బాలరసాల సాల నవపల్లవ
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ
ద్దాలికులైన నేమి నిజదార సుతోదరపోషణార్ధమై.
----సహజకవి పోతన
(గున్నమామిడి చెట్టుకు పూసిన లేత చివుళ్ళలా కోమలమైనట్టి, కావ్యం అనే కన్యను అమ్ముకుని; అట్టి నీచపు తిండి తినడం కంటే; నిజమైన కవి నాగలి పట్టిన వ్యవసాయదారు డైనప్పటికి తప్పులేదు; అడవీ ప్రాంతాలలో కంద దుంపలు, పుట్టతేనెలుతో జీవించువా రైనప్పటికి తప్పులేదు).
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి