పోస్ట్‌లు

అనంత చైతన్య స్వరాలు

చిత్రం
               అమెరికా రచయిత ఆప్షన్ సింక్లెయిర్ సాహిత్యమంతా ప్రచారమేనన్నారు.అయితే ప్రచారమంతా సాహిత్యం కాదు. సాహిత్య సంఘాల పని సాహిత్యకారులను ప్రోత్సహించడమే కాదు ప్రజాసాహిత్యాన్ని అభివృద్ధి చేయటం కూడా.         సాహితీ స్రవంతి గత పదహైదు సంవత్స రాలుగా తెలుగు రాష్ట్రాలలో సాహితీ సృజన కారులను ప్రోత్సహిస్తూ సామాజిక చైతన్య సాహిత్యాన్ని ప్రోదిచేస్తూ ఉంది. అరసం, విరసంల తదనంతరం సాహిత్యోద్యమం కొనసాగించేందుకు దీక్షబూని ఉంది. “పాతది పనికిరాదు / సరికొత్త తరం కావాలి / సృజనకే జీవితానికే తేడాలేని/జీవితాన్ని సరికొత్త సృజించే తరం కావాలి' అనంటాడు కె. శివారెడ్డి                జీవితం ఆధునికం అవుతోందని అను కోవడమేగానీ సమాజంలో ఆధునికత జాడలు కానరావడం లేదు. ముఖ్యంగా దళితులు,మహిళలు, పసిపిల్లల పట్ల గురజాడ ఎలాంటి దృక్పథాన్ని చూపించాడో అలాంటి ఆధునిక దృక్పథం ఇంకా సమాజం అందుకోలేదు. ఈ దృక్పథాన్ని నూతన తరం అందుకోవాలి. దీనికోసం వర్తమాన సాహిత్య కారులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.         ...

కోడి రామ్మూర్తి నాయుడు

చిత్రం
      బాల్యం కోడి రామ్మూర్తి శ్రీకాకుళం జిల్లాలో వీరఘట్టం మండలంలో 1882లో జన్మించారు.కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణ స్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయామశాలలో చేరి దేహ ధారు డ్యాన్ని పెంచు కోవడంతో పాటు కుస్తీకూడా నేర్చుకున్నారు. 21 సంవత్స రాల వయసులోనే ఇతడు ఛాతి పై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు. మద్రాసు సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామ శాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి  వ్యాయామ ఉపాధ్యాయుడుగా సర్టిఫికెట్ పొందాక, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకునిగా చేరాడు. సర్కస్ కంపెనీ  విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పాడు. తుని రాజాగారి నుండి సంపూర్ణ సహకారం లభించింది. రామమూర్తి సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకున్నది.  తెలుగు జిల్లాల్లో ప్రదర్శనల తర్వాత 1912లో మద్రాసు చేరాడు. అక్కడ చైనా, జపాన్ కళాకారుల సహకారం ...

ప్రపంచీకరణ కాలసర్పం

        విష సంస్కృతి తో పడగ విప్పిన సామాజిక మాధ్యమాలు, సామాజిక బాధ్యత లేని సినిమాలు, సీరియల్స్. మద్యం లేనిదే  పెరగని స్నేహాలు, బంధుత్వాలు, వ్యాపార వ్యవహారాలు. చిన్న పెద్ద తేడా లేకుండా మానవత్వాన్ని కాటు వేయడానికి ముందుకు వస్తున్న నేతటి ప్రపంచీకరణ కాలసర్పం.

బాలరసాల సాల నవపల్లవ

బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదార సుతోదరపోషణార్ధమై. ----సహజకవి పోతన (గున్నమామిడి చెట్టుకు పూసిన లేత చివుళ్ళలా కోమలమైనట్టి, కావ్యం అనే కన్యను అమ్ముకుని; అట్టి నీచపు తిండి తినడం కంటే; నిజమైన కవి నాగలి పట్టిన వ్యవసాయదారు డైనప్పటికి తప్పులేదు; అడవీ ప్రాంతాలలో కంద దుంపలు, పుట్టతేనెలుతో జీవించువా రైనప్పటికి తప్పులేదు).

ఆచల్లని సముద్ర గర్భం

              ఆచల్లని సముద్ర గర్భం         ‌‌ ‌‌ ‌‌                       ___దాశరథి              ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో         || ఆ చల్లని|| భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాలసుడిగుండాలకు బలైన పవిత్రులెందరో || ఆ చల్లని|| మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో  రణరక్కసి కరాళనృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపుకోతతో అల్లాడిన కన్న తల్లుల విషాదమెంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్దమైన బతుకులు ఎన్నో || ఆ చల్లని|| అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసి పాపలనిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో || ఆ చల్లని||  - దాశరథి

గాథాసప్తశతి - ఒక ఆనందహేల

చిత్రం
                                 *ఒకటి*                  గాథాసప్తశతి ఏడువందల గాథల ప్రాకృత గాథారత్నకోశం.జర్మనీ సాహితీవేత్త ఆల్బ్రెక్ట్ వెబర్ ప్రకారం గాథాసప్తశతికి 6 పాఠాలున్నాయి.ప్రాచార్య శ్రీ హరివల్లభ భయాణీ పరిశీలనలో 7వ పాఠం కూడా ఉందని తేలింది. వందల యేండ్ల నుండి పరంపరంగా వ్రాకాండ్ర వలన లిపి పరిణామ కారణంగా పాఠాలు మారిపోయాయి.ఈ గాథలు మహరాష్ట్రిప్రాకృతంలో ఉన్నాయని పలువురి అభిప్రాయం.కాని ఇవి మహారాష్ట్రిప్రాకృతంలో వ్రాయబడలేదని కొందరి వాదన.  ఏదేమైనా ఈ గాథలు ప్రాకృతంలోనే వ్రాయబడ్డాయని చాల మందిఒప్పుకుంటారు.            క్రీ.శ. 3-7 శతాబ్దాల మధ్యకాలంలో ఈ గాథలను సేకరించి హాలునిపేర వెలయించారని కొందరు అభిప్రాయ పడుతున్నారు.హాలుడు మహాదాత.ఎవరో రచించిన నాలుగు గాథలను నాలుగు కోట్ల బంగారు నాణాలకు కొని ఆ తర్వాత  ఏడు వందల గాథలను సంకలించి గాథాకోశం నిర్మింపజేసాడని ఒక కథ ప్రచారంలో ఉంది.           ప్రాకృత ...

పరాయీకరణ

చిత్రం
           *పరాయీకరణ* మనిషి మట్టి పరిమళాన్ని కోల్పోయాడు ప్రాణ పరిమళాన్ని కోల్పోయిన ఒట్టి కాగితం పువ్వు మనిషి            - మల్లెల నరసింహమూర్తి ( మట్టిగాంతుక) ఇలా మనిషి కోల్పోయిన సహజస్వభావాన్ని కవులు గుర్తించినంతగా ఎవరూ గుర్తించ లేకపోయారు. మనిషి తన సహజ స్వభావాల్ని కోల్పోవడం పరాయీకరణ. ఇది ప్రపంచీకరణ ప్రారంభమయ్యాక ప్రస్ఫుటంగా కనిపించింది. ప్రపంచీకరణ ప్రారంభంలో అర్థం కాక అయోమయంలో నున్న కవులు, కళాకారులు, రచయితలు ప్రపంచీకరణ సునామీ తరువాత పరాయీకరణను బాగా గుర్తించారు. తమ రచనల్లో ఒక నోస్టాల్జియాతో, ఒక ఆవేదనతో, ఆక్రందనతో మనిషి కోల్పోయిన దాన్ని వ్యక్తీకరించారు.          పరాయీకరణ భావనను మొట్టమొదట ప్రవేశపెట్టిన వ్యక్తి హెగెల్. మానవుడు తన పరిణామ క్రమంలో ప్రకృతి నుంచి తాను ఏర్పరచుకున్న ఆధ్యాత్మిక భావాల నుంచి వేరుపడడం మొదలైనప్పటి నుంచి మనిషి పరాయీకరణ ప్రారంభమైందని హెగెల్ భావించాడు.       హెగెల్ తరువాత పరాయీకరణ భావనను ఒక ఖచ్చితమైన పద్ధతిలో వాస్తవిక దృష్టితో చెప్పిన వాడు మార్క్స్. మనిషి తన శ్రమన...