Courtesy: pngtree.com దీపం జ్ఞానానికి చిహ్నం. ప్రాణానికి సంకేతం.అందుకే " జ్ఞానం తారాజువ్వలా ఉండాలి/ఎప్పుడూ ఊర్ధ్వ ముఖంగానే ఎదగాలి" అంది దీప్తి ఆకెళ్ల. పండుగలు, ఉత్సవాలు, జాతరలు, మన దేశ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. గత తరాల వారసత్వాన్ని సంప్రదాయాలను గుర్తుచేస్తాయి. న్యూ ఇయర్స్ డే, మే డే వంటివి అన్ని మతాల వారు జరుపుకునే పండుగలు. పండుగ అంటే సంబరం, స్నేహం, సమానత్వం పరిమళించే రోజు. కానీ ప్రస్తుతం దేశంలో పెత్తనం చేస్తున్న ప్రతీప శక్తులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి, ఘర్షణలను సృష్టించడానికి, రక్తం పారించడానికి పండుగల్ని సందర్భాలుగా చేసుకుంటున్నారు. అన్నదమ్ముల్లాగా మెలిగే మతస్తుల మధ్య అడ్డు గోడలు లేపుతున్నారన్నారు ఎంవియస్ శర్మ. చాలా పండుగలు ఉత్సవాలు పండుగలు వ్యవసాయం, పశుపోషణ వంటి వాటికి సంబంధించి ఉంటాయి. కొన్ని ప్రకృతిపై మానవుడు విజయం సాధించిన ...