సాహితీ మందారాలు
"మందార మకరంద మాధుర్యమునఁ దేలు;
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు;
రాయంచ సనునె తరంగిణులకు?"
___ పోతన
‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’
- ఏనుగు లక్ష్మణ కవి
‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’
పాలగుమ్మి విశ్వనాథం
‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ"
- చలం
‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’
- విమల
‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’
నండూరి సుబ్బారావు
‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’
అందెశ్రీ
. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’
- చెరబండరాజు
‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’
- కందుకూరి రామభద్రరావు
నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ
నందిని సిధారెడ్డి
‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’
- మిట్టపల్లి సురేందర్
ఎంత చక్కటి సాహితీ మందారాలు.
రిప్లయితొలగించండిఈ అర్ధవంతమైన వాక్యాల మందార మాలను కొనసాగించండి.అభినందనలు.