పోస్ట్‌లు

సామెతలు

చిత్రం
         pc: facebook తెలుగు వారి సామెతలు 1. రోసాన సాయబు రొట్టెన్నర తిన్నాడట. 2. రోసి వేసినది రాశికి వచ్చింది. 3. రోసానికి పోయిన రొండ్లెగుసవు. 4. రోషానికి రోలు మెడను కట్టుకొన్నట్లు. 5. రోహిణి కార్తె లో  రోళ్ళు పగుల్తాయి. 6. రోహిణికార్తెలో విత్తుట రోటిలో విత్తుటే. 7. రోహిణికార్తెలో విత్తులు రోయక వేస్తారు, మృగశిరలో ముంచి పోస్తారు. 8. రోహిణిలో జొన్నలు - సాహిణిలో గుఱ్ఱాలు. 9. రోహిణిలో రోకళ్ళు చిగిర్చనన్నా చిగిరిస్తవి, రోళ్ళు పగులనన్నా పగులుతవి. 10. రోహిణిలో విత్తనం, రోళ్ళూ నిండని పంట. 11. రౌతు కొద్ది గుఱ్ఱము. 12. రౌతు దిగాలంటున్నాడు, గుఱ్ఱం ఎగరవేయా (పడదోయాల) అంటున్నది. 13. రౌతు మెత్తనైతే గుఱ్ఱం మూడుకాళ్ళతో నడుస్తుంది. 14. రంకాడ నేర్చినమ్మ బొంకాడ నేర్వదా? 15. రంకు చదువు చదివి ఱంకున జెడుదురు. 16. రంకుటాలికి క్రొత్తడి సుద్దులు పెచ్చు. 17. రంకుటాలి చన్నుకు, సంత సొరకాయకు వచ్చేపోయ్యే వాళ్ళ గోటిగాట్లు తప్పవు. 18. రంకుతనం ఇల్లెక్కి కూత వేస్తుంది. 19. రంకుమగడు కడుపునొప్పి ఎఱుగడు. 20. రంకుముండ బజారు రచ్చకు వెరచునా? వీరపతివ్రత వెరచు గానీ. 21. రంకుమగడు వీపుమన్న...

మానవ నాగరికత లో నిప్పు పాత్ర

మానవ నాగరికత లో నిప్పు పాత్ర            భూమి ఏర్పడిన తర్వాత భూమిపై అనేక జీవరాసులు పరిణామక్రమంలో ఏర్పడ్డాయి .ఒక దశలో అత్యధిక హిమపాతం కలిగిన భూమిని అంతరిక్షం నుంచి వచ్చిన ఆస్టరాయిడ్ శకలాలు తగలడం వల్ల అనేక వృక్షాలు జంతువులు మరణించాయి. ఆ సందర్భంలో  భూమి పైన అనేక గడ్డి మైదానాలు ఏర్పడ్డాయి. ఉత్తరకెన్యా, ఈశాన్య ఇథియోపియాలో లేక్   రుడాల్ఫ్ గడ్డి మైదానాలలో మానవ పరిణామ క్రమం ప్రారంభమైందనిఅందరూ అంగీకరిస్తున్నారు. అప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా  నడిచే వానరాలు చెట్ల మీద నుంచి భూమి మీదికి ఆహార సేకరణ కోసం చాలా దూరం గడ్డి  మైదానాల పై నడుస్తూ  వెళ్లాల్సి వచ్చేది. ఆ క్రమంలో లో వానరాలు నిలబడటం అలవాటు చేసుకున్నాయి. వెనుక కాళ్ళు మొత్తం శరీరాన్ని మోయగల శక్తిని సంపాదించుకున్నాయి. కాలి వేళ్ళు భూమిని పట్టుకునేందుకు అనువుగా పాదం వెడల్పుగా తయారైంది. అప్పుడు ముందు కాళ్ళు స్వేచ్ఛను పొందాయి. కాలక్రమంలో అవి మనిషి చేతులు గా రూపాంతరం చెందాయి. చెట్లు ఎగబాకే టప్పుడు, పళ్ళు ,కాయలు దుంపలు ఏరుకొనేటప్పుడు, రాళ్లను ఉపయోగించేటప్పుడు జరిగిన శ్రమవల్ల చెయ్యి నిర్మాణం అభ...

ప్రపంచీకరణలో స్త్రీలు

ప్రపంచీకరణలో స్త్రీలు యంత్రాలు కనుగొన్నాక వచ్చిన పరిశ్రమలతో ఉత్పత్తి పెరిగి పెట్టుబడిదారీ విధానం బాగా అభివృద్ధి చెందింది. పెట్టుబడిదారీ విధానంలో అన్ని వస్తువులతో పాటు స్త్రీ కూడా ఒక సరుకుగా మారిపోయింది. ఒక డబ్బు సంపాదించే పనిముట్టుగా అయింది.సమాజంలో డబ్బు పాత్ర విపరీతంగా పెరిగాక డబ్బు స్త్రీ పురుష సంబంధాలను నిర్ణయించే పరిస్థితి వచ్చింది. స్త్రీ పురుష సంబంధాలను వారివురి అభిరుచులు, ఇష్టాయిష్టాలు బట్టి గాక డబ్బులను బట్టి నిర్ణయించి నిర్వహించడం జరుగుతోంది. పెట్టుబడి విస్తరణలో భాగంగా వచ్చిన ప్రపంచీకరణ మహిళలు పురుషుల లైంగిక అవసరాలను తీర్చే సరుకులుగా, ఉత్పత్తుల ప్రచార సాధనాలుగా  మార్చివేసింది. సరికొత్తగా సరోగసి (గర్భాన్ని అమ్ముకోవటం )కూడా ఎగుమతి అవుతున్న సేవ గా నిలిచింది .మగవారి మితిమీరిన లైంగిక దాహం మహిళల జీవితాల్లో చీకట్లను నింపుతోంది .వీధుల్లో రక్షణ కరువవుతోంది .మద్యం మత్తులో మహిళల పై యువత చేస్తున్న హత్యాచారాలకు అంతులేకుండా ఉంది.   ఢిల్లీలో జరిగిన  నిర్భయ ఉదంతం ,హైదరాబాదులో జరిగిన దిశ ఉదంతం భారత దేశాన్ని కుదిపేసింది. ఈఉదంతాలు మన దేశంలో మహిళల పట్ల పురుషులకున్న భావాలను తేట ...

రాజ్యాంగ హక్కులు సాధించుకున్న మహిళలు

చిత్రం
రాజ్యాంగ హక్కులు _మహిళలు           అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం  మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు ఇచ్చింది.  పురుషాధిక్య సమాజం మాత్రం దీనిని ఇంకా జీర్ణించుకోలేకుండావుంది. సమాజంలో  రాజకీయంగా, కుటుంబపరంగా తీసుకొనే నిర్ణయాలలో మహిళలకు ఎటువంటి భాగస్వామ్యం లేదు. కుటుంబ బాధ్యతలు ఎంత మోస్తున్నా వారి అభిప్రాయాలకు కొంచెం కూడా విలువ ఇవ్వడం లేదు.సమాన హక్కుల ని ఎంత గొంతు చించుకున్నా మహిళలకు ఇంటా బయట ఎటువంటి అధికారాలు లేకుండా చేస్తున్నారు.              పౌష్టికాహారం లేమి కారణంగా రక్తహీనతతో మహిళా వర్గం బాధపడుతోంది .ఇంటి పని తో, బయట పనితో సతమతమవుతోంది శ్రామిక మహిళ. మహిళలే వంట చేసినా ఆహారాన్ని మగవాడే ఎక్కువభాగం తీసుకోవడం వల్ల ఆమె తక్కువ తీసుకుంటోంది.దాంతో  పోషకాహారం తగ్గి అనేక రోగాలకు గురవుతోంది. ప్రసూతి మరణాలకు,శిశు మరణాలకు ఇది ప్రధాన కారణంగా ఉంది. 2005 ఆరోగ్య  మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం  మగ శిశువుల మరణాలు కన్నా ఆడ శిశు మరణాల సంఖ్య 61 శాతం అధికంగా ఉంది.14 ఏళ్ల లోపు పిల్లలందరికీ విద్య గ్యారెంటీ చేయబడినా...

జాతీయోద్యమం లో స్త్రీల భాగస్వామ్యం

చిత్రం
స్వాతంత్రోద్యమం_ సంస్కరణ ఉద్యమాలు _ స్త్రీల భాగస్వామ్యం సమాజంలో లో స్త్రీలు సగభాగం అయినప్పటికీ స్వాతంత్రోద్యమంలో  మహిళల పాత్ర తక్కువగా ఉండేది.  మహిళలను భాగస్వామ్యం చేయకుండా స్వాతంత్రం సాధించలేమని  నాయకులు గుర్తించారు. సమాజంలో ఉన్న దురాచారాలు కట్టుబాట్లే నని దీనికి ఆటంకంగా ఉన్నాయని అర్థం చేసుకున్న నాయకులు సమాజంలో సంస్కరణలకు కట్టారు. ఆర్య సమాజం ,బ్రహ్మ సమాజం మొదలైన సామాజిక సంస్థలు హిందూ ముస్లిం  మతాలలో వున్న మూఢాచారాలను ,కట్టుబాట్లను ఎదిరించాలని అనేక సామాజిక ఉద్యమాలు చేపట్టాయి.హరిజనుల పట్ల వున్న అంటరానితనాన్ని పోగొట్టాలని ప్రచారం చేశారు. స్త్రీ పురుషులు సమానం అన్నారు. దయానంద ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రామకృష్ణ పరమహంస వివేకానంద రాజారామమోహన్ రాయ్ కందుకూరి రఘుపతి వెంకటరత్నం గురజాడ వంటి సంస్కర్తలు స్త్రీ విద్య, బాల్యవివాహాల నిషేధం, సతీసహగమనం, స్త్రీల పునర్వివాహం ,కన్యాశుల్కం రద్దు, వరకట్న నిషేధం వంటి దురాచారాలపై ఉద్యమాన్ని నిర్మించారు .ఈ విషయంలో ఆంగ్లేయుల విద్యా విధానం కూడా తోడ్పడింది.ఈ ఉద్యమాల మూలంగా స్వాతంత్ర్యోద్యమంలో కి చాలామంది యువతీయువకులు అడుగు పెట్టారు. జాతీయ నాయకుల ప్...

స్త్రీ ఆధిపత్యాన్ని కొల్పోయిన దశ

    మాతృస్వామిక సమాజం, పితృస్వామిక సమాజంగా మారిన క్రమం నాగలి వాడకం పెరిగాక వ్యవసాయంలో స్త్రీలు పాల్గొనడం కష్టమైంది భూమిని దున్నడం పురుషుల పనిగా మారింది. పనిముట్లలో సాంకేతిక అభివృద్ధి పెరిగేకొద్దీ సమాజంలో ఉత్పత్తి పెరిగి మిగులు ఏర్పడడం మొదలైంది ఆ మిగులు పై వ్యక్తిగత యాజమాన్యం ఏర్పడింది. తయారైన ఉత్పత్తి పై   స్త్రీకి యాజమాన్యం సంక్రమిస్తే పనిముట్ల పై పశువులపై మగవారికి యాజమాన్యం సంక్రమించింది. ఉత్పత్తి స్థాయి పెరిగే కొద్దీ మగవారికి ఆస్తిపై యాజమాన్య హక్కు పెరుగుతూ వచ్చింది. అయితే ఆ ఆస్తిని తన సంతానానికి అందించే వారసత్వ హక్కు లేకుండా ఉంది. దాంతో ఉత్పత్తిపై తనకు పెరిగిన యాజమాన్యపు హక్కును వినియోగించుకుని మాతృస్వామిక సమాజాన్ని మగవాడు పితృస్వామిక సమాజంగా మార్చేశాడు. దాంతో మగవాని ఆస్తి అతని సంతానానికి వారసత్వంగా చెందే పద్ధతి వచ్చింది. ఈ వ్యక్తిగత ఆస్తి హక్కును కాపాడుకోవడానికి గణసమాజ వ్యవస్థ పనికిరాకుండా పోయింది .అందువలన గణ సమాజాలు కలిసి తెగలుగా ఏర్పడిన పరిస్థితిలో అన్నీ కలిసి సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఉత్పత్తి అభివృద్ధి చెందే కొద్దీ వ్యక్తిగత ఆస్తిని పెంచుకునే  క్రమంలో  ...

వేదనారాయణ స్వామి ఆలయం

       విష్ణువు దశావతారాల్లో మొదటిదీ.. వేదాలకు పునర్జన్మను ప్రసాదించిందీ మత్స్యావతారం. అయితే స్వామి మత్స్యరూపంలోనే స్వయంభూగా వెలసిన క్షేత్రం ఒకటి ఉంది… ఇక్కడ స్వామి వారు శ్రీదేవీ భూదేవీ సమేతుడై కొలువుదీరి పూజలందుకుంటున్నారు. ఈ ఆలయ విశేషాలు...తెలుసుకుందాం.. మనిషి పుట్టుక నుంచీ మరణం వరకూ ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నిర్దేశించిందే వేదం. అలాంటి వేదాలను సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే మత్స్యావతారం. సోమకాసురడనే రాక్షసుడు.. బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచెను. సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. వేదాలు లేకుండా జీవసృష్టి చేయడం కష్టమని భావించిన బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి వైకుంఠపురం చేరుకుంటాడు. జరిగిన విషయాన్ని విన్నవించి, ఈ విపత్తు నుంచి కాపాడమని వేడుకుంటాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు మత్స్యరూపాన్ని దాల్చి సముద్రంలో దాగున్న సోమకాసురుడితో భీకర యుద్ధం చేస్తాడు. కొన్ని సంవత్సరాలు కొనసాగిన ఈ యుద్ధంలో చివరికి సోమకాసురుడిని సంహరించిన విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు. మరోవైపు… వేదాపహరణ జరిగిన సమయంలో సోమకాసుర సంహారం కోసం ...