పోస్ట్‌లు

రారాకి నూరేళ్లు

తెలుగువాక్యం గుడిపాటి వెంకట చలం చేతిలో  ఎంత సౌందర్యాన్ని సంతరించుకుందో, భాష,  భావ వ్యక్తీ కరణ ఎంత జీవకళతో నిలిచి వెలిగాయో రాచమల్లు రామ చంద్రా రెడ్డి చేతిలో తెలుగు సాహిత్య విమర్శ కూడా పదునుదేలి, అంతే శక్తి మంతమైన మారణాయుధమై కవులూ,  రచయితల గుండెల్ని చీల్చి వేసింది. రారా ఒక్కమాట అన్నాడూ అంటే అది గుచ్చుకుని తీరుతుంది. కొరడా లాంటి విమర్శతో కొట్టిన దెబ్బ కొన్ని దశా బ్దాలు గుర్తుండి పోతుంది. ఆయన కటువైన మాట, తట్టుతేలు తుంది కొట్టినచోట !  ‘ఈ సమాజం ఎంత పాడయిపోయినా, దిగంబరులు రాసిందాన్ని కవిత్వం అనేంతగా దిగజారి పోయిందా?’ అంటాడు. అంతేనా? ‘అన్ని బూతులు రాసిన చేతుల్తో ఆ దిగంబరులు అన్నం ఎలా తింటారో?’  అనీ అన్నాడు. దాంతో దిగంబర కవిత్వం కొత్త విప్లవదారులు వేస్తోందని ఎగిరెగిరిపడుతున్న  వాళ్ళ నోళ్లు పడిపోయాయి.  సాహిత్యంలో తేడా వస్తే కత్తి దూసి నరుకుతాడు రారా. నిలువెల్లా నిజాయతీ నిండిన మనిషి.  గొప్ప స్నేహితుడు. దయాళువు. ఆప్యాయంగా పలకరించి ఆదరించే వాడాయన.  అది 1977 జూలై నెల. ‘ఈనాడు’లో ట్రైనీ సబ్‌ ఎడిటర్‌గా జాయిన్‌ అయ్యాను. నాలాంటి 30 మందికి అనువాదం నేర్పించే గుర...

దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారు?

చిత్రం
        Courtesy: pngtree.com       దీపం   జ్ఞానానికి చిహ్నం. ప్రాణానికి సంకేతం.అందుకే      " జ్ఞానం తారాజువ్వలా ఉండాలి/ఎప్పుడూ ఊర్ధ్వ ముఖంగానే ఎదగాలి" అంది దీప్తి ఆకెళ్ల.          పండుగలు, ఉత్సవాలు, జాతరలు, మన దేశ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. గత తరాల వారసత్వాన్ని సంప్రదాయాలను గుర్తుచేస్తాయి. న్యూ ఇయర్స్ డే, మే డే వంటివి అన్ని మతాల వారు జరుపుకునే పండుగలు. పండుగ అంటే సంబరం, స్నేహం, సమానత్వం పరిమళించే రోజు.       కానీ ప్రస్తుతం దేశంలో పెత్తనం చేస్తున్న ప్రతీప శక్తులు ప్రజల మధ్య  విద్వేషాలను రెచ్చగొట్టడానికి, ఘర్షణలను సృష్టించడానికి, రక్తం పారించడానికి పండుగల్ని సందర్భాలుగా చేసుకుంటున్నారు. అన్నదమ్ముల్లాగా మెలిగే మతస్తుల మధ్య అడ్డు గోడలు  లేపుతున్నారన్నారు ఎంవియస్ శర్మ.        చాలా పండుగలు ఉత్సవాలు   పండుగలు  వ్యవసాయం, పశుపోషణ వంటి వాటికి సంబంధించి ఉంటాయి. కొన్ని ప్రకృతిపై మానవుడు విజయం సాధించిన ...

ప్రతిమల పెండ్లి సేయుటకు

... "ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని  దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్‌ మెతుకు విదల్ప దీ భరతమేదిని ముప్పదిమూడు కోట్ల  దేవత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తు లారునే"   __ జాషువా ( 'గబ్బిలం' )

వాళ్ళు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు

*వాళ్ళు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు* వాళ్ళు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి మాట్లాడలేదు తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు. నేను యూదును కాదు కాబట్టి ఎదురు మాట్లాడలేదు తర్వాత వాళ్లు కార్మిక నాయకుల కోసం వచ్చారు. నేను కార్మిక నాయకుడ్ని కాదు కాబట్టి మాట్లాడలేదు తర్వాత వాళ్లు కాథలిక్కుల కోసం వచ్చారు. నేను ప్రొటెస్టెంటును కాబట్టి మాట్లాడలేదు చివరకు వాళ్లు నా కోసం వచ్చారు. అప్పటికి నాకోసం మాట్లాడేందుకు ఎవరూ మిగిలిలేరు -జర్మనీలో నాజీల పాలన గురించి మార్టిన్ వీమోల్లర్ (1892–1984) అనే మత గురువు చెప్పిన మాటలు

tea పైన పద్యం

మంచి 'tea' గొప్ప kick ఇవ్వడానికి ఒక cup చాలు. ఎర్రాప్రగడ ఒక్క పద్యంలో ఎన్ని 'టీ ' లు ఇచ్చేడో చూడండి. సహజంగానే గొప్ప kick ఇచ్చే పద్యం ఇది. "నిను సేవించిన గల్గు మానవులకున్ వీటీ వధూటీ ఘటీ ఘనకోటీ శకటీ కటీ తటి పటీ గంధేభ వాటీ పటీ  ర నటీ హారి పటీ సువర్ణ మకుటీ ఫ్రచ్చోటికా పేటికల్  కనదామ్నాయ మహాతురంగ శివలింగా నీలకంఠీశ్వరా "

చదువనివాడజ్ఞుండగు

చదువనివాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్ చదువగ వలయును జనులకు చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రీ! చదువుకోనివాడు అజ్ఞాని అవుతాడు. బాగా చదువుకుంటే సత్, అసత్ అంటే ఏది మంచి, ఏది చెడు అనే విషయాలు బాగా అర్థమవుతాయి. అందుకే అందరూ శ్రద్ధగా చదువుకోవాలి.  భాగవతం,పోతన

దేశమును ప్రేమించుమన్నా

దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ ! పాడిపంటలుపొంగి పొర్లే దారిలో నువు పాటు పడవోయ్ తిండి కలిగితె కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ ! ఈసురోమని మనుషులుంటే దేశ మేగతి బాగుపడునోయ్ జల్డుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయ్ ! అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్  దేశి సరుకులు నమ్మవెలె నోయ్  డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపద లబ్బవోయ్ ! వెనుక చూసిన కార్యమేమోయ్ మంచిగతమున కొంచమేనోయ్ మందగించక ముందు అడుగేయ్ వెనుక పడితే వెనుకేనోయ్ ! పూను స్పర్దను విద్యలందే వైరములు వాణిజ్య మందే వ్యర్ధ కలహం పెంచబోకోయ్ కత్తి వైరం కాల్చవోయ్ ! దేశాభిమానము నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పకోకోయ్ పూని యేదైనాను, వొక మేల్  కూర్చి జనులకు చూపవోయ్ ! ఓర్వలేమి పిశాచి దేశం మూలుగులు పీల్చేసె నోయ్ ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చవోయ్ పరుల కలిమికి పొర్లి యేడ్చే పాపి కెక్కడ సుఖం కద్దోయ్ ఒకరి మేల్ తన మేలనెంచే నేర్పరికి మేల్ కొల్ల లోయి ! సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడవోయ్ దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులోయ్ ! చెట్ట పట్టాల్ పట్టుకుని  దేశస్తు లంతా ...