పోస్ట్‌లు

వేమన పద్యాలు

చిత్రం
వేమన కుండ కుంభమన్న, కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్న నొకటి గాదె! భాష లింతె వేరు పరతత్వ మొక్కటే విశ్వదాభిరామ వినుర వేమ. ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు  కాచి అతుకనేర్చు కమ్మరీడు;  మనసు విఱిగెనేని మరి యంట నేర్చునా?  విశ్వదాభిరామ వినురవేమ! పట్టుపట్టరాదు పట్టివిడువరాదు పట్టినేని బిగియ పట్టవలయు పట్టు విడుచుట కన్న పనిచేయుటే మేలు  ॥విశ్వ॥ అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచమై యుండదా? !!విశ్వ!! ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమవీధి  మూగ చింతల పల్లె మొదటి ఇల్లు  ఎడ్డె రెడ్డికుల మదేమని తెల్పుదు; చంపదగిన యట్టి శత్రువు తనచేత  జిక్కె నేని కీడు - సేయరాదు  పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు భూమి నాది యన్న భూమి ఫక్కున నవ్వు  దానహీను జూచి ధనము నవ్వు  కదనభీతుజూచి కాలుండు నవ్వురా కనక మృగము భువిని గద్దు లేదనకయె  తరుణి విడిచి చనియె దాశరధి యు  దెలివిలేనివాడు దేవుడెట్లాయోరా?  విశ్వధాభిరామ! వినురవేమ! కోపమునను ఘనత కొంచమైపోవును కోపమును మిగులఁగోడు గలుగుఁ కోపమణచెనేని కోర్కెలునీడేరు విశ్వదాభిరామ వినుర వేమ కానివానిత...

ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఏ దివిలో విరిసిన పారిజాతమో  ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో  నా మదిలో నీవై నిండిపోయెనే.. ఏ దివిలో విరిసిన పారిజాతమో  ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో  నీ రూపమే దివ్య దీపమై  నీ నవ్వులే నవ్యతారలై నా కన్నుల వెన్నెల  కాంతి నింపెనే.. ఏ దివిలో విరిసిన పారిజాతమో  ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో  పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే కాలి అందియలు ఘల్లు ఘల్లుమన రాజహంసలా రావే ఏ దివిలో విరిసిన పారిజాతమో  ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో  నా మదిలో నీవై నిండిపోయెనే.. ఏ దివిలో విరిసిన పారిజాతమో  ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో  నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే పదము పదములో మధువులూరగా పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతమో  ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో  నా మదిలో నీవై నిం...

ప్రణామం ప్రణామం ప్రణామం

తోం ధిరననన ధిర ధిర నా... తోం ధిరననన ధిర ధిర నా ... తోం ధిరన ధోం ధిరన ధీర ధీర నా నా... తోం ధిరననన ధిర ధిర నా... తోం ధిరననన ధిర ధిర నా ... ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం ప్రమోదం ప్రమోదం ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం ప్రయాణం ప్రయాణం విశ్వంతో మమేకం ప్రయాణం మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులు తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమీసంద్రం ఆశే పచ్చదనం మారే ఋతువుల్లా వర్ణం మన మనసుల భావోద్వేగం  సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో యేల్లది సృష్టి చరిత అనుభవమే దాచింది కొండంత తన అడుగుళలో అడుగేసి వెళదాం జన్మంతా ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతం ఇదంతా ఇది యెవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరములనాటి కదంతా మన తదుపరి మిగలాలంతా కదపక చెరపక పదికాలాలిది కాపాడాలంట ప్రేమించే పధమ్మే ఈ విశ్వం ఇష్టాంగా గుండెకు హత్తుకుందాం కన్నెర్రే కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం ప్రణామం ప్రణామం ప్రణ...

భలే మంచి రోజు పసందైన రోజు

MOVIE: JARIGINA KATHA SINGERS: GHANTASALA MUSIC: GHANTASALA LYRICIST: Dr C NARAYANA REDDY భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ... వసంతాలు పూచే నేటి రోజు (S2) భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ... వసంతాలు పూచే నేటి రోజు  గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు  గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ... వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు  చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ... వసంతాలు పూచే నేటి రోజు (S1&S2) ఆ..ఆ హాహా హాహా హా ఆ..ఆ హాహా హాహా హా ఆ..ఆ హాహా హాహా హా ఆ..ఆ హాహా హాహా హా

రాశాను ప్రేమలేఖలెన్నో

పల్లవి: రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో భువిలోన మల్లియలాయే దివిలోన తారకలాయే నీ నవ్వులే చరణం 1: కొమ్మల్లో కోయిలమ్మా కోయన్నది నా మనసు నిన్నే తలచీ ఓయన్నదీ మురిపించే ముద్దు గులాబి మొగ్గేసింది చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది చరణం 2: నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో ఊహూ నీ చల్లని రూపం ఉందీ నా కనులలో ఆ.. నాలోని సోయగమంతా విరిబూసెలే నాలోని సోయగమంతా విరిబూసెలే మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే చరణం 3: అందాలా పయ్యెద నేనై ఆటాడనా కురులందు కుసుమం నేనై చెలరేగనా నీ చేతుల వీణను నేనై పాట పాడనా నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా

ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..

ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు. ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు..ఆఆఆఆఆఆ....ఆఆఆ మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరీ... మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరీ.. వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు... అటో ఇటో ఎటో వైపు.. కదలరు ఎవ్వరు వేకువ వచ్చినా అనుకొని కోడి కూత నిదరపోదుగా జగతికి మేలుకొలుపు మానుకోదుగా మొదటి చినుకు సూటిగా దూకి రానిదే మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే.. వాన ధార రాదుగా నేల దారికి ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు.. చెదరకపోదుగా చిక్కని చీకటి మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి దానికి లెక్క లేదు కాళరాతిరి పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని రెప్ప వెనక ఆపని కంటి నీటిని సాగలేక ఆగితే దారి తరుగునా జాలి చూపి తీరమే దరికి చేరునా ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు.. యుగములు సాగినా నింగిని తాకక ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే అంత వాడి ఆవిరై వెల్లి చేరదా అంత...

ఓ మహాత్మా , ఓ మహర్షి

ఓ మహాత్మా , ఓ మహర్షి ఓ మహాత్మా , ఓ మహర్షి ఏది చీకటి, ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యువు ఏది పుణ్యం, ఏది పాపం ఏది నరకం, ఏది నాకం  ఓ మహాత్మా , ఓ మహర్షి ఏది సత్యం, ఏదసత్యం ఏదనిత్యం, ఏది నిత్యం ఏది ఏకం, ఏదనేకం ఏది కారణమేది కార్యం ఓ మహాత్మా , ఓ మహర్షి ఏది తెలుపు, ఏది నలుపు ఏది గానం, ఏది మౌనం ఏది నాది, ఏది నీది ఏది నీతి, ఏది నేతి నిన్న స్వప్నం, నేటి సత్యం నేటి ఖేదం, రేపు రాగం ఒకే కాంతి ఒకే శాంతి ఓ మహాత్మా , ఓ మహర్షి ____శ్రీశ్రీ