ఆనాటి సాంఘిక దురాచారాలపై వెంగమాంబ తిరుగుబాటు
                        ____శిలాలోలిత

ఈమె రాయలసీమ కవయిత్రి. తాళ్ళపాక తిమ్మక్కతో రాయలసీమలో మొట్టమొదటిగా ప్రారంభమైన భక్తి కవిత, శతాబ్దాలు గడిచేక తరిగొండ వెంగమాంబతో ముగియటం గమనించ వలసిన అంశం. వెంగమాంబ తరువాత చాలాకాలం వరకు కవయిత్రుల రచనలు కనిపించవు. చాలా తక్కువగా అక్కడక్కడా ఒకళ్ళిద్దరు రాసిన రచనలు మాత్రం ఉన్నాయి.

వెంగమాంబ మొత్తం 17 గ్రంథాలను రచించింది. ఆ రోజుల్లో స్త్రీలు అంత ఎక్కువగా రాసిన వారు చాలా అరుదు. నరసింహ శతకము, నరసింహ విలాసకథ, శివ నాటకం, పారజాతాపహరణ సత్కృతి, రాజయోగసారం, కృష్ణనాటకం రమాపరిణయమను పెండ్లి పాట, చెంచునాటకమనునొక కథ, కృష్ణమంజరి - ద్విపద, శ్రీ రుక్మిణీ నాటకం, గోపికా నాటకం, భాగవతం, వెంకటాచల మహాత్మ్యం, ముక్తి కాంతావిలాసం (యక్షగానం) మొదలైనవి. కానీ వీటిలో రాజయోగసారం, వెంకటాచల మహాత్మ్యం, భాగవతము మాత్రమే లభ్యమైనవి. భక్త్యావేశంతో రచించిన ఈమె తీరు పోతనను, మొల్లను స్ఫురణకు తెస్తుంది. తెలుగు 'మీరా'గా కూడా పేర్కొనవచ్చు. దేవుడినే పతిగా భావించి, నలుగు పాటలు, సింగారింపు పాటలు, బువ్వంబంతిపాటలు, అలక తీర్చుపాటలు ఆరగింపు పాటలు, నిదురబుచ్చుపాటలు, హారతిపాటలవంటివెన్నో రచించింది. 'బ్రౌన్' నిఘంటువు పీఠికలో ఈమె క్రీ.శ.1840సం.లలో జీవించి ఉన్నట్లు రాశారు.

'వెంకటాచలమహాత్మ్యం అనే ప్రబంధంలోని 'అలకాశి నుండి వెలువడి'... పద్యమును బట్టి చూడగా ఈమె నందవరీక బ్రాహ్మణ స్త్రీ అని తెలుస్తున్నది. ఈమె భర్త నామగోత్రాలు చెప్పుకోక, తండ్రి గోత్రాన్ని చెబుతూ కృష్ణయామాత్యుని కూతురిని అని వివరించింది. ఈమె బాల వితంతువు. వేదాంత గ్రంథ పఠనం ఆధ్యాత్మిక జ్ఞాన చింతన ఎక్కువ. కవిత్వంలో అక్కడక్కడా భాషా దోషాలున్నా మొత్తమ్మీద మృదుమధురమైన రచనగానే చెప్పొచ్చు. ఈమె కాలంలో శతక రచన చేసిన వారిలో ' మదిన సుభద్రయ్యమ్మ' అగ్రగణ్యురాలు.

'రాజయోగసారం' వేదాంతగ్రంథం. ఈమె కవనం సరళమై మధురమై సర్వజనగ్రాహ్యమై యుండేది. కపిలునకు దేవహుతికి జరిగిన తాత్విక సంభాషణము వస్తువుగాగల ప్రాథమిక రచన.

'శివవిలాసం' అను ద్విపద శతాకాన్ని రచించింది. 'కృష్ణ' అనేది ద్విపద శతకమకుటం. ఇందులో 137 ద్విపదలున్నాయి. 'తరిగొండ' కడప జిల్లాలోని

శిలాలోలిత. ప్రముఖ కవయిత్రి. హైద్రాబాద్లో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నారు.

వాయల్పాడుకు నాలుగు కిలోమీటర్ల దూరమున్న గ్రామం. ఆ ఊరుని బట్టే ఆమెకు ఈ పేరు ఏర్పడి ఉండొచ్చును. ఈమె తన గ్రంధాలను తరిగొండలోని నృసింహస్వామికంకితం చేసినట్లుగా వీరేశలింగం పంతులుగారు ఆంధ్రకవుల చరిత్రలో' రాశారు.

ఈమె తల్లిదండ్రుల పేర్లు మంగమాంబ, కానాలి కృష్ణాచార్యులు.

భాగవతము చాలా రోజులవరకు అందుబాటులో లేకపోతే శ్రీ కేసరిగారు సంపాదించి 1931లో గృహలక్ష్మి సంచికలో ప్రచురించారు.

వెంకటాచలమహాత్మ్యం ఆరు ఆశ్వాసముల కావ్యం.

ఈమె జీవిత చరిత్రను చూస్తే, లేక లేక పుట్టిన గారాల బిడ్డ ఈమె. చిన్న వయస్సులోనే సకల విద్యా పారంగతు రాలైంది. చిన్నప్పటి నుంచి, జీవితంపట్ల, జీవనవిధానం పట్ల, కౌటుంబిక చట్రం పట్ల విశ్లేషణాత్మక చర్చలు జరిపేది. భగవంతుడున్నాడా లేడా అనే విమర్శతోపాటు భగవధ్యాన మెక్కువగా చేసేది. మామూలు స్త్రీలాగా కాకుండా ఈమెలోని ఈ జిజ్ఞాసను తెలివితేటలను ఆ ప్రశ్నించే వైఖరిని, నిర్భీతిని భరించలేని

తండ్రి ఈమె మూతి మీద వాతలు పెట్టి, గాయపరిచిన సంఘటనలే అనేకం. ప్రశ్ననేరమైనచోట, ఆలోచన శాసించిన చోట, ఆచరణ మొలకెత్తుతుంది నడానికి వెంగమాంబ జీవితం కూడా ఒక నిదర్శనమే. పెళ్ళి చేస్తే తిక్క కుదురు తుందని భావించిన తండ్రి, పెండ్లి చేశాడు ఆ చిన్న వయస్సులోనే. అత్యంత అర్భకుడు, మూర్ఖుడు అయిన భర్త, అనారోగ్యంతో మరణించాడు.

ఊరివారందరి దృష్టి ఈమెపై పడింది. మానసికంగా చాలా దురాచారాలను ఈమె తీవ్రంగా ఖండించింది. వితంతువుల ' శిరోజ ఖండన'ను తప్పనిసరిగా చేయించు కోవాలనే ఆచారాన్ని అంగీకరించలేదు.. హేతుబద్ధమైన చర్చలు చేసి శంకరాచార్యుల వంటి పీఠాధిపతులను సైతం ఒప్పించిన పట్టుదలగల వ్యక్తి. తాను నమ్మిన సిద్ధాంతాన్ని మనసావాచా నమ్మి నడిచే స్త్రీగా వెంగమాంబ కనిపిస్తుంది. ప్రాపంచిక విషయాల పట్ల ఒక విధమైన నిర్లిప్త భావాలుండి, ఆధ్యాత్మిక చింతనతో, అన్వేషణతో భగవంతుని కీర్తిస్తూ, ప్రశ్నిస్తూ ప్రశంసిస్తూ ఈమె రచనా విధానం హింసించారు. ఆనాటి సాంఘిక

కొనసాగింది. ఉన్నత విద్యలేనందువల్ల, భాషాపాండిత్య దోషాలెక్కువగా ఉన్నాయని విమర్శకుల అభిప్రాయం. భావాలు ఎలా ప్రతిబింబించాయో చూడకుండా, భావగజలను పరిగణించ కుండా భాషాదోషాలను మాత్రమే పేర్కొన్నారు. భావంలో స్పష్టత. గాంభీర్యం, లోతైన ఆలోచన ఉన్నాయి. రచనల సంఖ్యలో కూడా ఆనాటి ఇతర కవయిత్రులను అధిగమించింది.

స్త్రీగా, బాలవితంతువుగా అనేక అగచాట్లకు ఎదురు నిలిచి, అభిమాన వతియై, ఆత్మగౌరవ పోరాటం సాగిస్తూ, గ్రామస్థుల తిరస్కృతిని ఎదిరిస్తూ, ఏకాంత వాసియై రచనలనేకం చేసిన ఘనత ఆమెది.*

ఆధార గ్రంధాలు:.

1. కె. జె. కృష్ణమూర్తి - తరిగొండ వెంగమాంబ కృతులు సవిమర్శక పరిశీలన (పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంధం)

2. వీరేశలింగం - ఆంధ్రకవుల చరిత్ర

3. ఊటుకూరి లక్ష్మీకాన్తం ఆంధ్రకవయిత్రులు

4. బులుసు వేంకట రమణయ్య ఆంధ్ర కవి సప్త శతి

5. ఆరుద్ర - సమగ్రంధ సాహిత్యం.

• భూమిక, జనవరి ఫిబ్రవరి 2002


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు