జనవరి 1ఆంగ్లనూతన సంవత్సరం కాదు.

చాలా మంది జనవరి 1 ని  ఆంగ్ల నూతన సంవత్సరం అని సంబోధిస్తున్నారు. ఇది ఆంగ్ల సంవత్సరం కాదు. ఇది అంతర్జాతీయ నూతన సంవత్సరం. ఇది ప్రపంచ దేశాల నూతన సంవత్సరం.
     ప్రస్తుతం మనం వాడుతున్న కాలెండర్ కు ఇంగ్లీష్ వారికి సంబంధంలేదు. 

క్రీస్తుపూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా దీన్ని రూపొందించారు.16వ శతాబ్దంలో అప్పటివరకు వాడుతున్న జులియన్ కాలెండర్లోని లోపాలను సరిదిద్దుతూ, ఇటలీకి చెందిన పొప్ గ్రగేరిన్ 13 అనేఅతను ప్రస్తుత కాలెండర్ను రూపొందించారు. ఇతను ఇటలీకి చెందినవాడు.  ఆతరువాత  దానిని ప్రపంచం ఆమోదించింది. అది సూర్యుని చుట్టూ భూమి తిరిగే వాస్తవ కాలానికి చాలా దగ్గరగా ఉండటం వలననే ప్రపంచం మొత్తం దానినే ఆమోదించింది. ఇటలివాళ్లో, ఇంగ్లీష్ వాళ్ళో కాదు. ఈ క్యాలెండర్ ను భారత్ తో సహా మొత్తం ప్రపంచం ఆమోదించింది.ప్రపంచ కార్య కలాపాలన్నీ ఈ కాలెండర్ ఆధారంగానే జరుగుతున్నాయి. అసలు కీలకమైన విషయం ఏమంటే, ఈ కాలెండర్ భూభ్రమణ సమయానికి దాదాపు ఖచ్చిత సమయం చూపుతూ తయారు చేయబడినది.  అందువల్లనే మనదేశంలో జనవరి 1 ఈ రోజు అర్ధరాత్రి  ప్రారంభం అయిందనుకుంటే, అమెరికాలో ఈ రోజు  సాయంత్రం  ప్రారంభమవుతుంది. న్యూజిలాండ్ లో నిన్ననే ప్రారంభమై ఉంటుంది. అందువలన జనవరి 1 భారత్ తో సహా ప్రపంచదేశాల సంవత్సరాది.

(Aanjaneyulu,vijayawada)

మరి భారతదేశం జాతీయ క్యాలెండర్ ఏది?



వాస్తవానికి భారతదేశం కూడా గ్రెగోరియన్ క్యాలెండర్‌నే అనుసరిస్తోంది. కానీ, ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం శాలివాహన శకాన్ని కూడా పాటిస్తున్నారు.

దాన్ని బట్టి చూస్తే ఈ రోజు 1940వ సంవత్సరం పుష్య మాసం 11వ తేదీ.

అమ‌రావ‌తి కేంద్రంగా పాలించిన గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి ప‌ట్టాభిషిక్తుడైన నాటి నుంచీ శాలివాహ‌న శ‌కం ప్రారంభం అయ్యిందని భావిస్తుంటారు. అలా ఇప్ప‌టికి 1939 ఏళ్లు గ‌డిచాయి. ఇప్పుడు 1940వ సంవత్సరంలో ఉన్నాం. తెలుగు, క‌న్న‌డ‌, మ‌రాఠీ ప్ర‌జ‌లు ఈ కేలండర్ వాడ‌తారు.

ఈ శాలివాహన శకం, క్రీస్తు శకం కంటే 78 నుంచి మొదలవుతుంది.

శాలివాహన శకం క్యాలెండర్‌లో మొదటి మాసం చైత్రం. సాధారణంగా ఇది మార్చి 22వ తేదీన వస్తుంది. లీపు సంవత్సరం అయితే మార్చి 21వ తేదీన వస్తుంది.

భారత ప్రభుత్వం 1957 మార్చి 22వ తేదీ నుంచి ఈ శాలివాహన శకం క్యాలెండర్‌ను అధికారికంగా పాటిస్తోంది.

భారత ప్రభుత్వ రాచపత్రం (గెజిట్), ఆలిండియా రేడియో వార్తల ప్రసారం, భారత ప్రభుత్వం జారీ చేసే క్యాలెండర్లు, ప్రజలకు అందించే సమాచారానికి సంబంధించిన రాతప్రతులపై గ్రెగోరియన్ క్యాలెండర్ తేదీలతో పాటుగా శక క్యాలెండర్‌ తేదీలను పొందుపర్చాల్సి ఉంటుంది.(బిబిసి)



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు