___కొల్రిడ్జి


నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై ఉంది నా పేరు
              __ ఖాదర్ మొహిద్దీన్


బాధల్లోంచి ఉరికే భావమే కవిత్వం
వేదనలోంచి రగిలే నాదమే కవిత్వం
     ____ బాణాల శ్రీనివాసరావు


ఎంత రాచ మొక్కయినా సిమెంటులోన మొలవదురా సృష్టికి ప్రాణం పోసే మట్టికి హారతి పడతా
                          ____ సినారె


మట్టి మనసు
ఇంకిన జలధుల ఆర్ద్రత లో భావితరం జీవనదుల్ని  వెతుకుతుంది
పల్లె మనసు
రాలిన ఆకుల కుదుళ్లలో రేపటి చివురుల్ని మొలిపించుకుంటుంది.
               ___ హనుమా రెడ్డి


ఎక్కడ హృదయం భయ రహితమో
ఎక్కడ శిరస్సు  ఉన్నతోన్నతమో
ఎక్కడ విజ్ఞానం సర్వ స్వతంత్రమో
ఎక్కడ ప్రపంచం సంకుచితం కాదో
ఎక్కడ నిర్మల హేతుభావం ప్రవహిస్తుందో
ఎక్కడ మేధస్సు ఆచరణాత్మకం అవుతుందో
ఆ స్వేచ్ఛా స్వాతంత్ర స్వర్గసీమ లోకి
ఈ దేశం పయనించాలి 
        
  ___ రవీంద్రనాథ్ ఠాగూర్


కథా రచయిత నేటి ప్రపంచీకరణ యుగంలో  మనుషుల బూటకపుతనాన్ని హిపోక్రసీని బయట పెట్టడం అవసరం .వర్గ సమాజం లోని వైరుధ్యాన్ని చిత్రీకరించడం అవసరం .ప్రతి కళాకారునికి రచయితకు ఆర్తి ఉండాలి .ఆర్ట్ ఉండాలి .అంటే కళా దృష్టి ఉండాలి అని అర్థం._
                ___  తెలకపల్లి రవి

కల్ కామ్ ఆజ్ కరో
ఆజ్ కామ్ అభి కరో
                       ___కబీర్

ముఖం మీద ప్రతిఫలించే నవ్వు ఆరోగ్యకర సూచకం. 
నీ మనసుకు, 
చూసే 
మనసులకూ హాయినిస్తుంది. 
జీవితంలో
నవ్వును ఎప్పటికీ కోల్పోకు. 
నవ్వుతూ నవ్విస్తూ ఉండు. 

మనసు నిర్మలంగా ఉంటే రాయాలన్న సంకల్పం ఏర్పడుతుంది.  రచన అన్నది స్థానికమైంది.స్థలం, వ్యక్తి దానికి ఆధారాలు 
       _రాబర్ట్ క్రీలె(1926)

కవిత్వం రాసే కవికి కవిత్వం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడే సమగ్రతకు అవకాశం ఉంటుంది. అట్లాగే రాజకీయ నాయకుడికి తన నియోజక వర్గం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడే సమగ్ర కార్యాచరణకు అవకాశం ఉంటుంది. ప్రతీకలు ఉపయోగించడానికి, నిరంతరం గా  ప్రవహించడానికి మనోనేత్రంద్వారామనం మార్గం ఏర్పరిస్తున్నా మన్నమాట.
   ‌‌ __రాబర్ట్ బ్లై(1926)


కవిత్వం ఎంత తాజాగా ఉంటుందంటే అది మంచు బిందువంత తాజాగా ఉంటుంది. ఒక పాలరాతి శిల్పం కనుబొమపై పడిన మంచు బిందువంత తాజాగా ఉంటుంది. అది గతాన్ని వర్తమానాన్ని ఒకే దగ్గరకు తీసుకు వస్తుంది. గతం శిల్పమైతే వర్తమానం మాత్రం మంచు బిందువు లాంటిది లేదా వర్షపు చినుకు లాంటిది.
   __derek walcott(1930)


కవిత్వ సంగీతం లో మౌలికంగా రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి పదాలు రెండోది లయ. అవి అనివార్యంగా సంప్రదాయం నుంచి మనం గ్రహించాలి.లేత యవ్వనదశలో వర్డ్స్ వర్త్ ,ఈట్స్
 కవితలు ఆకట్టుకుంటాయని పరిణత దశలో  ఇలియట్ ఆకర్షిస్తాడని మనకు అర్థం అవుతుంది.
  __ సీమస్ హీనె(1934)

మనం ఎదురు తిరగాలి. మనల్ని అదృశ్యం చేయాలనుకునే వాళ్ళని ఎదుర్కోవాలి. దేశం నుండి బహిష్కరింపబడినా బతికి ఉండటమన్నది తప్పనిసరి అవసరం.. ఆధునిక జీవితం మనల్ని భౌతికంగా మానసికంగా రాజకీయంగా 
మాయం చేయాలని కుట్ర పన్నుతుంది 
     __మార్గరెట్ అట్ వుడ్(1939)
రచయితలు వివేకవంతులైతే జాతీయ,సంప్రదాయ సరిహద్దుల్లోనే నిలిచి, సంతృప్తి పడిపోయి ఉండరాదు. కాల స్పృహ లేని కవిత్వం వ్యర్థం. తన చుట్టూ ఉన్న, తను చూసిన, తన అనుభవంలో లోనిది ఆవిష్కరించినపుడే కవిత చలనంతో,చైతన్యంతో ఉంటుంది.
      _ఇవాన్ బోలాండ్(1944)

ఇక్కడ ఈ ఆత్మ విశ్రాంతి కోరడం లేదు 
ఇక్కడ ఏ మనిషి ఆకలితో       బాధపడకూడదు 
మా లక్ష్యం అదే 
 మనిషి మనిషిలాగా బతకాలని నేను కోరుకుంటాను 
_స్టీఫెన్ స్పెండర్_(1905_ 1995)


రచయితకు  సంపూర్ణంగా తెలిసిన జ్ఞానమనే వెలుగు లో ప్రతిపదం రాయాలి.   వాటి పరిమితులను కచ్చితంగా రచయిత తెలుసుకోవాలి.  తనకు తెలిసిన దానికి తెలుసుకునే దానికి ఉన్న సంబంధాన్ని తేడాను గ్రహించాలి.
_మార్గరెట్  అవిసన్_ ( 1918)


రచయితకు  సంపూర్ణంగా తెలిసిన జ్ఞానమనే వెలుగు లో ప్రతిపదం రాయాలి.   వాటి పరిమితులను కచ్చితంగా రచయిత తెలుసుకోవాలి.  తనకు తెలిసిన దానికి తెలుసుకునే దానికి ఉన్న సంబంధాన్ని తేడాను గ్రహించాలి.
_మార్గరెట్  అవిసన్( 1918)


చర్చీలన్నీ నిరుపయోగంగా మిగిలిపోతే,కూలిపోతే మనమేం చేస్తాం 
కొన్ని చారిత్రక శిథిలాలుగా ప్రదర్శనకు పెడతాం 
వర్షం వచ్చినప్పుడు గొర్రెలు వరండాలో ఉంటాయి 
వాటిని మనం నిర్దయగా అక్కడినుండి తరిమెయ్యలేం కదా
   _ఫిలిప్ లార్కిన్(1922_1985)


అమెరికా! నీకు అంతా ఇచ్చాను
నా దగ్గర ఏమీ లేదు
నేను శూన్యంగా మిగిలాను
 నీ యంత్రాలు మరీ నా అవసరాలకు మించి ఉన్నాయి నిన్ను చూస్తే అన్ని వదిలేసి సన్యాసం తీసుకోవాలనిపిస్తుంది .
నా అంతులేని ఆలోచనల్ని
 నీ ముందు పెట్టడానికొప్పుకోను 
అమెరికా! నీ వసంతం ఉపసంహరిస్తోంది
   _అలిన్ గిన్స్ బర్గ్_ ( 1926)


ఓటమిని హృదయపూర్వకంగా ఆహ్వానించాలి అంగీకరించాలి 

బాధను మనస్ఫూర్తిగా స్వాగతించాలి 
అప్పుడు దుఃఖం వస్తుంది దుఃఖం లొంగిపోతుంది 

జీవితం కంటే ఏది గొప్పది కాదని
అన్యాయాన్ని దుర్మార్గాన్ని ఎదుర్కొనే జీవితం అన్యాయాలపై చేసే పోరాటం  
  అన్నిటి కన్నా ఉన్నతమైనవని నమ్ముతాను 

_డబ్ల్యూ హెచ్ ఆడెన్ (1907 _1973)

ఇతరులతో ఇతరుల రచనల తో 
సంబంధం లేకుండా తను పని చేస్తానని  చెప్పుకునే రచయిత గాడిదయినా కావాలి లేదా అబద్ధాలు చెప్పే దగాకోరైనాకావాలి.
_థియోడర్ రోత్కే (1908 _1963)


నేను నిద్ర పోవడానికి మేలుకున్నాను
మెల్లగా నడవడం మొదలుపెట్టాను 
నడుస్తూ నడుస్తూ నేను ఎక్కడికి వెళ్లాలో తెలుసుకున్నాను
  _థియోడర్  రోత్కే  (1908_1963)



నీ జీవితంలో వెలుగు రావాలంటే వెలుగు వచ్చేచోట నువ్వు వుండాలి. లేదంటే... నువ్వే వెలుగును సృష్టించాలి.


ఎక్కడ మానవునికి స్వేచ్ఛ లుప్తమవుతుందో అక్కడ నేను ప్రత్యక్షం అవుతాను. ప్రపంచమే నాఇల్లు .విప్లవం నా పేరు .
                 ____థామస్ పేన్(1737_1806)

ప్రజల కన్నా అధికమైన తెలివితేటలు ఉన్నవారే ప్రతినిధులుగా ఉండాలి. వివిధ విషయాలపై అభిప్రాయాలు చెప్పే శక్తి ఉండాలి. ఆసక్తి ఉన్న వాళ్లనే ప్రతినిధులుగా ఎన్నుకోవాలి .సామాన్య ప్రజలకు అన్ని విషయాలు వెలిబుచ్చే శక్తి ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం ఎదుటి వారి భావాలకు  కూడా విలువ  ఇవ్వడం .వీరిద్దరి మధ్య సమన్వయానికి సర్దుబాటుకు ప్రయత్నించడం
జాన్ స్టువర్ట్ మిల్ ( ది రిప్రజెంటేటివ్ గవర్నమెంట్_1806_73)

ఈ ప్రపంచంలో నూటికి నూరుపాళ్లు ఎవరిని ఇష్టపడలేము. నచ్చిన విషయాన్ని పంచుకుంటూ, నచ్చని విషయాన్ని తెంచుకుంటూ ..ముందుకు పోవాల్సిందే



Wisdom comes to us when it can no longer do any good.

అంతా అయి, చేతులు కాలి, ఇంక మనకు అదేమీ లాభపడని దశలో జ్ఞానబోధ అవుతుంది.

---- Gabriel Garcia Marquez, Colombian novelist.

అదృష్టం సంసిద్దంగా ఉన్న మనస్సునే వరిస్తుంది. అన్ని సుగుణాలకు పట్టుదలే పట్టుకొమ్మ.

విజయం సాధించాలంటే ఏకైక మార్గం చేసేపనిని ప్రేమించడమే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు