పోస్ట్‌లు

విలవిలలాడుతున్నప్రపంచం

చిత్రం
57 దేశాలకు కరోనా వ్యాప్తి అంటార్కిటికా తప్ప అన్ని ఖండాల్నీ చుట్టేసిన కరోనా వైరస్‌ అంతకంతకూ పెరుగుతున్న మరణాలు కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థలు ప్రపంచం విలవిల ఒక మహమ్మారి జగతిని కమ్ముకుంటోంది. భూగోళాన్ని చిగురుటాకులా వణికిస్తోంది.  ప్రపంచ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేస్తోంది. మార్కెట్లను బెంబేలెత్తిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న కల్లోలంపై ప్రత్యేక కథనం. కరోనా వైరస్‌(కోవిడ్‌ 19).. ఇప్పుడిది చైనాలోని వుహాన్‌కే పరిమితమైన అంటువ్యాధి కాదు. దాని సరిహద్దుల్ని ఎప్పుడో దాటేసి.. విశృంఖలంగా విజృంభిస్తూ.. అనేకానేక దేశాలను చుట్టబెట్టేస్తోంది. చైనాలో నమోదవుతున్న కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంటే.. బయటిదేశాల్లో మాత్రం ఇది శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌కు ‘ప్రపంచ అంటువ్యాధి’గా మారే సత్తా ఉందన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరికల్ని ముమ్మాటికీ నిజం చేస్తోంది. వివిధ దేశాల్లో శీఘ్రగతిన వ్యాపిస్తూ.. పదుల సంఖ్యలో ప్రజలను పొట్టనబెట్టుకుంటోంది. ఒక్క అంటార్కిటికా తప్ప మొత్తం ఆరు ఖండాల్నీ ఈ వైరస్‌ చుట్టేసిం...

సావిత్రిబాయి ఫూలే జయంతి

చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే గారి జయంతిని జాతీయ మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలి. ---------------------------------------- ఇప్పుడు నడుస్తున్న చరిత్ర రాజ్యం కనుసనుల్లో వక్రీకరించబడిన చరిత్ర.అవాస్తావాలని వాస్తావలుగా,వాస్తవాలను అసలే లేనివాటిగా మార్చి రాయబడిన చరిత్ర. పీడితుల పక్షాన పోరాడిన ఎందరో మహాపురుషుల త్యాగాలను కాలగర్భంలో పాతరేసిన చరిత్ర. పూడ్చబడిన చరిత్రను తవ్వితీయ పలకా,బాలపాలనే ఆయుధాలుగా మార్చి అక్షరానికి వారి ఆయుస్సు పోసి లక్షల అక్షరాలను మనకు అందించిన "ఫూలే దంపతులే" నిజమైన  ఉపాధ్యాయులు.వారి జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వమే జరపాలి. సావిత్రిబాయి ఫూలే గారు జనవరి 3 1831 వ సంవత్సరలోమహారాష్ట్రలోని సతారా జిల్లా,నాయిగాం గ్రామంలో మలి కుటుంబంలో జన్మించారు. మనువాద మూఢాచారం ముక్కుపచ్చలారని 9 ఏళ్ల బాల్యంలోనే 12 ఏళ్ళ జ్యోతిరావు పూలే తో వివాహము జరిపించింది. సనాతన ధర్మ శాస్త్రం దేశమంతా స్త్రీ జాతిని వంటింటికి  పరిమితం చేసి భర్తలకు బానిసలుగా చేసిన రోజుల్లో స్వేచ్ఛ సమానత్వం, స్త్రీ జాతి విముక్తికి మహాత్మపూలే గారే సావిత్రిబాయి పూలే కి గురువు అయినాడు. పూలే అడుగుజాడల్లో అక...

జనవరి 1ఆంగ్లనూతన సంవత్సరం కాదు.

చిత్రం
చాలా మంది జనవరి 1 ని  ఆంగ్ల నూతన సంవత్సరం అని సంబోధిస్తున్నారు. ఇది ఆంగ్ల సంవత్సరం కాదు. ఇది అంతర్జాతీయ నూతన సంవత్సరం. ఇది ప్రపంచ దేశాల నూతన సంవత్సరం.      ప్రస్తుతం మనం వాడుతున్న కాలెండర్ కు ఇంగ్లీష్ వారికి సంబంధంలేదు.  క్రీస్తుపూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా దీన్ని రూపొందించారు.16వ శతాబ్దంలో అప్పటివరకు వాడుతున్న జులియన్ కాలెండర్లోని లోపాలను సరిదిద్దుతూ, ఇటలీకి చెందిన పొప్ గ్రగేరిన్ 13 అనేఅతను ప్రస్తుత కాలెండర్ను రూపొందించారు. ఇతను ఇటలీకి చెందినవాడు.  ఆతరువాత  దానిని ప్రపంచం ఆమోదించింది. అది సూర్యుని చుట్టూ భూమి తిరిగే వాస్తవ కాలానికి చాలా దగ్గరగా ఉండటం వలననే ప్రపంచం మొత్తం దానినే ఆమోదించింది. ఇటలివాళ్లో, ఇంగ్లీష్ వాళ్ళో కాదు. ఈ క్యాలెండర్ ను భారత్ తో సహా మొత్తం ప్రపంచం ఆమోదించింది.ప్రపంచ కార్య కలాపాలన్నీ ఈ కాలెండర్ ఆధారంగానే జరుగుతున్నాయి. అసలు కీలకమైన విషయం ఏమంటే, ఈ కాలెండర్ భూభ్రమణ సమయానికి దాదాపు ఖచ్చిత సమయం చూపుతూ తయారు చేయబడినది.  అందువల...

నా కవితల మల్లెతీగ

1.శార్వరీ! నువు తేవద్దు చీకటి            ____పిళ్లా కుమారస్వామి                    9490122229 శార్వరీ కొన్నాళ్ళు రాకు ఇక్కడ కరోనా రాకాసి తిరుగుతోంది నువ్వు వస్తున్నావన్న ఆనందమే కరవైంది మేమిప్పుడు క్వారంటైన్లో వున్నాం అప్పుడెప్పుడో తెగిపోయిన బంధాలపోగుల్ని అతికించుకొంటున్నాం ఎక్కడో తప్పిపోయిన జీవితాన్ని వెతుక్కుంటున్నాం శార్వరీ నువ్విప్పుడు  రాకు వికారి నిన్ననే శెలవు తీసుకొంది పోతు పోతూ కోవిడ్ను మాకిచ్చి పోయింది దారి తప్పిన  జీవన విధానాన్ని గాడిలోకి తెచ్చుకోవాలి ఒకరినొకరు కరచాలనాలు మరచి అలాయ్  బలాయ్ లొదలి ఆప్యాయతా ఆలింగనాల్ని వదలి మాలో మేము చూసుకుంటూ ఎక్కడ వారక్కడ గప్ చుప్ ఆటలాడాలి ఓ శార్వరీ  ఈ విషాదసమయం లో నిన్ను ఆహ్వానించలేము మేమెలాగూ తిప్పలు పడుతున్నాం కోయిల చావు గీతం పాడిందే వసంతం కరోనాగీతం ఆలపిస్తోందే నీకు వినిపించలేదా ఇక్కడిప్పుడు జనాభా లెక్కల సేకరణ ఆపేశారు యన్ పి ఆర్ ను వాయిదా వేసినారు దేవళాల తలుపులు వేసినారు ఊర్లోకి దారులు మూసినారు ఇప్పుడు బతుకుపోరు కాదు మాముందున్నది బతికేందుకు పోరా...

ప్రచారం వల్ల ఎవరూ గొప్ప కవులు కారు!

చిత్రం
          Pc:a blog of one's own ప్రచారం వల్ల ఎవరూ గొప్ప కవులు కారు!  లెజండ్స్‌ వాళ్ల కాలానికి మాత్రమే అధిపతులు. తరువాతి కాలానికి వాళ్ళు లీడ్‌ ఇవ్వగలరు గానీ లీడ్‌ చేయలేరు. చారిత్రక, సామాజిక, వ్యక్తిగత పరిమితులు అందరి మీదా వుంటాయి. ఆ పరిమితుల మధ్యనే కొందరు సమాజం మీద గొప్ప సానుకూల ప్రభావాలను వేస్తారు. వాళ్ళనే తరువాతి తరాలు గుర్తు చేసుకుంటారు. గురజాడ, శ్రీశ్రీ, శివసాగర్‌ తదితరులు ఆ కోవలోనికి వస్తారు.   కులవర్గ సమాజంలో ఏ చారిత్రక దశల్లో అయినా అందరికీ ప్రాతినిధ్యం వహించే కవులు వుండరు. అందరూ మెచ్చుకునే ఆలోచనాపరులు కూడా వుండరు. ఎవరి కవులు వారికి, ఎవరి ఆలోచనాపరులు వారికి వుంటారు. గురజాడ, శ్రీశ్రీలను సాహిత్యంలో అందరికీ ప్రాతినిధ్యం వహించిన కవులు అనే అర్థంలో మహాకవులు అనడం ఒక అతివ్యాప్తి దోషం. వాళ్ళను ప్రముఖ తెలుగు కవులు అని గౌరవించుకుంటే సరిపోతుంది.   గురజాడ కార్మికుల గురించి రాయలేదు. విజయనగరం సంస్థానంలో లక్ష్మీపురం వద్ద చెరకు ఫ్యాక్టరీ వచ్చినప్పటికీ ఆ కార్మికుల్ని గుర్తించలేదు. ఆయన మన్యంలో పుట్టి పెరిగాడు. 1879లోనే మన్యం పితూరి మొదలయ్యింది. మద్...

తెలుగు భాషకు "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అనే బిరుదు ఎలా వచ్చిందంటే

చిత్రం
        pc : m.jagranjosh.com              శ్రీకృష్ణదేవరాయలు కన్నా 95 సంవత్సరాలకు ముందే ఇటలీ భాషా శాస్త్రజ్ఞుడు నికోల డి కొంటి( Niccolò de' Conti  (c. 1395–1469) was an  Italian merchant, explorer, and writer. Born in   Chioggia, who traveled to  India and Southeast Asia, and possibly to Southern China, during the early 15th century. He was one of the human sources used to create the 1450  Fra  Mauro map, which indicated that there was a sea route from Europe around Africa to India.) క్రీ.శ. 1420 _21 లో రాయలసీమ ప్రాంతంలో తిరిగి తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని కొనియాడారు. తెలుగు ఇటలీ భాష లాగా అజంత భాష కావడం వల్ల నూ, తెలుగులో సంగీత ధారా ప్రవాహం ఉండటం వల్లనూ ఆయన ఈ భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఉంటారని పరిశోధకులు భావించారు. ఇది  తెలుగుకు ఒక బిరుదుగా మారింది.           తెలుగు తేనెకన్నా తియ్యనిది. అది మధురమైన భాష.    ...

కవి కోకిల సరోజినీ nightingale of India

చిత్రం
        pc: pinterest సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949)  ♦భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి. సరోజినీ దేవి 1925డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా. ♦బాల్యము♦ ♦దేశం బానిస తనం నుంచీ, నియంతృత్వ సంకెళ్ళ నుంచీ విముక్తి పొంది నాది, నేను అన్న భావంతో అఖిల భారత ప్రజానీకం స్వేచ్ఛా, స్వాత్రంత్ర్యాలతో జీవించాలన్నదే వారి మహత్తర ఆశయం. అటువంటి పూజనీయులైన పురుషులే కాక, భారత మహిళలు ఏ రంగంలోనూ, తీసిపోరని నిరూపించిన వీమహిళలు మన దేశంలో చాలా మంది పుట్టారు. అటువంటి వారిలో శ్రీమతి సరోజినీ నాయుడు కూడా ఒకరు. సరోజిని నాయుడు మంచి రచయిత్రి. పద్య రచయిత. ♦ఈమె క్రీ.శ. 1879 వ సంవత్సరం పిబ్రవరి నెల 13 వ తేదీన హైదరాబాద్లో జన్మించారు.తండ్రి డా. అఘోరనాథ్ చటోపాద్యాయ, తల్లి శ్రీమతి వరద సుందరి. అఘోరనాథ్ చటోపాథ్యాయ గారు హైదరాబాదు కాలేజికి, (అనగా నేటి నిజాం కాలేజీ) మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసారు. తల్లి ...