vemana

ఒక సూర్యబింబం
ఒక దీపస్తంభం
ఒక జ్ఞాన సంద్రం
ఒక ధైర్య శిఖరం
వేమన్న పద్యం వేనోళ్ల గానం
వేమన్న పద్యం వేనోళ్ల గానం
ప్రజలకే పట్టం
ప్రగతికే చుట్టం
ప్రశ్నించు తత్వం
ప్రతిఘటన మార్గం
విశ్వదాభిరామ వినురవేమ
విశ్వదాభిరామా వినురవేమా

వేమన మన వేమన
ఘన వేమన వినవేమన
ఒకే ఒక్క వేమన
వేగుచుక్క లెక్కన

చీకట్లను దునుమాడిన అగ్నికణం వేమన చాందసాల చీకట్లను పెకిలించిన వేమన

||వేమన॥

తెలుగు జనం అమర స్వరం  వేమన
కాలాలే దాటేసిన జ్ఞానకాంతి వేమన

||వేమన॥

సాటిలేని వేమన సత్య కాంతి వేమన
మహాగళం వేమన భావి స్వరం వేమన

||వేమన॥

ఎంత ధైర్యశాలివో ఇంత తిరగబడ్డావు
ఎంత ఆత్మస్థయిర్యమో ఎవరికీ లొంగనన్నావు

||వేమన॥


ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమవీధి
మూగ చింతల పల్లె మొదటి ఇల్లు
ఎడ్డె రెడ్డికుల మదేమని తెల్పుదు

ప్రజల నాల్కలలో వేనోళ్ల గానంగా నిలిచిన వేమన పద్యం ఇప్పటికీ నిలిచి ఉంది. సమాజాన్ని శాసించి ఊగించి ఖండించిన వేమన పద్యం ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటుంది. వేమన అందరివాడు. ఆయన ప్రజా కవి. అందుకే గుర్రం జాషువా అంటాడు కదా

రాజు మరణించె నొకతార రాలిపోయె
కవియు మరణించె నొకతార గగనమెక్కె
రాజు జీవించు రాతి విగ్రహములందు
సుకవి జీవించు ప్రజల నాలుకల యందు
                     ___జాషువా


ఆటవెలదిని ఈటెగావిసిరిన దిట్ట
ఛాందసభావాలకు తొలి అడ్డుకట్ట

కులము గలుగువాడు గోత్రంబు గలవాడు
విద్య చేత విర్రవీగువాఁడు
పసిడిగల్గువాని బానిస కొడుకులు
విశ్వదాభిరామ! వినుర వేమ!

నాది గొప్ప కులమని,నాది మంచి గోత్రమని, నేను గొప్ప విద్యావంతుడినని గర్వించువాడు వీరు ముగ్గురూ సంపద గలవాని దగ్గర బానిసకొడుకులుగా ఉంటారని భావం.

గుణం లేని వాడు కులం గొడుగు పడతాడు.  మానవత్వం లేని వాడు మతం ముసుగు వేస్తాడు.
పసలేని లేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు. జనులంతా ఒక కుటుంబం. జగమంత ఒక  నిలయం.
___గుర్రం జాషువా

కులమతాలు  గీచుకున్న గీతలను జొచ్చి
పంజరాన కట్టువడను నేను
నఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు
తిరుగులేదు విశ్వనరుడను నేను

       -  గుర్రం జాషువా

నా దేవుడు గొప్ప నీ దేవుడు దిబ్బ అంటూ ఒక మతం వారిని ఇంకో మతం వారు నిందిస్తూ ఉంటారు. వేమన ఉన్న కాలంలో శైవులు వైష్ణవులు ఘర్షణ పడేవారు. ఇప్పుడు ముస్లింలు క్రైస్తవులు హిందువులు నామతం కట్టే గొప్పదని నీ మతం కంటే చిన్నదని చెప్పుకుంటూ కొంతమంది విద్వేష భావజాలన్ని పెంచిపోషిస్తున్నారు. అలా కాకుండా ఆయన ఏమంటాడంటే

1.కుండ కుంభమన్న, కొండ పర్వతమన్న
ఉప్పు లవణమన్న నొకటి గాదె!
భాష లింతె వేరు పరతత్వ మొక్కటే
విశ్వదాభిరామ వినుర వేమ.

2.పసుల వన్నె వేరు పాలేక వర్ణమౌ
పుష్పజాతి వేరు పూలు ఒకటే
దర్శనములు వేరు దైవంబు ఒక్కటే
విశ్వదాభిరామ వినుర వేమ”


3.భూమి నాది యన్న భూమి ఫక్కున నవ్వు
దానహీను జూచి ధనము నవ్వు
కదనభీతుజూచి కాలుండు నవ్వురా
విశ్వదాభిరామ వినుర వేమ.

4.భూమి లోన బుట్టు భూసారమెల్లను
తనువు లోన బుట్టు తత్త్వమెల్ల
శ్రమము లోన బుట్టు సర్వంబు తానౌను
విశ్వదాభిరామ వినుర వేమ.

5.కోపమునను ఘనత కొంచమైపోవును
కోపమును మిగులఁగోడు గలుగుఁ
కోపమణచెనేని కోర్కెలునీడేరు
విశ్వదాభిరామ వినుర వేమ

6.చంపదగిన యట్టి శత్రువు తన చేత
చిక్కెనేని కీడుసేయరాదు
పొసగ పొమ్మనుటే చావు
విశ్వదాభిరామ వినుర వేమ

7.ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు
కాచి అతుకనేర్చు కమ్మరీడు;
మనసు విఱిగెనేని మరి యంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ

8.పట్టుపట్టరాదు పట్టివిడువరాదు
పట్టినేని బిగియ పట్టవలయు
పట్టు విడుచుట కన్న పనిచేయుటే మేలు
విశ్వదాభిరామ వినుర వేమ


9.ఆత్మశుద్ధిలేని యాచారమదియేల
భాండశుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా?
విశ్వదాభిరామ వినుర వేమ

10. రాతిబొమ్మల కేల రంగైన వలువలు
గుళ్ళు గోపురాలు కుంభములను
కూడు గుడ్డ తాను కోరునా దేవుడు
విశ్వదాభిరామ వినుర వేమ.

11. తోలు కడుపులోన దొడ్డవాడుండగ
రాతి గుళ్ళలోన రాశిబోయ
రాళ్ళు దేవుడైన రాసులు మ్రింగవా
విశ్వదాభిరామ వినుర వేమ.

కనక మృగము భువిని కద్దు లేదన లేక
తరుణి విడిచిపోయె దాశరథియు
తెలివిలేని వాడు దేవుడెట్లాయరా

పాల సాగరమున పవ్వళించిన స్వామి
గొల్లయిండ్ల పాలు గోరనేల?
ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపి

ఉప్పులేని కూర యొప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలము లేదు
అప్పులేని వాడె అధిక సంపన్నుడు


పుత్తడి గలవాని పుండు బాధయు గూడ వసుధలోన జాల వార్తకెక్కు
పేదవాని యింట పెండ్లైన ఎరుగరు

చాకికోకలుదికి చీకాకు పడజేసి
మైల దీసి లెస్స ముడుపు జేయు
బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా'



అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను
కంచుమోగినట్లు కనకంబు మోగునా’

అల్ప బుద్ధి వాని కధికారమిచ్చిన
దొడ్డ వారినెల్ల తొలగగొట్టు
చెప్పుదినెడు కుక్క చెఱకు తీపెరుగునా


స్తుతమతి యైన యాంధ్ర కవి
ధూర్జటి పల్కుల కేల కల్గెనీ
యతులిత మాధురీ మహిమ ?

హా తెలిసెన్ భువనైక మోహనోద్దత
సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి
సంతత మధురాధరోదత సుధా రస ధారల గ్రోలుటంజుమీ





అనువుగాని చోట అధికుల మనరాదు,
కొంచెముండుటెల్ల కొదువ కాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా?
!!విశ్వ!!

చాకి కోకలుతికి చీకాకు బడజేసి,
మైల తీసి లెస్స మడచినట్లు,
బుద్ది జెప్పువాడు గుద్దితే నేమయ
విశ్వదాభిరామ! వినురవేమ !

అనగనగా రాగమతి శయిల్లుచు నుండు  
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ

చంపదగిన యట్టి శత్రువు తనచేత
జిక్కె నేని కీడు - సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు



రాతిబొమ్మల కేల రంగైన వలువలు
గుళ్ళు గోపురాలు కుంభములను
కూడు గుడ్డ తాను కోరునా దేవుడు
విశ్వదాభిరామ వినుర వేమ.

తోలు కడుపులోన దొడ్డవాడుండగ
రాతి గుళ్ళలోన రాశిబోయ
రాళ్ళు దేవుడైన రాసులు మ్రింగునా "
విశ్వదాభిరామ వినుర వేమ.

పిండములను జేసి పితరులు దలపోసి
కాకులకును పెట్టుగాడ్దెలారా
పియ్యిదినెడుకాకి పితరుడెట్లాయరా
విశ్వదాభిరామ వినురవేమ

కనక మృగము భువిని గద్దు లేదనకయె
తరుణి విడిచి చనియె దాశరధి యు
దెలివిలేనివాడు దేవుడెట్లాయారా?
విశ్వధాభిరామ! వినురవేమ!


పాలకడలిపైన పవ్వళించినవాడు
గొల్ల ఇండ్ల పాలు కోరనేల?
ఎదుటివారి సొమ్ము ఎల్ల వారికి తీపి
విశ్వదాభిరామ వినురవేమ.


విప్రులెల్ల జేరి వెర్రి కూతలు కూసి
సతి పతులను గూర్చి సమ్మతమున
మును ముహూర్త ముంచ ముండెట్లు మోసెరా ?
విశ్వదాభిరామ! వినురవేమ!


కానివానితోడఁ గలసి మెలఁగుచున్నఁ
గానివానిగానె కాంతు రవని
తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ
విశ్వదాభిరామ! వినుర వేమ!


అల్పబుద్ధి వాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!


వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను
చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ
కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!


మేడిపండు చూడ మేలిమై యుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు
బిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!


మిరపగింజచూడ మీద నల్లగనుండు
కొరికిచూడ లోనచురుకు మనును
సజ్జను లగువారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!


తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్ట నేమి వాడు గిట్టనేమి
పుట్టలోని జెదలు పుట్టవా? గిట్టవా?
విశ్వదాభిరామ వినురవేమా!












చంపదగినయట్టి శత్రువు తనచేత
చిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు
విశ్వదాభిరామ వినురవేమ



ఉర్వివారికెల్ల నొక్క కంచము బెట్టి
పొత్తుగుడిపి పొలము కలయజేసి
తలను చెయ్యిబెట్టి తగునమ్మజెప్పరా
విశ్వదాభిరామ వినురవేమ'

కులవిచక్షణలోని డొల్లతనం గురించి.

మాలవానినంటి మరి నీటమునిగితే
కాటికేగునపుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెండేగెనో
విశ్వదాభిరామ వినురవేమ



ఇంటియాలి విడిచి ఇల జారకాంతల
వెంటదిరుగువాడు వెర్రివాడు
పంటచేను విడిచి పరిగె ఏరినయట్లు
విశ్వదాభిరామ వినురవేమ



పిండములను జేసి పితరులు దలపోసి
కాకులకును పెట్టుగాడ్దెలారా
పియ్యిదినెడుకాకి పితరుడెట్లాయరా
విశ్వదాభిరామ వినురవేమ


అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
దినగ దినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ.












పాల సముద్రంలో పండుకునేవాడికి పక్కవారి ఇంట్లో దొంగలించే దూల ఎందుకు?? పక్కవాడి సొమ్ము దేవుడికైనా సరే సమ్మగా ఉంటుందేమో కదా....


కనక మృగము భువిని కద్దులేదనకుండ
తరుణి విడిచిపోయె దాశరధియు
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?
విశ్వదాభిరామ వినురవేమ.

బంగారు మృగం అనేది భూమ్మీద లేదు. ఈ ముక్క తెలియని రాముడు దేవుడు ఎట్లా అయ్యాడు? రా బుద్ది లేని భక్త జనులారా .....


పలుగురాళ్ళు దెచ్చి పరగ గుడులు కట్టి
చెలగి శిలల సేవ జేయనేల?
శిలల సేవ జేయ ఫలమేమికలుగురా?
విశ్వదాభిరామ వినురవేమ.


రాళ్ళన్నీ తెచ్చి గుడి కట్టి, ఆ శిలలకు పూజ చేస్తే ఏం లాభం రా పిచ్చి పుల్కాల్లారా....


పిండంబులను చేసి పితరుల తలపోసి
కాకులకు పెట్టు గాడ్దెలార!
పియ్యి తినెడు కాకి పితరుడేట్లయరా?
విశ్వదాభిరామ వినురవేమ


మీ తండ్రులు కాకుల రూపంలో వచ్చి తింటారని పిండం పెడతారు సరే, పియ్య తినే కాకి నీ తండ్రి ఎట్లా అవుతాడు రా హౌలే.....

కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు...,
ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద
వేమన బట్టలుప్పి వాటి నిజస్వరూపాన్ని బయట పెట్టాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు