తెలుగు భాషకు "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అనే బిరుదు ఎలా వచ్చిందంటే
శ్రీకృష్ణదేవరాయలు కన్నా 95 సంవత్సరాలకు ముందే ఇటలీ భాషా శాస్త్రజ్ఞుడు నికోల డి కొంటి(Niccolò de' Conti (c. 1395–1469) was an Italian merchant, explorer, and writer. Born in Chioggia, who traveled to India and Southeast Asia, and possibly to Southern China, during the early 15th century. He was one of the human sources used to create the 1450 Fra Mauro map, which indicated that there was a sea route from Europe around Africa to India.) క్రీ.శ. 1420 _21 లో రాయలసీమ ప్రాంతంలో తిరిగి తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని కొనియాడారు. తెలుగు ఇటలీ భాష లాగా అజంత భాష కావడం వల్ల నూ, తెలుగులో సంగీత ధారా ప్రవాహం ఉండటం వల్లనూ ఆయన ఈ భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఉంటారని పరిశోధకులు భావించారు. ఇది తెలుగుకు ఒక బిరుదుగా మారింది.
తెలుగు తేనెకన్నా తియ్యనిది. అది మధురమైన భాష.
తెలుగు భాషకు ఉన్న వైదుష్యాన్ని చెపుతూ శ్రీనాథుడు ( నెల్లూరు గుంటూరు సరిహద్దు ప్రాంతం ఇప్పటి ప్రకాశం జిల్లా,చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర - బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి (1365–1441) 15 వ శతాబ్దికి చెందిన తెలుగు కవి, దివ్యప్రబంధన శైలికి ఆదరణ కల్పించిన కవి).
"జనని సంస్కృతంబు సకల భాషలకును/
దేశ భాషలందు తెలుగు లెస్స " అనన్నాడు. (సంస్కృతం దక్షిణాది ద్రావిడ భాషలకు జనని కాదు ని ఆనాటి శ్రీనాధుని కి తెలియదు).
అదే విధంగా కృష్ణదేవరాయలు తెలుగు విశిష్టతను చెబుతూ
" తెలుగదేల యన్న దేశంబు తెలుగేను/
తెలుగు వల్లభుండ తెలుగొకండ /
ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి/
దేశ భాషలందు తెలుగు లెస్స"
అంటూ తెలుగు గొప్పతనాన్ని కీర్తిస్తూ తెలుగు కు పట్టం కట్టాడు. ఒక చేత్తో కరవాలాన్ని, మరో చేత్తో ఘంటాన్ని తిప్పాడు.
పాల్కురికి సోమనాథుడు(పాల్కురికి సోమనాధుడు (1160 - 1240), శివకవి యుగానికి చెందిన తెలుగు కవి. తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. పాల్కురికి వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే దంపతులకు జన్మించాడు. జన్మతహా బ్రాహ్మణుడైనా, వీరశైవ మతం మీద అనురాగంతో ఆ మత దీక్ష తీసుకున్నాడు. ఇతడు గురువు కట్టకూరి పోతిదేవర వద్ద శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు.) ప్రజల భాషైన జాను తెనుగు కు పట్టం కడుతూ "ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై పరిగిన జానుతెనుగు లో ద్విపదలు" రాస్తానన్నాడు. రాశాడు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి