పోస్ట్‌లు

నవ్వులు రువ్వే పువ్వమ్మా

నవ్వులు రువ్వే పువ్వమ్మా నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా... ఉన్న నాలుగు నాళ్ళు నీలా  ఉండిపోతే చాలమ్మా నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..ఆ..పువ్వమ్మా ఆకుల పయ్యెదలో  నీ ఆడతనాన్ని దాచావు రేకుల కేంపులలో  నీ రేపటి ఆశలు నింపావు ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన  మొగ్గ సొగసు ఉందమ్మా... నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..ఆ..పువ్వమ్మా ఈ తోట మొత్తమూ కమ్మినవి  నీ దోరవయసు అందాలు ఈ గాలి మత్తులో ఉన్నవీ  నీ కన్నె మనసులో కైపులు ఈ తోట మొత్తమూ కమ్మినవి  నీ దోరవయసు అందాలు..  ఈ గాలి మత్తులో ఉన్నవీ  నీ కన్నె మనసులో కైపులు నువ్వు ఒలకబోసే ఓంపుసొంపులకు  ఒడిని పడతానుండమ్మా... నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..ఆ..పువ్వమ్మా ఏ కొమ్మకు పూచావో  ఏ కమ్మని తేనెలు తెచ్చావో .. ఏ పాటకు మురిసేవో  ఏ తేటికి విందులు చేసేవో ఆ పాట గానో,తేటిగానో  పది నాళ్ళున్నాచాలమ్మా ..  నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా ఉన్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా... నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు...

చెక్కర కలిపిన తియ్యని తెలుగు భాష.

https://youtu.be/2cFsZTXLdwY చెక్కర కలిపిన తియ్యని తెలుగు భాష.

నమ్మకు నమ్మకు

నమ్మకు నమ్మకు సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి వెచ్చనైన ఊసులన్ని రెచ్చగొట్టు సీకటి నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి పొద్దు పొడుపేలేని సీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోని రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటెనక నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి కలలే వలగా విసిరే చీకట్లను వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు రవికిరణం కనబడితే తెలియును తేడాలన్ని ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం  తనువూగింది ఈ వేళా  చెలరేగింది ఒక రాసలీలా  ఝుమ్మంది నాదం సయ్యంది పాదం  తనువూగింది ఈ వేళా  చెలరేగింది ఒక రాసలీలా  యెదలోని సొదలా ఎలరేటి రొదలా  కదిలేటి నదిలా కలల వరదలా  యెదలోని సొదలా ఎలరేటి రొదలా  కదిలేటి నదిలా కలల వరదలా  చలిత లలిత పద కలిత కవిత లెగ  సరిగమ పలికించగా  స్వర మధురిమ లొలికించగా  సిరిసిరి మువ్వలు పులకించగా  ఝుమ్మంది  నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ  నటియించు నీవని తెలిసీ  నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ  నటియించు నీవని తెలిసీ  ఆకాశమై పొంగే ఆవేశం  కైలాశమే వంగే నీకోసం  ఝుమ్మంది  మెరుపుంది నాలో – అది నీ మేని విరుపు  ఉరుముంది నాలో – అది నీ మువ్వ పిలుపు  చినుకు చినుకులో చిందు లయలతో  కురిసింది తొలకరి జల్లు  విరిసింది అందాల హరివిల్లు  ఈ పొంగులే ఏడు రంగులుగా  ఝుమ్మంది !! 

మనసా నిన్ను నిప్పుతోని కడగనా

మనసా నిన్ను నిప్పుతోని  కడగనా   మనసా మనసా మనసా కన్నీళ్లతో నిను మార్చనా  మనసా మనసా మనసా ఆఆఆఆ........ నీ మర్మమేందో నెరుగనైతి  మనసా మనసా చందమామ నందుకునే శక్తి నీకున్నా సముద్రాల నీదే బలం నీకున్నా నేను నాది అనే మాట మరువ వెందుకో స్వార్థమనే మాట మరువవెందుకో నీవు మరువవెందుకో  మనసా మనసా  నిన్ను నిప్పు తోటి కడగనా  మనసా కన్నీళ్లతో నిను మార్చనా గుళ్ళు గోపురాలెన్నో ఎక్కి వస్తున్నా  లెక్కలేని పదవులెక్కి వస్తున్నా ఎదుటి వాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకో వెనకనుంచి పొడిచే పాడుగుణం ఎందుకో పాడుగుణం ఎందుకో  మనసా మనసా నిను నిప్పుతోటి కడగనా మనసా ఆఆఆ  సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగినా  మనిషిలోని అణువణువును మార్చగలిగినా మనసులోని మాయ పొరలుతుంది ఎందుకో నువ్వు మనిషి లాగా ఒక్క దినం బతుకవెందుకో  నువ్వు బతుకవెందుకో మనసా మనసా కన్నీళ్లతో నిను కడగనా మనసా ఆఆఆ

కాలం నన్ను

కాలం నన్ను        ___ ఎం.శేషగిరి పల్లవి: కాలం........ నన్నూ.... పదే...... పదే పలకరించింది ఎదురుగా నిలబడి....... వెక్కిరించింది- నన్ను హెచ్చరించింది. చరణం:  వేగుచుక్కను వెంట నిడుకొని తట్టిలేపింది. పరుగులిడమని..... తాకరమ్మని చుట్టు తిరిగింది. నాతో పట్టుపట్టింది. వెనకబడితే తడుములాట తీరు చూపింది.... అధిగమిస్తే...... అవధులకు  ఇక తావులేదంది..... నే పావుకానంది వ్యవధి తెలిసి మసలుకుంటే చెలియ తానంది. చేతగాని...... చేవలేని బతుకు వద్దంది  మనిషికి తెగువ బలమంది. త్యాగధనుల జీవితాలను ..... ఆలపించింది..... కర్మజీవులా....... ఘర్మజలముల కథలు చెప్పింది...... వెతలు బాపింది.

అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేల శేషుల పడగల మయము

అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేల శేషుల పడగల మయము  అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేల శేషుల పడగల మయము    చరణం 1 అదే వేంకటాచల మఖిలోన్నతము  అదివో బ్రహ్మాదుల కపురూపము  అదివో నిత్య నివాస మఖిలమునులకు  అదే చూడుడు.. అదే మ్రొక్కుడు.. ఆనందమయము అదే చూడుడదే మ్రొక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేల శేషుల పడగల మయము  చరణం 2 చెంగటనల్లదివో శేషాచలము  నింగినున్న దేవతల నిజవాసము  ముంగిట నల్లదివో మూలనున్న ధనము  బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేల శేషుల పడగల మయము  చరణం 3 కైవల్యపదము వేంకటనగమదివో  శ్రీవేంకటాపతికి సిరులైనవి  భావింప సకల సంపదరూప మదివో  పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేల శేషుల పడగల మయము