పోస్ట్‌లు

ఓ మహాత్మా , ఓ మహర్షి

ఓ మహాత్మా , ఓ మహర్షి ఓ మహాత్మా , ఓ మహర్షి ఏది చీకటి, ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యువు ఏది పుణ్యం, ఏది పాపం ఏది నరకం, ఏది నాకం  ఓ మహాత్మా , ఓ మహర్షి ఏది సత్యం, ఏదసత్యం ఏదనిత్యం, ఏది నిత్యం ఏది ఏకం, ఏదనేకం ఏది కారణమేది కార్యం ఓ మహాత్మా , ఓ మహర్షి ఏది తెలుపు, ఏది నలుపు ఏది గానం, ఏది మౌనం ఏది నాది, ఏది నీది ఏది నీతి, ఏది నేతి నిన్న స్వప్నం, నేటి సత్యం నేటి ఖేదం, రేపు రాగం ఒకే కాంతి ఒకే శాంతి ఓ మహాత్మా , ఓ మహర్షి ____శ్రీశ్రీ 

ప్రతిజ్ఞ

పొలాలనన్నీ , హలాల దున్నీ , ఇలాతలంలో హేమం పిండగ ----- జగానికంతా సౌఖ్యం నిండగ ----- విరామ మెరుగక పరిశ్రమించే , బలం ధరిత్రికి బలికావించే , కర్షక వీరుల కాయం నిండా కాలవ కట్టే ఘర్మ జలానికి , ఘర్మ జలానికి , ధర్మ జలానికి , ఘర్మ జలానికి ఖరీదు లేదోయ్ ! నరాల బిగువూ , కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని , ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని ------ గనిలో , వనిలో , కార్ఖానాలో పరిక్లమిస్తూ , పరిప్లవిస్తూ , ధనిక స్వామికి దాస్యం చేసే , యంత్రభూతముల కొరలు తోమే, కార్మిక వీరుల కన్నుల నిండా కణ కణ మండే , గలగల తొణకే విలాపాగ్నులకు , విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్ ! నిరపరాధులై దురదృష్టంచే చెరసాలలో చిక్కే వాళ్ళు ______ లోహ రాక్షసుల పదఘట్టనచ్చే కొనప్రాణంతో కనలేవాళ్లు _______ కష్టంచాలక కడుపుమంటలే తెగించి సమ్మెలు కట్టేవాళ్లు ______ శ్రమ నిష్పలమై , జని నిష్టురమై , నూతిని గోతిని వెదికే వాళ్ళు ____ అనేకులింకా అభాగ్యులంతా , అనాథలంతా , అశాంతులంతా ధీర్ఘశ్రుతిలో , తీవ్ర ధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారోయ్ ! కావున – లోకపుటన్యాయాలూ , కాల్చే ఆకలి , కూల్చే వేదన , దారిద్ర్యాలు , దౌర్జన్యాలూ పరిష్కరించే , బహిష్కరించే బాటలు తీస్తూ...

కొంత మంది కుర్రవాళ్ళు - శ్రీ శ్రీ

కొంత మంది కుర్రవాళ్ళు         రచన: శ్రీ శ్రీ కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకీ పకీర్లకీ పుకార్లకీ నిబద్ధులు నడిమి తరగతికి చెందిన అవగుణాల కుప్పలు ఉత్తమొద్దు రాచ్చిప్పలు నూతిలోని కప్పలు  తాతగారి నాన్నగారి భావాలకి దాసులు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు వీళ్ళకి కళలన్నా రసమన్నా చుక్కెదురు గోలచేసి అరవడ మొకటే వీళ్ళేరుగుదురు కొంత మంది కుర్రవాళ్ళు ముందు తరం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు బానిస పంథాలను  తలవంచి అనుకరించరు పోనీ అని అన్యాయపు పోకడలు సహించరు. వారికి మా ఆహ్వానం వారికి మా వందనం వారికి మా ఆహ్వానం వారికి మా వందనం

తెలుగు లిపి

తెలుగు లిపి      తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన దక్షిణ బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. దక్షిణ భారతదేశములో బ్రాహ్మీ లిపి లో వ్రాసిన అక్షరములు మొదట భట్టిప్రోలు లో దొరికాయి. అచటి బౌద్ధస్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి. ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామము చెందాయి._ *ఆవిర్భావం* *1410లో శ్రీనాధకవి కాలమునాటి శాసనం*    తీరాంధ్రప్రాంతము, కృష్ణా నదీ తీరాన ఉన్న భట్టిప్రోలు గ్రామమందు క్రీ.పూ. 5వ శతాబ్దములో గొప్ప బౌద్ధస్తూపము నిర్మించబడినది. ఆ సమయములో బౌద్ధమతముతో బాటు మౌర్యుల కాలములో వాడుకలో నున్న బ్రాహ్మీ లిపి కూడా అచటకు చేరినది. ఈ లిపి దగ్గరలోనున్న ఘంటసాల, మచిలీపట్నం రేవుల నుంచి మొదలైన దేశాలకు కూడా చేరి అచటి లిపుల ఆవిర్భామునకు...

సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలు

చిత్రం
సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలు  తెలుగు ప్రజలు జరుపుకునే వ్యవసాయసంబంధ పండుగ సంక్రాంతి. రాయలసీమ ప్రాంత ప్రజలైన కదిరి ప్రజానీకం కూడా ఈ పండుగను మూడు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడని భావించే రోజును మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. పంటలు చేతికొచ్చిన సందర్భంలో ఇది రైతులు చేసుకునే ఆనందోత్సాహాల పండుగ. ఈ పండుగకు  అల్లుళ్ళను పిలిచి మర్యాదలు చేయడం ఒక ఆనవాయితీ గా ఉంది. సంక్రాంతికి ముందు రోజును భోగి పండుగ అంటారు. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఎలాగంటే పాడి పంటలు సమృ ద్ధిగా ఇళ్లకు వచ్చే కాలమిది. రెండో రోజును సంక్రాంతిగా, పెద్దలు పండుగగా, మూడో రోజును కనుమ పండుగ లేదా పశువుల పండుగగా జరుపుకుంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 14 న జరుపుతారు. భోగి రోజున తెల్లవారక ముందే కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభ మవుతుంది. మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద, ఆప్యాయతలతో కూడుకొని ఉన్న జీవితాన్ని ప్రారంభించాలని మనసులో నిర్ణయించుకుంటారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానాలు చే...

మట్టిపూల జీవన తాత్వికత వెల్లివిరిసిన కథలు

''కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరిపగ్గం, సాలెలమగ్గం/ శరీర కష్టం స్ఫురింపజేసే/ గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి/ సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు'' అని శ్రీశ్రీ తన ప్రతిజ్ఞా గీతంలో చెపుతాడు. ఇలా వివిధ వృత్తుల వారి జీవన తాత్వికతను, శ్రమజీవన పోరాటాన్ని కథలుగా మలిచి వృత్తిదారుల కథా సంపుటాలను వెలువరిస్తున్నారు మూరిశెట్టి గోవిందు. ఆయన ఇదివరకే మంగలి కతలు, చాకిరేవు కతలు తీసుకొచ్చారు. ఇప్పుడు కుమ్మరి కథలు రాశారు.         కుమ్మరి చక్రం ఆగిపోతున్నా, కాలచక్రం గిర్రున తిరుగుతోంది. తొంభై దశకంలో మొదలైన ప్రపంచీకరణతో పల్లె సామాజిక జీవన చిత్రం పెను కుదుపులకు గురైంది. సాంకేతికత అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. ఫలితంగా చేతివృత్తులు ధ్వంసం అయ్యాయి. దాంతో 'పల్లె కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల' అంటూ గోరటి వెంకన్న పాట రాశాడు. కొలిమి ఆరిపోయింది. కుమ్మరి చక్రం, నాగలి విరిగిపోయాయి. సాలెల మగ్గం పోగు తెగిపడింది. వాటి స్థానంలో స్టీలు గిన్నెలు వచ్చాయి. ఇనుప మడకల ట్రాక్టరు వచ్చింది. వృత్తిదారులు తమ వృత్తులను వదిలేసి పట్టణాలకు వలసెల్లిపోయారు. ఇంకా పాతవాటిని వదులుకోలేక మార్పుకు మానసికంగా సిద్ధపడని ...

ఉమర్ ఖయ్యాం

చిత్రం
                                            Umar Khayyam                                                    ఉమర్ ఖయ్యాం  పూర్తిపేరు గియాసుద్దీన్ అబుల్ ఫతహ్ ఉమన్ ఇబ్రహీం ఖయ్యాం. పారసీ దేశంలో, ఈశాన్యమూల ఉన్న ఖురాఉమర్ ఖయ్యాంఉమర్ ఖయ్యాంసాన్ రాష్ట్రానికి ముఖ్యపట్టణ మైన, నిషాపూర్లో జన్మించాడు. జననం,క్రీస్తు తరువాత 1025-1050 సంవత్సరాల మధ్యలో అని విమర్శకుల నిశ్చయం. ఖయ్యాంను గురించి ప్రత్యేక పరిశోధనలు చేసి, అతని జాతకాన్నికూడా తయారుచేసిన వి.యం. దాతా, అతని జననం 1041 సంవత్సరం మే నెల 18వ తేదీ సూర్యోదయ సమయంలో అని నిర్ణయించారు. దాతా వలెనే కృషిచేసిన, సయ్యద్ సులేమాన్ నర్వీకూడా. 1048 సంవత్సరం సరియైనదని నిశ్చయించాడు. ఉమర్ ఖయ్యాం బాల్యం, బల్ఖ్ లో గడిచింది. తరువాత, ఇమాం ముఆప్ఫక్ నైషాపురి వద్ద చదువుకున్నాడు. ఆయన వద్ద చదువుకున్నవారు పేరు ప్రఖ్యాతులు గలవారవ...