అంతర్జాతీయ గీతం.


అంతర్జాతీయ గీతం.

ఆకలి మంటలు మల మలలాడే అనాథలందరు లేవండోయ్. 
 హింసాగతిని సహించ లేక ఈసడించినది ఎల్ల ధర్మము 
మంచి దినాలు మనకందరకూ రానున్నాయ్ లేవండోయ్



కొంపలు తీసేసాంప్రదాయములు సంకెళ్ళను త్రుంచి వేయగా, 
దాసత్వంబును తరిమి వేయగా దాసులందరును లేవండోయ్

 నేలకు పనులకు విధులకు గనులకు నేతలందరినీ చూడండి 
వారి భోగము వారల దర్బా
వారి యోగ ము వారల దర్పం 
మన రెక్కల కష్టం బేకాదా


ఈగతి మన కష్టార్జితమంతా ఎవరో కొందరి 
భోగ తృప్తికై 
ఇనుప పెట్టెలో మూలుగు చున్నవి.
అందర మొకటై ఎదిరించి న్యాయంగా మన కొచ్చే దంతా రాబట్టానికి రారండోయ్.

అబ్బబ్బా మన రక్త మాంస ములు హరించి ఎందరు తెగబలిసారో
 ప్రజల అశాంతికి కారణ మౌ రక్త పిపాసుల 
పీడవదిలితే దేశమంతటను శాంతి తేజమే 
దిక్కు దిక్కులా ఆనందమే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు